జీవితంలో చాలా నీరసంగా, నిస్సారంగా,ప్రపంచ జ్ఞానం లేనట్లు, ఏ విషయంలోనూ విజయం సాధించలేనట్లు ఉండే చాలా మందిని చూసి వారి కుటుంబ సభ్యులు “ఇతను ఏవిధంగా నన్నా బాగు పడితే బాగుంటుంది” అని ప్రార్థిస్తూ వుంటారు.కానీ,అటువంటి వారిపై గురు కటాక్షము ప్రసరించి, మాయ పొర తోలగగానే వారి లోపలి అద్భుతమైన ఆత్మశక్తి నిద్ర లేవడముతో, ఆ వ్యక్తి అనుభవాలు చాలా గొప్పగా ఉంటాయి అటువంటి వారే వెంకట్ గారు.
మహాపర్వదినమైన విజయదశమినాడు అమ్మగారిని దర్శించిన వెంకట్ గారికి, అమ్మగారి వెనకాల పాలపుంత వంటి తెల్లని “ఆరా”ను దర్శించగానే ఈ గురుమాత సామాన్యులు కారని వెంకట్ గారికి అర్థమైపోయింది.2012 లో శ్రీ ఆదిశంకరుల జయంతిన ధ్యానము చేసి పడుకున్న వెంకట్ గారికి ఒక అద్భుతమైన స్వప్నానుభవము కలిగింది.ఒక దివ్య స్త్రీ మూర్తి చాలా పొడుగ్గా, పెద్ద జుట్టుతో చాలా మంది శిష్యులతో దర్శనమిచ్చారు.గణపవరంలోని అంజలిగారు ఆ శిష్య బృందంలో కనిపించారు.ఎవరి ధ్యాన స్థితి ఏమిటో తెలుసుకోవడానికి ఆమె ప్రతి ఇంటిని దర్శిస్తూ, శ్రీ వెంకట్ గారి దగ్గరికి వచ్చి, అమ్మగారి గురించి “ఈమె ఎనిమిదేళ్లుగా ఒక మహా శక్తి, ఈమెను ఎవరూ విమర్శించ రాదు….”అని ఆదేశమిచ్చారు. ఆ తరవాత అమ్మగారిని కనుక్కుంటే – “ఆమె ఎవరో కాదు శ్రీ మహావతార్ బాబాజీగారి సోదరి నాగలక్ష్మీ మాతాజీగారు అని అమ్మగారు శలవిచ్చారు. ఆ తరవాత ఆమె చిత్ర పఠాన్ని చూసి తనకు దర్శనమిచ్చిన మహానుభావురాలు ఆమెగారే అని గ్రహించారు వెంకట్.అట్లాగే 2012 జూలైలో శివలోక దర్శనం చేసిన వెంకట్ గారికి అది ఆస్ట్రల్ ప్లేన్ లో ఉంటుంది ఆ లోకము పేరు “రుద్ర” అని తెలియచేశారు అమ్మగారు.
వెంకట్ గారికి తండ్రితో చిన్న మాట పట్టింపు వచ్చింది.అప్పటికే వెంకట్ గారికి ఇంజనీరింగ్ లో 18 సబ్జెక్ట్ లు బ్యాక్ లాగ్ లో ఉన్నాయి…అప్పుడు అమ్మగారు…వెంకట్ ఇప్పటివరకు నేను ఎవరినీ గురుదక్షిణ అడగలేదు ఈ సబ్జెక్ట్స్ పాస్ అవ్వడమే నాకు నువ్వు ఇచ్చే గురు దక్షిణ… అని చెప్తూ తండ్రితో గొడవ పడాల్సిన సమయం కాదిది, సుషుమ్న క్రియా యోగులు అందరికీ ఆదర్శంగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి అని ఆశీర్వదించారు. తరవాత వెంకట్ అమ్మగారు దయవలన సంవత్సరంలో బ్యాక్ లాగ్ లన్నీ క్లియర్ చేసుకోగలిగారు. 2013 లో సత్సంగము తరువాత ధ్యానము చేసి పడుకున్న వెంకట్ గారికి శ్రీ భోగానాధ సిద్దులు దర్శనమిచ్చి నీకు అసలు కర్మ లేదు ఏదో చిన్నది ఉండడం వల్ల భూమి మీదకు రావలసి వచ్చింది.తీసుకు పోవడానికి సిద్దంగా ఉన్నావు అన్న మాటలు టెలీపతీగా అర్థమై అదేదో అద్భుత లోకంలో ఉన్నట్లు అనిపించింది.ఆ తరువాత నుంచి ధ్యానం చేస్తునపుడు ఎక్కడ ఉన్నా స్వయంగా కనిపించి గైడెన్స్ ఇచ్చేవారు అమ్మగారు.2016 దీపావళి నాడు శ్రీ మహావతార్ బాబాజీగారు తన హృదయంలో ఉన్నట్టు తను శ్రీ బాబాజీ గారి హృదయం నుండి జనించినట్లు కలిగిన అద్భుతమైన అనుభవం ఆ రాత్రంతా ఉన్నది వారికి.
ఈ సుషుమ్న క్రియా యోగము వలన వెంకట్ గారికి, లోకజ్ఞానం,అవగాహన,విజయాలు చూడగలిగారు.తనను ఈ స్థితికి తీసుకువచ్చిన అమ్మగారికి కృతజ్ఞతా పూర్వక పాదాభివందనాలు అంటారు వెంకట్.
About Sushumna Kriya Yoga
Recent Posts
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |
Welcome to the BLISSFUL journey