Welcome to the BLISSFUL journey

స్వర్ణలత అనుభవాలు

0

సుషుమ్న క్రియా యోగంలో మమైక్యం చెంది,భక్తి ,జ్ఞాన వైరా గ్యాలు కలిగిన విజయలక్ష్మిగారి వంటి తల్లి ఉండడం అదొక మహదైశ్వర్యం.వారి కుమార్తె అయిన స్వర్ణలత గారికి 2010 లో దీక్షా అమ్మగారి దర్శన భాగ్యం కలిగాయి…కెనడా వచ్చిన తరువాత ధ్యానంలో “ఆత్మే సత్యము – ఆత్మే నిత్యము” అన్న అనాహత శబ్దాన్ని విన్న అదృష్టవంతురాలు ఈమె.
ప్రతి రోజూ ధ్యానానికి అలారం పెట్టుకోక పోయినా.. ఆమెను అదే సమయానికి గురువులు లేపుతున్నారని అర్థం చేసుకున్నారామె.గ్రూప్ మెడిటేషన్ లో శ్రీ కృష్ణుల వారు ,వినాయకులు ,ఆంజనేయ స్వామి ఈమెకు కనిపించి “మమ్మల్ని ఏ కోరికలు సుషుమ్న క్రియా యోగులు కోరనవసరం లేదు మీరు ధ్యానం చేస్తూ ఇంకొకరికి పంచటం వలన మీ కర్మలు మీరే దగ్ధం చేసుకోవచ్చును” అన్న సందేశం సుషుమ్న క్రియా యోగలందరికీ శిరోధార్యము.
శ్రీ లాహిరి మహాశయుల పుట్టినరోజున వారు శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారికి పాద నమస్కారము చేస్తూ స్వర్ణలత గారికి దర్శనమిచ్చారు.నిజానికి ఆరోజు శ్రీ లాహిరి మహాశయుల పుట్టినరోజు అన్న విషయమే ఆమెకు తెలియదు.
శృంగేరి గురు పౌర్ణమికి కెనడా నుంచి బయలుదేరిన వీరికి పెద్ద ప్రమాదం గురువులే తప్పించారని అర్థమైంది. శృంగేరిలో గురు పౌర్ణమి పూజ, యజ్ఞము అయిన తరవాత శృంగేరి శారద మాత, కొల్లూరు మూకాంబికా అమ్మవారి దర్శనం తరువాత, శ్రీ అన్నపూర్ణ దేవిగుడిలో అమ్మగారితో ధ్యానము చేస్తున్నప్పుడు అమ్మగారు శ్రీ అన్నపూర్ణమాత విగ్రహం నుంచి వచ్చి, మూడు సార్లు స్వర్ణలత గారికి పొంగలి ప్రసాదం పెట్టారట, అమ్మగారికి ఈ దర్శనం గురించి చెబితే,అమ్మగారు ” మనం ఆదిశంకరుల ఆదేశం ప్రకారము ఆయన స్థాపించిన ముగ్గురు అమ్మవార్ల పీఠాల దగ్గర ధ్యానం చేశాము కాబట్టి ముగ్గురు అమ్మవార్లు నీకు ప్రసాదం అనుగ్రహించారు” అని చెప్పారు…అంటే అక్కడ ధ్యానులందరికీ ఈ అధ్బుతం ఆస్ట్రల్ లో జరిగే ఉంటుంది కానీ అది దర్శించే అదృష్టం స్వర్ణలత గారికి జరిగింది అంతే.
తెనాలిలో క్లాస్ చేసే అవకాశము అమ్మగారు ప్రసాదించినప్పుడు స్టేజ్ మీద అమ్మాగారితో పాటు భోగ నాథ సిద్ధులు , మహావతార్ బాబాజీ , లాహిరీ మహాశయులు , యుక్తేశ్వర్ గిరి గారు,పరమహంస యోగానందగారిని దర్శించగలిగారు ఈమె. లాహిరీ మహాశయులు ముద్ర పెట్టుకుని దర్శనం ఇవ్వడం పరమాద్భుతము.ఈ ధ్యానం వలన స్వర్ణలత గారికి చికాకులు టెన్షన్ తగ్గడము.ధ్యానం చేసే ఆమె స్నేహితులకు కూడా అనారోగ్య సమస్యలు తగ్గడము జరిగాయి.
2016 మార్చిలో శివ రాత్రి సమయములో తెల్లవారు జామున మన అమ్మగారు జ్ఞానానంద ఆశ్రమము ముఖద్వారంలో శిష్యులతో కనిపించారు.అమ్మగారి ఇరు పక్కల పరమగురువులు భోగ నాథ మహర్షి గారు,బాబాజీ గారు వారి శిష్యులతో కనిపించారు.ఆవు దూడ దర్శనము ఇచ్చాయి.ఒక పెద్ద ఏనుగు అమ్మగారికి పూలమాల వెయ్యడం కనిపించింది.దారి పొడుగునా ముగ్గులు,పువ్వుల అలంకారాలు , పై నుంచి శివ పార్వతులు గురువులపై పూల వర్షాన్ని కురిపించే అద్భుత దృశ్యము చూశారు స్వర్ణలతగారు.ఆ సంవత్సరము శివ రాత్రి ఉత్సవము భీమవరంలోని జ్ఞానానంద గారి ఆశ్రమంలో జరిగాయి అని కెనడాలో ఉన్న స్వర్ణలత గారికి తరవాతే తెలిసింది.
వీరమ్మాయి కృష్ణప్రియకు కూడా చాలా దివ్యానుభవాలు కలిగాయి.ధ్యానంలో అమ్మగారి ముద్రలో ఒక గ్లోబల్ ఎనర్జీ బాల్ తయారు అయ్యి అది చిన్న చిన్న బాల్స్ గా అందరి ధ్యానముద్రలో కి వెళుతున్నట్లు చూసిందట ఆ పాప.
స్వర్ణలత గారి అనుభవాలు సుషుమ్న క్రియా యోగులకు ఈ ధ్యానం ఎంత గొప్పదో తెలియచేస్తాయి.

Share.

Comments are closed.