Welcome to the BLISSFUL journey

పుష్య పౌర్ణమి

0

పౌర్ణమి – పౌర్ణమి రోజు, హిందూ మతంలో పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమిని పుష్యపౌర్ణమి అంటారు. పుష్య పౌర్ణమి మాఘ మాసం ప్రారంభాన్ని సూచిస్తుంది – తపస్సు చేయడానికి అనువైన మాసం. గంగా, ప్రయాగలోని త్రివేణి సంగమం, వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్ మరియు ఇతర పవిత్ర నదుల  ఆచారబద్ధమైన స్నానము  మంగళప్రదమైనదిగా పరిగణించబడుతుంది మరియు ప్రజలు తమ గత మరియు ప్రస్తుత పాపాలను వదిలించుకోవడానికి మరియు వారిని మోక్షమార్గానికి ఒక అడుగు దగ్గరగా తీసుకువెళ్లడానికి సహాయపడుతుందని నమ్ముతారు.

కొన్ని ప్రదేశాలలో, పుష్య పౌర్ణమిని ‘శాకంబరి జయంతి’గా కూడా జరుపుకుంటారు. ఈ రోజున శాకంబరీ దేవి (దుర్గాదేవి అవతారం) అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించబడుతుంది. ఈ శాకంబరీ దేవిని దేవి భగవతి మరియు శక్తి దేవి అవతారం అని కూడా పిలుస్తారు. భూమిపై కరువు, తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని తగ్గించడానికి దుర్గా దేవి శాకంబరిగా అవతరించారని నమ్ముతారు. ఆమె కూరగాయలు, పండ్లు మరియు హరిత వర్ణ ఆకుల కు(ఆకు పచ్చని రంగు తో కూడిన ఆకులు)కు అది దేవత  మరియు   పరిసరాలన్ని హరిత వర్ణం తో నిండి ఉంటుంది. శాకాంబరీ పూర్ణిమ అనేది నవరాత్రులు 8 రోజులు తరువాత ఆఖరి రోజున శాకంబరీ పూర్ణిమ ను జరుపుకుంటారు. ఇది అష్టమి నాడు ప్రారంభమై పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి తో ముగుస్తుంది.”

ఛత్తీస్‌గఢ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు పుష్య పౌర్ణమి రోజున ” చార్తా పండుగ” (పంట పండుగ) జరుపుకుంటారు, ప్రజలు ఈ పండుగను  ఉత్సాహంతో జరుపుకుంటూ ఆనందిస్తారు.

పుష్య పౌర్ణమి విశిష్టత

మనము ఈ విశ్వము, సృష్టి మరియు ప్రకృతిలో ఒక భాగమని  పుష్య పౌర్ణమి గుర్తుచేస్తుంది. ప్రతి మానవుడు విశ్వంతో విడదీయరాని విధంగా అనుసంధానించబడి ఉన్నాడు. అందువల్ల, మనము ఈ విశ్వంతో సమకాలీనంగా  ప్రవర్తించడం ముఖ్యం. కొంత కాలం తరువాత, మనతో పాటు మనం మోసుకెళ్ళవలసిన పాపాలు మనపై భారం పడుతుంది. పుష్య పౌర్ణమి అనేది మన పాపాల నుండి విముక్తి పొంది మరియు నూతన జీవితం ప్రారంభించేందుకు ఒక అద్భుతమైన తరుణముగా అందజేస్తుంది. ఈ విధంగా, పుష్య పూర్ణిమ  మనకు పాపాలు నుంచి సేద తీర్చి  మన జీవితాలను పునరావృతము చేయడంలో సహాయపడుతుంది.

పుష్య పౌర్ణమి ప్రాముఖ్యత

వేద జ్యోతిషశాస్త్రం మరియు హిందూ విశ్వాసాల ప్రకారం, పుష్య అనేది సూర్య భగవానుని మాసము. సూర్యుణ్ణి ఆరాధించడం వలన మోక్షానికి దారి తీస్తుంది, అందుకే ఈ రోజున,  పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానమాచరించి సూర్య భగవానునికి నీటిని సమర్పిస్తారు.

ఇది  సూర్యుడు, చంద్రుడు మరియు పౌర్ణమి మాసం అని చెప్పబడినందున, సూర్యుడు మరియు చంద్రుని యొక్క ఆధ్యాత్మిక కలయికను పుష్య పౌర్ణమి నాడు చూడవచ్చు. ఈ రోజున సూర్యచంద్రులను ఆరాధించడం వలన శుభాలు మరియు కోరికలు నెరవేరుతాయి.

