Welcome to the BLISSFUL journey

జ్యోతి తిరుమలరాజు అనుభవాలు

0

సుషుమ్న క్రియా యోగులకు మిగతా వారి కన్న చాలా విలక్షణమైన అనుభవాలు జరుగుతాయి…దీనికి వారికి ఏమైనా అర్హత ఉండాలా?అని ప్రశ్నిస్తే గురువుల అనుగ్రహము వుంటే ,కర్మలు దహించబడతాయి,మృత్యువు తరవాత కూడా వారి జీవాత్మలు దర్శనము ఇవ్వగలవు …ఇవన్నీ మామూలు వారికి ఆశ్చర్యం కలిగించే అనుభవాలు
విజయనగరం జ్యోతిగారు సుషుమ్న క్రియా యోగి.2015 విజయ దశమి నాడు వారి బాబు శరీరము వదిలి పెట్టిన నాటి నుంచీ ఆవిడ జీవితములో చీకట్లు ఆవరించాయి…కానీ ,ఎందుకో అమ్మగారి దయవలన తన బాబును మళ్లీ చూడగలనని నమ్మకము ఆమెకు చాలా ఉండేది….
ధ్యాన మిత్రులతో కలిసి అమర్ నాథ్ యాత్రకు వెళ్లి ఆ రాత్రి వారంతా నిద్ర చేశారు…జ్యోతిగారు ధ్యానం చేస్తూ ముద్ర పెట్టుకుని పడుకుంటే ఆమెగారికి వారి బాబు కనిపించి,నా గురించి ఎందుకు బాధ పడుతున్నావు అమ్మా! నా శరీరాన్ని వదిలేసిన తరవాత సూక్ష్మ రూపంలో నా కర్మకాండలన్నీ నేను చూశాను – అని చెప్పాడు.మరి తిరిగి ఎందుకు శరీరంలోకి రాలేదు నాన్న ?! అని జ్యోతి గారు అడిగితే ,ఒకసారి శరీరం వదిలేసిన తరవాత ఆ దేహంతో ఇంక పని ఉండదు …నేను దైవం దగ్గరే ఉన్నాను ..నువ్వు బాధ పడుతూ నన్ను అనవసరంగా భూ ఆవరణకు రప్పిస్తున్నావమ్మా ! నా గురించి బాధ పడవద్దమ్మా ! అని చెప్పి ఆ బాబు వెళ్లిపోయాడు.
ఆ యాత్ర తరవాత షిరిడీలో గురుపౌర్ణమికి వెళ్లినప్పుడు అమ్మగారు హోమములో బాబు పేరున సమిధ వేశారు.ఆ రోజు రాత్రి షిరిడీలో యోగ ముద్ర పెట్టుకుని కూర్చుని ఉండగా షిరిడీ బాబాగారు జ్యోతిగారి బాబుతో దర్శనమిచ్చారు.అమ్మా! నేను బాబాగారితో ఉన్నాను…నా జోలిలో ఏ కర్మ ఫలాలు లేవమ్మా ఇది ఖాళీ సంచి చూడు ..నువ్వు మళ్లీ నీ ఆలోచనల వల్ల నాకు కర్మఫలాలు చేర్చకమ్మా! అని చెప్పి బాబాగారితో కలిసి వెళ్ళిపోయాడు.బాబాగారి స్పర్శ,మా బాబుస్పర్శ నాకు బాగా గుర్తున్నాయి అంటారు జ్యోతి గారు.బాబాగారు ” నా దర్శనానికి రా!” అని ఆదేశించారు జ్యోతి గారిని.
మరుసటి విజయ దశమికి అంటే సరిగ్గా బాబు దేహం చాలించిన సంవత్సరానికి ,ధ్యానం చేస్తూ బాధపడుతున్న జ్యోతి గారికి అమ్మగారు దర్శనమిచ్చి ” నీ సంవత్సరం బిడ్డ నా దగ్గరే ఉన్నాడు.ఎందుకు బాధ పడుతున్నావు?”అన్నప్పుడు జ్యోతిగారికి విపరీతమైన తృప్తి కలిగి కృతజ్ఞతతో ఆనంద భాష్పాలు కార్చారు జ్యోతి.
సుషుమ్న క్రియా యోగము చెయ్యడం వలన నా బిడ్డ కర్మ ఫలాలు తీరిపోయాయి.నా బిడ్డ గురువుల దగ్గర క్షేమంగా ఉండటము చూసే అదృష్టము కలిగింది నాకు ..అంటారు జ్యోతిగారు.
సుషుమ్న క్రియా యోగులు హోమము ,ధ్యానములో పాల్గొనడం వలన వారి ప్రేమ స్పదులకు గురు అనుగ్రహప్రాప్తి జరుగుగుతుందన్న రూడి జ్యోతి గారి అనుభవము వల్ల తెలుస్తుంది..అంతే కాదు చనిపోయిన వారిని విపరీత దుఃఖంతో భూ ఆవరణలోకి పిలవకూడదని కూడా అర్థమౌతుంది.

Share.

Comments are closed.