Welcome to the BLISSFUL journey

పార్వతి గారు అనుభవాలు

0

2005 జనవరి 18దిన పౌర్ణమి నాడు అమ్మగారి ద్వారా ధ్యాన దీక్ష పొందారు పార్వతి గారు. అప్పటికి పదేళ్లుగా గొప్ప గురువును వెతుకుతున్న పార్వతిగారు మహా అధ్బుత గురువులైన మహావతార్ బాబాజీ గారు, లాహిరి మహాశయులు,భోగనాథ సిద్దులు వంటి వారు అమ్మగారి సెషన్స్ కు విచ్చేస్తారు అన్న సత్యం అర్థమవడానికి చాలా రకాలైన విచిత్రమైన అనుభవాలు పొందారు.పౌర్ణమి ధ్యానానికి పెదమడి అమ్మగారితో కలసి ప్రయాణం చేస్తున్నారు పార్వతిగారు. ఈ నెల రోజులలోను మామూలుగా మెడిటేషన్ చేసుకోవడం ఏవో కలర్స్ కనిపించడం తప్ప గుర్తు ఉంచుకోవలసిన దృశ్యాలు ఏమీ అనుభవం కాలేదు.ఆ పెదమడి ప్రయాణం మద్యలో మట్లపాలెం అనే గ్రామం వచ్చింది అక్కడికి అమ్మవారు రావడం స్పష్టంగా తెలిసింది పార్వతిగారికి, అమ్మా! అమ్మవారు వచ్చారు అంటే అవును ఇక్కడ మహాలక్ష్మి ఉన్నారు అన్నట్లు చెప్పారు అమ్మగారు.తరువాత పార్వతి గారికి అర్థమైన విషయం ఏమిటంటే చాలా మంది దేవతా శక్తులు, గ్రామ దేవతలు కూడా అమ్మగారి దర్శనానికి వస్తారు అన్న సత్యం.పెదమడికి వెళ్ళగానే రక రకాలైన అద్భుతమైన పరిమళాలు,తులసి వంటి దివ్య సువాసనలు అనుభవమవ్వగానే ఏమిటమ్మా ఈ అద్భుతం? అని అడిగారు పార్వతిగారు.ఇవన్నీ గురువుల విభూతులు మనకన్నా ముందే గురువులు ఇక్కడికి విచ్చేశారు అన్నారు అమ్మగారు.అక్కడ ధ్యానంలో పార్వతిగారికి కలిగిన అనుభవాలు వర్ణనాతీతం.దివ్య గురువులు,దివ్య దేవతా శక్తులు,అమ్మవార్లు,పరమేశ్వరుడు ఇలా వీరందరి దర్శనం జరిగింది. ఆ అద్భుతం నుండి తేరుకోలేని పార్వతిగారు అమ్మగారిని ఒక వింత కోరిక  కోరారు. అమ్మా! నాకు ఈ భూమి మీద ఉన్న గురువులు కాకుండా దివ్య గురువుల చేత దీక్ష ఇప్పించగలరా అని,ఆ తరువాత చాలా కాలానికి అమ్మగారు ధ్యానానికి పిలిచినప్పుడు అమ్మా బాబాజీగారు శ్రీ లాహిరి మహాశయులకు ఎలా ఉపదేశం ఇచ్చారో అట్లాగే నాకు లాహిరి మహాశయుల చేత మీరు దీక్ష ఇప్పించాలి అన్న వింత కోరికలో ఉన్న తీవ్ర పరిణామాలు తెలిసీ తన ప్రియ శిష్యురాలి కోరిక తీర్చాడానికి పూనుకున్నారు అమ్మగారు.ధ్యానంలో పార్వతిగారికి శ్రీ లాహిరి మహశయులు దర్శనమిచ్చి ఎన్నో ఫలాలు ప్రసాదించారు.