పుష్య పౌర్ణమి శుభ సందర్భంగా, ఆరాధకులు ఒకే విశ్వాసంతో  పవిత్ర జలంలో స్నానము ను ఆచరించి , దానధర్మాలు చేసి, సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తారు, మోక్షాన్ని పొందేందుకు ఉపవాసము ఉంటారు. పవిత్ర స్నానం చేసే ముందు ఉపవాసము ఉండాలని నిశ్చయించుకుంటారు.మంత్రాలు జపిస్తూ సూర్య భగవానుడికి పవిత్ర జలాన్ని సమర్పిస్తారు.

ఆహార పదార్థాలు, దుస్తులు, ధనము మరియు ఇతర అవసరమైన వస్తువులను అవసరమైన వారికి పంపిణీ చేస్తారు. పుష్య పౌర్ణమి నాడు చేసే ఏ విధమైన దాత్రృత్వము మరియు దానము (విరాళాలు) అసాధారణమైన ఫలితాలను అందిస్తాయి. వ్యక్తులు వారి వ్యక్తిగత సామర్థ్యానికి అనుగుణంగా దానములు చేస్తారు.

పుష్య పౌర్ణమి నాడు శుభ కార్యాలు

పుష్య పౌర్ణమి దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. వివిధ తీర్థయాత్రలు మరియు పవిత్ర నగరాల్లో అనేక మతపరమైన కార్యక్రమాలు మరియు కార్యకలాపాలు జరుగుతాయి.

పుష్య పౌర్ణమి సమయంలో చేసే పవిత్ర స్నానము జనన మరణాల నిరంతర చక్రము నుండి ఆత్మను విముక్తి చేస్తుందని నమ్ముతారు. పవిత్ర స్నానము తరువాత, భక్తులు శివుడిని పూజించి  ధ్యానంలో కొంత సమయము గడుపుతారు. సూర్య భగవానుడికి ‘అర్ఘ్య’ (దేవునికి సమర్పించడం) అనే మతపరమైన కార్య ప్రణాళిక ఆచారంలో భాగంగా నిర్వహించబడుతుంది. భక్తులు  ‘సత్యనారాయణ’ వ్రతమును కూడా ఆచరిస్తారు మరియు విష్ణువును పూర్తి భక్తితో పూజిస్తారు. స్వామివారికి సమర్పించేందుకు ప్రత్యేక ప్రసాదాన్ని సిద్ధం చేస్తారు. ఆచారాలను ముగించిన తరువాత హరతిని నిర్వహిస్తారు మరియు ఆహ్వానితులకు  ప్రసాదము (పవిత్రమైన ఆహారం) పంపిణీ చేయబడుతుంది.

పవిత్ర గ్రంథాలు భగవద్గీత మరియు రామాయణము  ఈ రోజున చదవడం ఒక ముఖ్యమైన ఆచారంగా పరిగణింపబడుతుంది. ఈ పుష్య పౌర్ణమి రోజున, భారతదేశంలోని శ్రీకృష్ణుని ఆలయాలలో విలక్షణమైన ‘పుష్యాభిషేక యాత్ర’ ప్రారంభమవుతుంది.

ప్రజలు  ‘గాయత్రీ మంత్రము ‘ మరియు ‘ఓం నమో నారాయణ’ మంత్రాన్ని వరుసగా 108 సార్లు జపిస్తారు. ఈ పుష్య పౌర్ణమికి  అసాధారణమైన ప్రాముఖ్యత ఉంది, ఇది విశిష్టమైన ‘మహా కుంభమేళా’ సమయంలో వస్తుంది.

సుషుమ్న క్రియా యోగులకు పుష్య పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత

ఇది చలికాలంలో వచ్చే చివరి పౌర్ణమి కాబట్టి, ప్రతీకాత్మకంగా ఇది బయట మరియు మనలో కూడా చీకటి అంతాన్ని సూచిస్తుంది.

సుషుమ్న క్రియా యోగులుగా మనం పుష్య పౌర్ణమిని సద్వినియోగం చేసుకోవాలి మరియు బ్రహ్మ ముహూర్తం మరియు సాయం సంధ్యలో సుషుమ్న క్రియా యోగ ధ్యానాన్ని అభ్యసించాలి.

Share.

Comments are closed.