Welcome to the BLISSFUL journey

యోగ శుద్ధి 1 వ వారం

0

ఓంకారం

ఓంకారం మహామంత్రం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే ఓంకారం. ఈ ప్రణవ నాదాన్ని నాభి నుంచి ఉచ్ఛరించినప్పుడు బీజ రూపంలో ఉన్న జన్మ వాసనలు, జ్ఞాపకాలు, కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్యాలు సాధనకు అడ్డంకులుగా నిలవకుండా, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ బీజాలు విష వృక్షాలుగా మారి విజృంభించకుండా ఉండటానికి నాభి స్థానం నుంచి ఓంకారం చెయ్యాలి. ఇలా ఓంకారం చెయ్యటం వల్ల ధ్యాన సాధన కూడా సుగమం అవుతుంది. అన్ని మంత్రాలకు ఆది, పునాది ఓంకారం.

 

శ్వాస

శ్వాస మానవ శరీరా లైన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను బంధించే సూత్రం. శ్వాస లేనిదే ఈ జగతి లేదు. దీర్ఘ శ్వాస ద్వారా అంతః క్లేశములు తొలగిపోతాయి. శ్వాస లోపలికి తీసుకున్నపుడు ఆరోగ్యం, ఆనందం, ధైర్యం, విజయం ఇంకా ఎన్నో సత్ గుణాలు కావాలని భావం చేస్తే గురువులు అనుగ్రహిస్తారు. శ్వాస విడిచేటప్పుడు ఏ గుణాలు, లక్షణాలు మన జీవితానికి అవాంతరాలుగా ఉన్నాయో వాటిని విడిచి పెడుతున్నట్లు భావం చేస్తూ శ్వాసను విడవాలి.

తులసి

పరమగురువులైన శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారి గౌరి శంకర్ పీఠం లో సైతం దర్శనమిచ్చే పవిత్రమైన మొక్క తులసి. తులసిలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక లాభాలు కలిగించే ఔషధ గుణాలు పుష్కలంగా ఉండటం వల్లే తులసి ఆకులను దేవాలయాల్లో కూడా తీర్థంగా ఇస్తారు. విషపూరితమైన గాలిని కూడా శుద్ధంగా మారుస్తుంది తులసి. తులసి ఆకులను ప్రకృతి మాత అందించిన దివ్య ఔషధంగా భావించి ఈ ఆకులను మరిగించి స్వీకరించండి.

 

 

తమలపాకు

మేథా ధాతువును అంటే కొవ్వును నియంత్రించే దివ్య గుణాలు తమలపాకులో ఉన్నాయ్. ప్రతీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వినియోగించే పత్రిలో తమలపాకు ప్రధానమైనది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఈ ఆకులను తాంబూలానికి వాడినందున ఈ ఆకులకు అంత ప్రాముఖ్యత ఏర్పడింది. మధుమేహం, కాన్సర్ నియంత్రణలో కూడా తమలపాకు అద్భుతంగా పనిచేస్తుంది.

సూర్య నమస్కారాలు

సూర్యుడిని సూర్యభగవానుడిగా భావిస్తుంది భారతీయ సనాతన ధర్మం. ఎందరో యోగులు సూర్య రశ్మి కారణంగా వందల సంవత్సరాలు శరీరాన్ని నిలుపుకున్నట్లు గాధలు ఉన్నాయి. సూర్యుడి బంగారు కాంతికి మానవ సహస్రారంలో ఉన్న రహస్య ఆధ్యాత్మిక గ్రంథికి సంబంధం ఉండటం వల్ల సూర్యోదయ సమయంలో అధికమైన శక్తి ప్రకంపనలు ఆ ప్రదేశంలో కలుగుతాయి. భక్తి ప్రపత్తులతో సాక్షాత్ గురు స్వరూపంగా భావించి సూర్యుడికి నమస్కారం చెయ్యండి.

 

 

బిల్వ పత్రం

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా భాసిల్లే బిల్వ పత్రం అత్యంత పవిత్రమైనది. పరమ శివుడి స్వరూపంగా కొలిచే ఈ బిల్వపత్రం, ఔషధ గుణాలతో పాటు శక్తి శరీరంలో మార్పులు కలగటానికి కారణం అవుతుంది. భగవత్ జ్ఞానం కలిగించే ఆజ్ఞ చక్రాన్ని సూచించే ఈ దళం శ్వాస లో కలిగే ఇబ్బందులను, దోషాలను నివారించగలదు.

లవంగం

ఆధ్యాత్మిక ధ్యాన సాధనలో ముఖ్యమైన మార్పులు సంభవించేవి మెదడులోనే. మెదడుకు మేరుదండానికి సంబంధం అందరికి తెలుసు. మెదడుకు ఉత్తేజవంతమైన శక్తిని కలిగించి అద్భుత ఫలితాలు అందించగల దివ్య గుణం లవంగంలో ఉంది. చూసేందుకు చిన్నదిగా కనిపించే లవంగం లెక్కలేనన్ని ఔషధ గుణాల సంగమం.

అభద్రతా భావం” గురించి మరిన్ని విషయాల కోసం దీనిపై క్లిక్ చేయండి.

49 రోజుల యోగ శుద్ధి“గురించి మరిన్ని విషయాల కోసం దీనిపై క్లిక్ చేయండి

Share.
Leave A Reply