Welcome to the BLISSFUL journey

యోగ శుద్ధి మూడవ వారం

0

మూడవ వారం

శరీరం: స్థూల శరీర శుద్ధి కోసం సూర్య ప్రణామం.

సూక్ష్మ శరీర శుద్ధి కోసం  వెల్లుల్లి, వేప,యాలుక, మిరియాలు

మనసు: ఓం కారాలు, దీర్ఘ శ్వాసలు.

ఆత్మ: ఆత్మ శక్తికి, జ్ఞాన వికాసానికి 21 లేదా  49 నిమిషాల సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన

 

వెల్లుల్లి:
వెల్లుల్లి, వంటింట్లో అధికంగా వాడే పదార్థమే అయినా, దానిలో ఉన్న ఔషధ విలువలు వేల కట్టలేనివి. వెల్లులిలో విటమిన్ బి 6 ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా దీన్ని చికిత్సలో భాగంగా వినియోగిస్తారు. కాన్సర్ కు, నొప్పులకు, దోమల నివారణలో అద్భుతంగా పనిచేస్తుంది.

వేప:
శక్తి స్వరూపంగా భావించే వేప వృక్షమే దేవీ అవతారంగా కొలుస్తారు. ఎంతటి మలినమైనా ఎదుర్కొని దేహానికి రోగ నిరోధక శక్తి ని ప్రసాదించే దివ్యమైన వృక్షం వేప. ప్రకృతి మాత ప్రసాదంగా భావించి వేప ఆకులను మరిగించి స్వీకరించండి.

ఓంకారం

ఓంకారం మహామంత్రం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే ఓంకారం. ఈ ప్రణవ నాదాన్ని నాభి నుంచి ఉచ్ఛరించినప్పుడు బీజ రూపంలో ఉన్న జన్మ వాసనలు, జ్ఞాపకాలు, కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్యాలు సాధనకు అడ్డంకులుగా నిలవకుండా, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ బీజాలు విష వృక్షాలుగా మారి విజృంభించకుండా ఉండటానికి నాభి స్థానం నుంచి ఓంకారం చెయ్యాలి. ఇలా ఓంకారం చెయ్యటం వల్ల ధ్యాన సాధన కూడా సుగమం అవుతుంది. అన్ని మంత్రాలకు ఆది, పునాది ఓంకారం.

శ్వాస

శ్వాస మానవ శరీరా లైన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను బంధించే సూత్రం. శ్వాస లేనిదే ఈ జగతి లేదు. దీర్ఘ శ్వాస ద్వారా అంతః క్లేశములు తొలగిపోతాయి. శ్వాస లోపలికి తీసుకున్నపుడు ఆరోగ్యం, ఆనందం, ధైర్యం, విజయం ఇంకా ఎన్నో సత్ గుణాలు కావాలని భావం చేస్తే గురువులు అనుగ్రహిస్తారు. శ్వాస విడిచేటప్పుడు ఏ గుణాలు, లక్షణాలు మన జీవితానికి అవాంతరాలుగా ఉన్నాయో వాటిని విడిచి పెడుతున్నట్లు భావం చేస్తూ శ్వాసను విడవాలి.

సూర్య నమస్కారాలు

సూర్యుడిని సూర్యభగవానుడిగా భావిస్తుంది భారతీయ సనాతన ధర్మం. ఎందరో యోగులు సూర్య రశ్మి కారణంగా వందల సంవత్సరాలు శరీరాన్ని నిలుపుకున్నట్లు గాధలు ఉన్నాయి. సూర్యుడి బంగారు కాంతికి మానవ సహస్రారంలో ఉన్న రహస్య ఆధ్యాత్మిక గ్రంథికి సంబంధం ఉండటం వల్ల సూర్యోదయ సమయంలో అధికమైన శక్తి ప్రకంపనలు ఆ ప్రదేశంలో కలుగుతాయి. భక్తి ప్రపత్తులతో సాక్షాత్ గురు స్వరూపంగా భావించి సూర్యుడికి నమస్కారం చెయ్యండి.

 

యాలుక :
మసాలాలకు రాణి ఇలాచీ. యాలుక స్వాధిష్ఠాన, మణిపూరక చక్రంలో శుద్ధికి తోడ్పడుతుంది. ఉదర సంబంధిత రుగ్మతలను నివారించగల ఔషధం ఇది. గుండె పోటు రాకుండా, రక్త పోటును నియంత్రించగల పదార్థం ఇది. నోటి దుర్వాసన తదితర సమస్యలతో పాటు చక్కని కేశాలు, కాంతిమంతంగా మెరిసే చర్మం యాలుక వినియోగం ద్వారా పొందవచ్చు.

మిరియాలు
మిరియాలు జీర్ణ కోశాన్ని సమర్ధవంతంగా పనిచేసేలా చేయగలవు. జీర్ణానికి కావాల్సిన ద్రవాలను తయారుచేసి ఆకలి, జీర్ణం సరిగ్గా జరిగేలా చేస్తాయి. సౌర శక్తిలో ఎటువంటి గుణం అయితే ఉంటుందో జఠరాగ్ని ద్వారా తిన్న ఆహారాన్ని మెరుగ్గా జీర్ణం చెయ్యగల శక్తి మిరియాల్లో ఉంటుంది.

ఇతరులతో పోలిక వదిలిపెట్టడం” గురించి మరిన్ని విషయాల కోసం దీనిపై క్లిక్ చేయండి.

49 రోజుల యోగ శుద్ధి“గురించి మరిన్ని విషయాల కోసం దీనిపై క్లిక్ చేయండి

 

 

 

 

Share.

Comments are closed.