సంధ్య గారు సింహాచలం లో ఉంటారు. ఆమెకి తరచు తలనొప్పి వస్తూ ఉండేది 2012లో ఒక రోజు పని చేస్తూ పడిపోయి లేవ లేక పోయారు కుడి కాలు చెయ్యి స్పర్శ కోల్పోయింది కొద్ది రోజులు వారు ఎవరిని గుర్తుపట్ట లేకపోయారు ఇరవై మూడు రోజులు ఐసీయూలో విశాఖపట్నంలోని ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిచ్చినా ఫలితం కనబడలేదు అప్పుడు అక్కడ డాక్టర్స్ సంధ్య గారిని బెంగళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సిందిగా సూచించారు అక్కడ డాక్టర్స్ పరీక్షించి ఈమె ఎక్కువ కాలం బ్రతక క పోవచ్చు అని చెప్పారు. బ్రెయిన్ ఆంజీయోగ్రాంలో సంధ్య గారికి మెదడు ఎడమ భాగంలో ఆర్టీరియో వీనస్ మాల్ ఫార్మేషన్స్ ఉన్నట్టు గుర్తించారు. ఆర్టీరియో వీనస్ మాల్ ఫార్మేషన్స్ అనేది రక్తనాళానికి సంబంధించిన ఒక అరుదైన వైకల్యం ఇటువంటి వైకల్యం ఉన్న వారికి తలలో ఒక భాగంలో విపరీతమైన నొప్పి బాధ వస్తూ ఉంటాయి. వీరికి ఫిట్స్ కూడా రావచ్చు అలానే శరీరంలోని కొన్ని భాగాలలో స్పర్శ కోల్పోయి కండరాలు బలహీనపడి శరీరభాగం చచ్చుబడి పోతుంది. కొంతమందికి చూపు కూడా కోల్పోతుంది అలానే వీరికి మాట్లాడటం చాలా కష్టమవుతుంది. నిలకడ లేకుండా గందరగోళానికి ఇతరులను అర్థం చేసుకోలేక పోతారు. మెదడులో రక్తస్రావం అవ్వచ్చు. ఇటువంటి క్లిష్టమయిన వైకల్యంతో బాధపడుతున్న సంధ్య గారికి 2013 లో నిమ్హాన్స్ లో అత్యంత ఆధునిక ట్రీట్మెంట్ గామా నైఫ్ రేడియేషన్ సర్జరీ చేశారు. డిశ్చార్జ్ చేసేటప్పుడు ప్రతి మూడు నెలలకి చెకప్ కి రావాలి అని సూచిస్తూ జీవితాంతం మందులు వాడాలి అని మందులు రాసిచ్చారు. యోగ మెడిటేషన్ చేసుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. 2016లో ఒక యోగా టీచర్ సంధ్య గారికి మన సుషుమ్న క్రియా యోగ ధ్యాన మందిరం అడ్రస్ ఇచ్చి, మన పాంప్లెంట్ ఇచ్చి పంపించారు. అక్కయ్యపాలెం లోని మన సుషుమ్న క్రియా యోగ ధ్యాన మందిరానికి మొదటి రోజు వారు వచ్చినప్పుడు వారు ఏం చెప్తున్నారో అక్కడ ఎవరికీ అర్థం కాలేదు. అలానే మనం చెప్పేది కూడా వారు అర్థం చేసుకోలేకపోయారు. అయినాసరే పట్టుదలతో రెండవ రోజు మళ్లీ ధ్యాన మందిరానికి వచ్చారు. అప్పుడు అక్కడ చిన్న శిరీష గారు ఉన్నారు.వారికి కూడా సంధ్య గారు చెప్పేది ఏమీ అర్థం కాకపోయినా కూడా ఎలాగోలా సంధ్య గారిచేత ధ్యానసాధన చేయించారు. ఆ రోజు ధ్యానం చేస్తున్నప్పుడు చిన్న శిరీష గారికి మన పరమ గురువులైన శ్రీ శ్రీ భోగనాథ మహర్షులవారు సంధ్య గారు తలపై తెల్లటి నూనె మర్దన చేసినట్లు కన పడింది. అలానే సంధ్య గారికి పూర్తిగా నయం అయినట్లు గోచరించింది. ధ్యానం అయిపోతూనే చిన్న శిరీషగారు గురువులు చూపించిన దృశ్యం చెప్పి ఒక్క రోజు కూడా మానకుండా సాధన చేయండి తప్పక మీకు గురుకృప లభిస్తుంది అని చెప్పి పంపించారు. సంధ్య గారు కూడా పూర్తి విశ్వాసంతో పట్టుదలతో ఎనిమిది నెలలు ఈ రోజు ధ్యాన మందిరానికి వచ్చి తన సాధన సాగించారు. గురువులు చూపిన నిదర్శన ఫలితంగా సంధ్య గారు చాలా త్వరగా కోలుకున్నారు. రేడియేషన్ సర్జరీ అయినా మూడు మూడున్నర సంవత్సరాల తర్వాత కూడా చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేకుండా రోజూ మందులు వేసుకోవాల్సిన సంధ్య గారు సాధన మొదలుపెట్టిన ఆరు నెలలోనే నిమ్హాన్స్ డాక్టర్స్ ఏ ఆశ్చర్యపోయే లాగా ఇంప్రూమెంట్ వచ్చింది తనకి వచ్చిన ఇంప్రూవ్మెంట్ ని చూసి అక్కడి డాక్టర్స్ మీరు ఏమి చేస్తున్నారు? అని అడుగగా సంధ్య గారు మన ధ్యానం గురించి మొత్తము వారికి తెలిపారు. వారు ఆశ్చర్య పోతూ ధ్యానం మానకండిఈ సుషుమ్న క్రియా యోగ సాధన మీకు మంచి ఫలితం ఇస్తుంది అని చెప్పి పంపారు తర్వాత 2018లో మళ్లీ ఆంజియోగ్రామ్ చేసి ఇప్పుడు తను పూర్తిగా నార్మల్ స్థితికి వచ్చేసిందని ఎటువంటి మందులు వాడనవసరం లేదని చెప్పి తిరిగి పంపించేశారు. ఎంత అద్భుతమైన లీల ఇది. ఎంతో క్లిష్టమైన సమస్య తో కొన్ని సంవత్సరాలుగా బాధపడ్డ సంధ్య గారు జీవితాంతం మందులు వాడవలసి వస్తుందని చెప్పిన సంధ్య గారికి అత్యంత ఆధునిక చికిత్స పొందిన తరువాత కూడా మూడు మూడున్నర సంవత్సరాలు పెద్దగా ఏ మార్పులేని సంధ్య గారి ఆరోగ్యం లో కేవలంశ్రద్ధగా విశ్వాసంతో సుషుమ్న క్రియా యోగ సాధన చేయడం వలన క్లిష్టమైన మెదడులోని వైకల్యం పూర్తిగా నయం అయిపోయి ఇటువంటి మందులు వాడకుండా నార్మల్ గా హెల్తీగా జీవించడం ఇది కేవలం మన గురు మాత ఆత్మానందమయి అమ్మగారి దివ్య ఆశీస్సులు వారి లీలలే కదా!
ఓం శ్రీ గురుభ్యోనమ
About Sushumna Kriya Yoga
Recent Posts
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |
Welcome to the BLISSFUL journey