2017 ఫిబ్రవరిలో అమ్మగారి ద్వారా పబ్లిక్ క్లాసులో ఉపదేశం పొందిన శ్రీ వేణుగారు చాలా శ్రద్ధ,భక్తితో విడవకుండా ధ్యానం చేసేవారు, వీరు వరంగల్ వాసి.
ధ్యానం ప్రారంభించిన మొదటి రోజే వారికి జ్యోతి ప్రకాశం, అందులో నక్షత్ర ఆకారంలో ఉన్న సూక్ష్మ బిందువు దర్శనం అయింది. అంతేకాదు కొన్నాళ్ల ధ్యానం తరవాత వీరి నాలుక అప్రయత్నంగా పైకి మలచబడి గొంతులో ఉండే కొండ నాలుక మూలాన్ని స్పర్శించగలిగింది. అది ఖేచరీముద్ర అని, చాలా సాధన తర్వాత కానీ జరగని ఈ అనుభవం ఇంత తొందరగా అనుభవం అయింది అని తెలిసినప్పుడు వేణు గారికి ధ్యానం గురించి మరింత శ్రద్ధ పెరిగింది. ధ్యానం చేస్తున్న కొద్దీ వారి ఆలోచనా విధానంలో మార్పులు, చేతల్లోను మాటల్లోను అవేర్నెస్, నేను ఆత్మ స్వరూపున్ని నాకు ఈ శరీరం ఉన్నది అన్న పరీంగిత జ్ఞానం వికసించటం ప్రారంభమైంది.
తిరుచెందూర్ గురు పౌర్ణమికి వచ్చిన వీరిలో హోమ సమయంలో పరమాద్భుతమైన దృశ్యానుభవ ఆశీర్వచనం లభించింది. అందరూ సుషుమ్న క్రియా యోగ ధ్యానులు గుండ్రంగా కూర్చుని ఉన్నారు. మధ్యలో శ్రీ ఆత్మానందమయి అమ్మగారు హోమం చేస్తున్నారు. అది సముద్రపు ఒడ్డు , ఉన్నట్లుండి సముద్రం మధ్యలో ఒక పద్మం వికసించి, సముద్రం మొత్తం వ్యాపించింది. ఆ పద్మం మధ్యలో ధవళ వస్త్రధారిని అయిన శ్రీ ఆత్మానందమయి అమ్మగారు దర్శనమిచ్చారు. ఉదయించిన పూర్ణచంద్రబింబం ఆమె బొట్టుగా ప్రకాశించింది. నక్షత్రం ఒకటి ముక్కుపుడకగా మారింది అమ్మగారి నుదుటి నుంచి వెలువడిన కాంతి కిరణం సముద్రం మీద శ్రీచక్రాన్ని రూప కల్పనము చేసింది. ఆ శ్రీచక్ర మధ్య భాగంలో వింత కాంతులు వెదజల్లుతున్నాయి.అమ్మగారు కారుణ్యంతో కూడిన చిరు దరహాసంతో అక్కడకి విచ్చేసిన ధ్యాన యోగులు అందరి మీద ప్రేమ పూర్వక కరుణా కటాక్షాలు ప్రసరింప చేస్తున్నారు. ఈ అద్భుతమైన అనుభూతిని జీవితంలో మర్చిపోలేను అంటారు వేణుగారు.
అమ్మగారికి సన్నిహితంగా ఉన్న వారికి మాత్రమే అద్భుతమైన అనుభవాలు కలుగుతాయి అన్న అపోహలో చాలా మంది ఉంటారు కానీ సన్నిహితత్వం ,అనుగ్రహం,దర్శనం ఇవి కేవలం స్పర్శ, దగ్గరితనం వల్ల మాత్రమే రావు… శ్రద్ధ,భావముతో ఉన్నపుడు గొప్పగా ఇవి ఎర్పడుతాయి అని వేణుగారి అనుభవాలు చెబుతాయి మనకి.
About Sushumna Kriya Yoga
Recent Posts
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |
Welcome to the BLISSFUL journey