కుమారిగారి ద్వారా సుషుమ్న క్రియా యోగం గురించి తెలుసుకున్న సుబ్బలక్ష్మిగారికి కొద్ది రోజుల్లోనే అమ్మగారి దర్శనభాగ్యం,దీక్ష లభించాయి.
థైరాయిడ్ సమస్య,దురద ఇబ్బంది,నీరసం ధ్యానం వల్ల క్రమంగా తగ్గిపోవడంతో ఆమెకు ధ్యానం పట్ల నమ్మకము,ఏకాగ్రత పెరిగాయి.ధ్యానంలో అంతా శ్వేత వర్ణంలో ఒక సుందర లోకం దర్శనమివ్వడం, శ్రీ వశిష్ట మహర్షులవారు దర్శనమివ్వడం,తన పూర్వజన్మలో భునీశ అన్న పేరు,మరొక జన్మలో ముగ్గురు కొడళ్ళున్న ఇల్లాలు దర్శనము ఇవ్వడం ఇలా చాలా చాలా అనుభవాలు ఉన్నాయి ఆమెకి.ఒక జన్మలో పెద్ద ఇంటి ఇల్లాలు అయిన ఆమె ఆ ఇల్లంతా శుభ్రం చెయ్యలేక చేతిలో ఉన్న వస్తువులు విసిరెయ్యడం, విసుక్కోవడం వల్ల ఈ జన్మలో చేతి నిండా డబ్బు ఉన్నా చిన్న ఇంట్లో ఇరకాట పడడానికి కారణం అని తెలిసినప్పుడు అనుక్షణం ఏ భావంతో ఉన్నామో,ఎలా ఆలోచిస్తున్నామే తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఆమెకే కాదు సుషుమ్న క్రియా యోగులు అందరికీ ఎంత అవసరమో తెలుసుకుంటాం.
మరొకసారి ధ్యానంలో పూర్వజన్మలోని చిన్నానను గుడిలో పూజారిగా ఈ జన్మలో గుర్తించారు ఆవిడ.తన కుమారుడి పైచదువులు విదేశీయానం గురించిన ఊహ నిజంగా కనిపించడం,మహా శివుని దర్శనం,పళనిలో శ్రీ భోగనాధ సిద్దులు సమాధి స్థలంలో తను చూసిన శివలింగాన్ని భౌతికంగా దర్శించగలగడం,కూతురు సుష్మి ఏ కాలేజిలో చదువుతారో ముందే తెలియడం ఇవన్నీ ఆమెకి ధ్యాన దర్శనాలుగా అనుభవమయ్యాయి.అమ్మగారి దయ వల్ల వారి అబ్బాయికి మంచి కాలేజిలో సీట్ దొరకడం,జ్యోతిష్యులు ఆ పిల్లవాడికి గండం ఉందన్నప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయినా ఏమాత్రం గాయాలు కాకుండా ఆమె కుమారుడు బైట పడినప్పుడు తను చేస్తున్న ధ్యానం యొక్క ముఖ్యత్వం అర్థమైంది ఆమెకు.సాక్షాత్తు పరమేశ్వరుడు భిక్షకి వచ్చి ఎనర్జీస్ ఇచ్చినప్పుడు ఇది భ్రమా? భ్రాంతా?? అని ఆలోచిస్తున్న ఆమెకి ఇది నిజమేనని ఆ రోజు ఇంట్లో నుండి బైటికి వెళ్లవద్దని కుటుంబ సభ్యులు అందరూ చేతులు పట్టుకుని ధ్యానం చెయ్యండని అమ్మగారు సెలవిచ్చినప్పుడు అసలు ఎనర్జీ ట్రాన్స్ఫరెన్స్ అంటే ఏమిటో సుబ్బలక్ష్మి గారికి అర్థమైంది, పటాల లోంచి ఎనర్జీ రావడం కూడా ఆమెకి తెలిసేది.
సుబ్బలక్ష్మి గారి వంటి సాధారణమైన గృహిణికి కేవలం సుషుమ్న క్రియా యోగం వలన ఇంత అద్భుతమైన అనుభవాలు జరిగాయంటే మనం అందరము కూడా సుషుమ్న క్రియా యోగం యొక్క ప్రత్యేకతని చాలా సులభంగా గ్రహించుకోవచ్చు.
About Sushumna Kriya Yoga
Recent Posts
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |
Welcome to the BLISSFUL journey