ఆ తరువాత వారు ఒక్కసారి పార్వతిగారి శిరస్సు స్పృశించగానే వెయ్యి ఓల్ట్ల విద్యుత్తు తగిలినట్ట్లై ప్రపంచం గిర్రున తిరిగి పొయినట్లయింది. అలా వారు ఎన్ని సార్లు స్పృశిస్తే అన్ని సార్లు తట్టుకోలేని విద్యుత్అయస్కాంత శక్తి తగిలినట్లు విల విలలాడి పోయారు పార్వతిగారు.విపరీతమైన దుఃఖం పెద్ద వాంతి అయిపోయింది.ఆమె కూడా వచ్చిన వారి పిన్నిగారి సాయంతో కొంచం సేద తీరారు.ఆ శక్తి పాతానికి తట్టుకోలేక పోయిన పార్వతి గారినీ మరొక అద్భుతమైన అనుభవం ఆవహించింది నుదుటి దగ్గర మూడవ నేత్రం తెరుచుకున్నది అంతే అప్పుడు ప్రారంభమైన దివ్య దర్శనాలు,దేవతలు,ప్రత్యక్ష నిదర్శనాలు ఇంటికి వెళ్ళినా ఆగలేదు. కాళ్ళు చాచుకుని నిద్ర పోలేని పరిస్థితి కారణం ఆమె చుట్టూ దేవతలే ఎక్కడ లేరని కాళ్ళు చాచగలరు.ఆమె తను చూస్తున్న దృశ్యాలు వర్ణిస్తూ ఉంటే పార్వతి పిచ్చిదైపోయింది అని ఆమె స్థితి అర్థం కాక మాట్లాడేవారు బంధువులు,పరిచితులు.కుండెడు ఉప్పు నీళ్లు స్నానం చేసినా కొంచం ఉపశమనం మాత్రమే కలి గేది.పార్వతిగారు ఆ స్థితికి తట్టుకోలేక భర్తగారి అనుమతితో అమ్మగారి దర్శనానికి వెళ్లి అమ్మా నాకు ఈ తర్డ్ ఐ దగ్గర ఈ దృశ్యాలు ఆపేసి నన్ను మామూలు స్థితికి తీసుకు రండి అని, అమ్మగారు సరే అనేవరకు పాదాలు పట్టుకుని దుక్కపడుతూనే ఉన్నారు ఆ తరువాత అమ్మగారు పార్వతి గారికి మామూలు స్థితిని ప్రసాదించారు.అప్పటి నుంచి మెడిటేషన్ చేసుకోవడం సుషుమ్న క్రియా యోగాన్ని వ్యాప్తి చెయ్యడం ఇదే కర్తవ్యంగా పెట్టుకున్నారు పార్వతి గారు.
ఎంత ధ్యానం చేసినా నాకేమీ మహత్యాలు కనిపించడం లేదు అని చాలా మంది సుషుమ్న క్రియా యోగులు మనసులో కలత పడుతూ ఉంటారు,కానీ మహా అద్భుత గురువులు శిష్యుల మామూలు జీవితానికి భంగం కలగనీయకుండ వారి సూక్ష్మ శరీరాలమీద అతి సున్నితంగా ఆధ్యాత్మిక స్పందనలు కలగ చేస్తూ ప్రతి క్షణం వారిని పసి బిడ్డలా కాపాడుతూ ఉన్నతమైన స్థితిని అదిరోహింప చేస్తున్నారు అన్న సత్యం వీరి అందరి అనుభవాల నుండి మనకు అర్థమవుతుంది. కేవలం తన దివ్య సంకల్పసిద్దితో మహోన్నత గురువుల చేత ఉపదేశం ఇప్పించి,ఆ అద్భుత శక్తిపాతం శిష్యులు తట్టుకోలేని స్థితి నుంచి తిరిగి కారుణ్యంతో రక్షించ గలిగిన శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయి అమ్మగారు గురుపీఠ వాసినిగా అవ్వడం సుషుమ్న క్రియా యోగుల అదృష్టంగా భావించి నమస్సుమాంజలులు అర్పిద్దాం

Share.

Comments are closed.