Welcome to the BLISSFUL journey

శ్రీదేవి దేవిశెట్టి అనుభవాలు

0

చాలా లౌకిక జీవితంలో సామాన్య గృహిణిగా,ఆర్థిక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతూ చాలా మామూలు కోరికలు,ఆలోచనలే గొప్పవి అనుకునే స్త్రీ మూర్తి.8 సంవత్సరాల సుషుమ్న క్రియా యోగ ప్రక్రియ వలన తల్లి గారి అనారోగ్యము పోయి,మామూలుగా ప్రారంభించిన బిజినెస్ వంద ఇంతలుగా పెరిగి, ఆవరేజ్ గా చదివే బాబు మంచి మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసి,దివ్యదర్శనాలు వీక్షించి, సాధనలో ఒక భాగమైన “విచారణ”వలన తన వ్యక్తిత్వాన్ని మలుచుకుంటూ, రోజు ఏ పని చేస్తున్నాను ,ఎలా ఆలోచిస్తున్నాను? అని మనస్సు ద్వారా పరిశీలించడం అలవాటు చేసుకుని “ఆత్మో ద్దరణ తప్ప మరొక ఆలోచన రానీయకుండా నన్ను నేను తయారు చేసుకుంటున్నాను” అన్న స్థితికి ఎదగడం.. ఇది ఒక అపూర్వము.
శ్రీదేవి గారు 2010 ఫిబ్రవరిలో సుషుమ్న క్రియా యోగంలో ప్రవేశించారు. ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివి క్రియాయోగం చేస్తున్నాను అని తృప్తిపడే ఈమెకు పార్వతి గారి ద్వారా సుషుమ్న క్రియా యోగ ప్రసాదం దొరికింది. ధ్యానం ప్రారంభములోనే శ్రీ భోగనాథ సిద్ధులు కనబడి మూడు సార్లు “నువ్వు ఎప్పటినుంచో నేర్చుకోవాలనుకున్న క్రియాయోగం ఇదే” – అని చెప్పడము, చుట్టూ సుగంధపరిమళాలు వ్యాపించడము గొప్ప అనుభవము. ధ్యాన సమయంలో ఎదురుగా ఉండే కొండ భగవంతుడి విశ్వరూపము లాగా వారి శరీరం నిండా సాధువులు నిండి పోయారు, సద్గురువులు కనిపించి అందరూ భోగనాథ మహర్షిలో కలిసిపోతూ దర్శనమిచ్చారు. ఆహా! పరమ గురువులంటే వీరెనన్నమాట అని అర్థమైంది ఆమెకు. “సుషుమ్న క్రియా యోగం వల్ల ఎట్లాంటి అనారోగ్యమైన బాగు పడిపోతుంది” అని పార్వతి గారు చెప్పగానే – బి.పి,షుగరు,రొమ్ము కాన్సరు,గుండె జబ్బు – వీటితో యాతన పడుతున్న శ్రీదేవి గారి తల్లి గారికి సుషుమ్న క్రియా యోగము నేర్పించారు.కుటుంబ సభ్యులు అందరూ యోగ సాధన ప్రారంభించారు – తల్లిగారి ఆరోగ్యంలో అధ్బుతమైన మార్పు ,మిగతా వారికి మంచి అనుభవాలు,పరిస్థితులు చక్కబడటము జరిగింది. ఈ సుషుమ్న క్రియా యోగము అందరికీ నేర్పించాలి – అన్న తపనతో, అమ్మగారి ఆశీస్సులతో వైజాగ్ పబ్లిక్ క్లాస్ చేశారు శ్రీదేవి గారు. బాబుకు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే రుద్రాక్షమాల ఇచ్చి దీవించారు.గురువులు తమ కుటుంబానికి రక్షణ కవచం ప్రసాదించారు అన్నది శ్రీదేవి గారి భావన. 2018లో మానససరోవర యాత్ర చేయ్యాలనుకున్న సంకల్పము కొన్ని ఇబ్బందుల వల్ల భగ్నము అయింది.ఒక సోమవారము అమావాస్యనాడు ధ్యానము చేస్తున్న శ్రీదేవి గారికి చేతిలో త్రిశూలము, రుద్రాక్షలు, కమండలము, పూసలు ,కంబలి యజ్ఞరక్షతో సాక్షాత్తు పరమేశ్వర దర్శనము అయింది…”నువ్వు నన్ను చూడడానికి హిమాలయాలకు రానవసరము లేదు”అన్న మనస్సుకు మాటలు వినిపించగానే – నిర్ఘాంతపోయి, “ఇది నా భ్రమ …నా బోటి సామాన్య యువతికి భగవత్ దర్శనము ఇలా జరగడ మేమిటి?!”అనుకోగానే ఆమె శ్రీపాదము నుంచి శిరస్సు వరకు ఒక బంగారు రంగు కాంతి పైకి విరజిమ్మింది. సాక్షాత్ పరమేశ్వరులవారు మన శ్రీ చక్రముద్ర పెట్టి – “ఈ ముద్ర ప్రభావము వలననే నువ్వు నన్ను చూడగలుగుతున్నావు, మాట్లాడుతున్నావు. ఇదంతా దీని ప్రభావమే”… అని సూచించడము, దాదాపు రెండు గంటలు సాగిన ఈ అద్భుత దృశ్యావిష్కరణ కేవలము అమ్మగారి ఆశీర్వచనము అంటారు శ్రీదేవిగారు.
నేను చాలా మంచిదాన్ని, కరుణ, జాలి, దయ ఉన్న గొప్పదాన్ని అనుకునే శ్రీదేవి గారు “విచారణ” అన్న ప్రక్రియ వలన ఆత్మ పరిశీలన చేసుకుని తనకు అక్కర్లేని ఎన్నో గుణాలను,ఆలోచనలను దూరం చేసుకోగలిగారు.
నేను మామూలు మనిషిని ..నాకు ఇటువంటి మహోన్నతమైన సుషుమ్న క్రియా యోగ ప్రక్రియ ఎలా అర్థమౌతుంది ?! అనుకునే వారికి శ్రీదేవి గారి అనుభవాలు సూర్యకాంతి స్పర్శలా స్పందన,అనుభూతి, ప్రాపంచికమైన విజయాలు – ఇలా చాలా నేర్పిస్తాయి.

Share.

Comments are closed.