శ్రీ శ్రీ శ్రీ భోగనాథ సిద్ధులు,శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు అమ్మగారిని ఆశీర్వదించి,సుషుమ్న క్రియా యోగ నిష్ణాతులను చేసిన తరవాత ఏ మాత్రం ఏకాగ్రతతో దీక్షతో ధ్యానం చేసినా, ధ్యానమును వ్యాప్తింప జేసినా అమృత హృదయులు అయిన గురువులు అటువంటి యోగులకు దర్శనం, ఆశీర్వచనం ఇవ్వడం చాలా మంది సుషుమ్న క్రియా యోగులకు అనుభవమే…
ప్రీతిగారు ఉత్తర భారతదేశానికి చెందిన వారు.2019 జనవరి 29 న కుంభమేళాలో ధ్యానం చేసే అవకాశం ప్రీతి గారితో పాటు మరి ముగ్గురికి కలిగింది.గంగలో స్నానం చేసి,హోమం చేశారు.తరవాత మన ధ్యానం గురించిన కరపత్రాలు అందరికీ అందించి,ధ్యానానికి రమ్మని అర్థించారు.చాలా మంది సాధు బృందాలు కనిపించారు అందులో కొంతమంది ధ్యానానికి వచ్చారు కూడా…ప్రీతిగారి తండ్రిగారు మెడిటేషన్ లో కూర్చోగానే ఒక యోగి విచ్చేశారు.వారు అక్కడ అన్ని వస్తువులను పరిశీలనగా చూస్తూ ప్రీతిగారి తండ్రిగారి ముఖం చూసి నవ్వారు.ప్రీతి గారు మీరు కూడా మాతో పాటు వచ్చి ధ్యానంలో పాల్గొనండి అని అర్ధించినపుడు, ఆయన సమ్మోహనంగా నవ్వి,నేను నా కుటియా అంటే కుటీరంలో రోజూ క్రియా యోగం చేస్తాను అని చెప్పారు.వారు మీరు ధ్యానం చేసుకోండి దీన్ని గురించి అందరికీ చెప్పి ధ్యాన యోగుల్ని తయారు చేయండి.ఈ సుషుమ్న క్రియ చేయటం వలన మీ జీవితంలో చాలా చాలా విజయ పరంపరలు పొందుతారు అన్నారు.వారు చాలా సమ్మోహనంగా గొప్ప ఆరాతో చాలా ఆకర్షణీయంగా ఉన్నారు.వారి గొంతులో ఎదో అధ్బుతము, శాసనము వినిపించింది.వారి నుదుటున మూడు రంగుల బొట్టు వారి ఆకర్షణ ప్రీతిగారిని కట్టి పడేసింది.కాసేపు తరవాత వారు వెళ్లిపోయారు.ప్రీతిగారి తండ్రిగారు ధ్యానం నుంచి బయటకి వచ్చిన వెంటనే ఆ వచ్చిన వారు మహాద్భుత మూర్తులు అని చెప్పారు.ప్రీతి గారి తండ్రి గారు ధ్యానంలో ఉన్నప్పటికీ వారికి ఈ సంభాషణ అంతా వినిపిస్తూనే ఉంది.ఈ వచ్చిన వారు శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు అని గట్టిగా చెప్పాలని కళ్లు తెరవాలని అనిపించినా.. ఎదో మహాశక్తి వారిని ఆ పనిచేయనివ్వలేదు.ఒక్కసారి ప్రీతిగారికి మిగతా సుషుమ్న క్రియా యోగులకు ఒళ్లు పులకించి పోయింది.అయ్యో! అంత మహాద్భుత దర్శనీయమైనమూర్తిని బాబాజీగారని గుర్తించలేక పోయాము.వారి పాదాభివందనం చేయలేకపోయామే అన్న బాధ కలిగింది.ఇటువంటి మహాద్భుత దర్శనాలను అనుభవాలను ఇవ్వగలిగిన శ్రీ ఆత్మానందమయి అమ్మగారికి శతకోటి కృతజ్ఞతలు అంటారు ప్రీతిగారు.అత్యంత అద్భుత స్థితిలో ఉన్నవారికి తప్ప మహాగురువుల దర్శనం దొరకదు అనుకునేవాళ్లు కానీ సుషుమ్న క్రియా యోగం వల్ల ఇటువంటి మహాద్భుత అనుభవం కలగవచ్చు అని ఇదే ఋజువు.
About Sushumna Kriya Yoga
Recent Posts
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 |
Welcome to the BLISSFUL journey