వీరి ధ్యానం పద్దతి అంతా భావ ప్రాధానమైనది.అమ్మగారు చెప్పిన బ్రూమధ్య ధ్యానంలోనే అతి ముఖ్యత్వాన్ని గుర్తించ గలిగిన వారు కుమారిగారు.
గంగేచ,యమునేచైవ,గోదావరి,సరస్వతి అని భావ ప్రధానంగా ప్రార్థన చెయ్యగానే గంగా దేవి ఆవిడకు ధవళ వస్త్రాలతో దర్శనం ఇచ్చినప్పుడు, ఆశ్చర్యపడిపోయిన కుమరిగారు తనది కళా బ్రాంతా? అని అమ్మగారిని అడిగినప్పుడు, లేదు అది నిజమైన దర్శనమే అని భావ ప్రాధాన్యత గురించి వివరించారు అమ్మగారు.భావం ద్వారా మన తపన అమ్మగారికి చేరుకోవచ్చుట అందుకే వెంటనే వారి దర్శనం జరుగుతుంది అని అంటారు కుమారిగారు.
వీరికి కొన్ని గంటలు భావంతో ధ్యానం చెయ్యటం అలవాటుగా మారిపోయింది.శ్రీ భోగనాథ సిద్దులు నుంచి కాంతి ధారగా ఆమెలోకి ప్రవహించడం దర్శించ గలిగారు కుమారిగారు.నువ్వు వర్క్ చేస్తావురా ఈ డివైన్ వర్క్ నువ్వు చెయ్యగలవు నీకు ఏమి కావాలన్న నీకు నీ నుంచే అర్థమవుతాయి.మనం ధ్యానం చెప్పడం వల్ల కొంత మందికి విత్తనం పడుతుంది వాళ్ళ కర్మలు బ్యాలన్స్ అయినప్పుడు వాళ్ళు ధ్యానంలోకి వస్తారు.వేదాలన్ని మనలోనే ఉన్నాయి ఆత్మ ధ్యానం పెరిగిన కొద్దీ ఎప్పుడు ఏది అవసరమో అది ఆలోచనగా మాటగా రూపు దిద్దుకుంటుంది.మనం ఈ భూమి మీద జన్మించాము కాబట్టి ఈ మన కర్తవ్యం మనం పూర్తి చెయ్యాలి.ఇటువంటి అద్భుత సంకల్ప దీక్ష అమ్మగారి నుంచి గ్రహించిన కుమారిగారు ప్రతి స్కూల్ కి వెళ్లి ఈ సుషుమ్న క్రియా యోగ దీక్ష నేర్పించాలని తపన పడేవారు.ఎవరి ఆత్మ వారిని నడిపిస్తుంది ఆత్మ ప్రబోధం విన్నావంటే నువ్వు ఎప్పుడూ ఉన్నత స్థితిలోనే ఉంటావు. మనం ధ్యానం చేస్తూ పది మందికి దీక్ష ఇవ్వడంవల్ల మనం మరింత ఉన్నత సోపానాలు అధిరోహించగలమని అర్థం అవుతుంది.మనసు ఆలోచనారహిత ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా వర్క్ చెయ్యగలుగుతాము అమ్మగారి ఈ ఉపదేశం వల్ల ఏ పనైనా సరే మీరే చెయ్యాలి గురువులు నేననేది జీరో అయినప్పుడే చేస్తున్న పనిని సాక్షీ భూతంగా చూడగలుగుతాము. ఆత్మా పరంగా కర్తవ్యం జరిగి పోయిన తరువాత శరీరం ప్రపంచికమైన క్రియని చేస్తుంది అని గురువులని ప్రార్థించి భగవధ్గీత సార మేమిటో జీవన విధానంలో అర్ధం చేసుకున్న కుమారిగారికి జరిగిన అమ్మగారి ఉపదేశాలు సుషుమ్న క్రియా యోగులు అందరికీ శిరోధార్యాలు.
About Sushumna Kriya Yoga
Recent Posts
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 |
Welcome to the BLISSFUL journey