Welcome to the BLISSFUL journey

మాఘ పౌర్ణమి

0


ఫిబ్రవరి నెలలో వచ్చే పౌర్ణమి మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమిని, మహా మాఘ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఇది పవిత్రమైన పౌర్ణమి రోజులలో ఒకటి. ఇది మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు, ఇది జనవరి మధ్య నుండి ఫిబ్రవరి మధ్య లో ఒక రోజున వస్తుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 16న వస్తుంది.

మాఘ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత

మాఘ మాసం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు ఉత్తర మార్గంలో అస్తమిస్తాడు. మాఘ పౌర్ణమి తో మాఘ మాసం ముగుస్తుంది మరియు మాఘ మాసంలోని శుక్ల పక్షం యొక్క ముగింపును కూడ సూచిస్తుంది. ఈ పవిత్రమైన రోజును తమిళనాడులో “మాసి మాగం” లేదా “మాసి మహం” గా జరుపుకుంటారు.

మాఘ పౌర్ణమి సాంస్కృతికంగా మరియు ఆధ్యాత్మికంగా అర్ధవంతమైన / ముఖ్యమైన రోజు.
మాఘ పౌర్ణమి, బౌద్ధమతస్తులకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఎందుకంటే గౌతమ బుద్ధుడు తనకు ఆసన్నమౌతున్న నిర్యాణాన్ని ఈ రోజునే ప్రకటించాడని నమ్ముతారు.

మాఘ పౌర్ణమి పవిత్రమైన పండుగ

మాఘ పౌర్ణమిని ‘స్నాన పండుగ’ అంటారు. భారతదేశంలో స్నానం అనేది ఒక ఆచారం, ఒక వేడుక, ఒక పండుగ మరియు గొప్ప శుద్ధి చర్య. పుష్యమి పౌర్ణమి నుండి మాఘ పౌర్ణమి వరకు భక్తులు ప్రతిరోజూ పవిత్ర స్నానం చేస్తారు.

ఈ రోజున, గంగ, యమున, కావేరి, కృష్ణా, నర్మద మరియు తపతి వంటి పవిత్ర నదుల ఒడ్డున అనేక స్నానోత్సవాలు జరుగుతాయి. కన్యాకుమారి మరియు రామేశ్వరంలో చేసే సముద్ర స్నాన్నానికి అతి పవిత్రమైన మరియు మతపరమైన ప్రాముఖ్యత ఉన్నది. రాజస్థాన్‌లోని పుష్కర్ సరస్సులో స్నానం చేయడం కూడా అంతే పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

మాఘ మాసం శాస్త్రీయ దృక్కోణం ప్రకారం కూడా ప్రయోజనకరమైనది. (శాస్త్రీయ పరంగా కూడ ప్రయోజనకరమైనది) మారుతున్న ఋతువులకు అనుగుణంగా మానవ శరీరం అలవాటు పడడానికి ఈ మాసం దోహదపడుతుందని నమ్ముతారు. కావున మాఘ పౌర్ణమి నాడు స్నానం చేయడం వల్ల శరీరానికి బలం, శక్తి లభిస్తుంది.

పండుగలు మరియు మతపరమైన ప్రాముఖ్యత

ఈ రోజున భక్తులు తమ ఇష్ట దైవంతో పాటు (కుటుంబ దైవంతో) విష్ణువు మరియు హనుమంతుడిని పూజిస్తారు. మాఘ పౌర్ణమి రోజు పార్వతీ దేవిని మరియు బృహస్పతిని పూజించడానికి అంకితం చేయబడింది. (బృహస్పతి మఘ నక్షత్రం యొక్క దేవుడు). బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం, మాఘమాసంలో శ్రీమహావిష్ణువు స్వయంగా గంగా నదిలో నివసిస్తాడు కాబట్టి ఈ పవిత్ర జలాన్ని స్పర్శించినా కూడా భక్తుని పాపాలు మరియు అన్ని వ్యాధులు నయం అవుతాయి.

ఈ సమయంలో ప్రసిద్ధ ‘కుంభమేళా’ మరియు ‘మాఘ మేళా’ కూడా జరుగుతాయి, వీటిలో దేశంలోని నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. తీర్ధరాజ్ ప్రయాగ సంగమం ఒడ్డున నివసిస్తుండటాన్ని కల్పవాసం అంటారు. కల్పవాసం అంటే సంగం ఒడ్డున వేదాలను అధ్యయనం చేయడం. కల్పవాసం అంటే సహనం, అహింస మరియు భక్తి యొక్క సంకల్పం. మాఘ పూర్ణిమ రోజున పవిత్ర స్నానం చేసిన తర్వాత కల్పవాసం పూర్తవుతుంది.

తమిళనాడులో ఈ రోజున అద్భుతమైన తెప్పోత్సవం (Floating festival) పండగను నిర్వహిస్తారు. ఈ తెప్పోత్సవంలో అందంగా అలంకరించబడిన మీనాక్షి దేవి మరియు సుందరేశ్వరుల విగ్రహాలు అలరారుతూ ఉంటాయి.

సుషుమ్న క్రియా యోగులకు మాఘ పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత

ఏదైనా కొత్త ప్రయోగం / పని (వెంచర్) లేదా కార్యాచరణను ప్రారంభించడానికి మరియు విజయవంతమైన ఫలితాలను పొందడానికి మాఘ పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శాస్త్రీయంగా, భూమికి సంబంధించి చంద్రుని స్థానం ఈ రోజున మన గ్రహం మీద భిన్నమైన అయస్కాంత ఆకర్షణ శక్తిని కలిగిస్తుంది, ఫలితంగా ఈ శక్తి ప్రకృతిలోకి విలీనం అవుతుంది.

శరీరంలో రక్త ప్రసరణ పైకి జరగడం ​వలన మన మెదడులో రక్త ప్రసరణ పెరుగుతుంది మరియు ఈ రోజున స్వాభావిక నాణ్యత మరింత మెరుగుపడుతుందని కూడా నమ్ముతారు. మాఘ పౌర్ణమి నాడు సుషుమ్న క్రియా యోగుల మైన మన ఆధ్యాత్మిక పురోగతికి బ్రహ్మ ముహూర్తం మరియు సాయం సంధ్యా ధ్యానం రెండింటిని సాధన చెయ్యాలి

Share.

Comments are closed.