Welcome to the BLISSFUL journey

జే.సత్యనారాయణమూర్తి అనుభవాలు

0

కాకినాడ వాస్తవ్యులు మూర్తి గారు మన అందరికీ పరిచయస్తులే.. వీరు తన జీవితాన్ని అమ్మగారి సేవకే అంకితం చేసి మన దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ కి ఎనలేని సేవ చేస్తున్న భాగ్యశాలి. వీరు 2003 నుండే అమ్మగారిని గురువుగా స్వీకరించి ధ్యాన సాధన మొదలు పెట్టారు. వారిని కృంగదీస్తున్న అనారోగ్యానికి పరిష్కారం వెతుకుతూ అమ్మగారిని కలవడం జరిగింది.
2000,2001 మధ్య కాలంలో మూర్తిగారికి విష జ్వర ప్రభావంతో వారం రోజులు మంచం పట్టారు.కొద్దిగా కోలుకున్నాక తన ముఖం కుడిభాగంలో స్పర్శ కోల్పోయి మొద్దుబారిపోయినట్టు గమనించి షాక్ కి గురి అయ్యారు. అంతే కాక సడన్ గా తల,ముఖము భాగంలో కరెంట్ షాక్ ఇచ్చినట్టు భరించరాని నొప్పితో విల విల లాడిపోయేవారు. డాక్టర్స్ ని సంప్రదించగా దానికి పర్మనెంట్ క్యూర్ లేదని, అసలు ఇంత చిన్న వయసులో ఇది వచ్చే వ్యాదే కాదని చెప్పారు. నొప్పి నుండి కొంత ఉపశమనం కలగడానికి కొన్ని మందులు కూడా ఇచ్చారు. ఈ మందులని ఒక్క పూట వాడకపోయిన ఆ భరించరాని నొప్పి తిరిగి వచ్చేసేది. అల్లోపతిలో పరిష్కారం లేదు అన్నారు కాబట్టి ఆయుర్వేద, హోమియోపతి లాంటివి కూడా ట్రై చేశారు.కానీ ఏవి ఫలితం ఇవ్వలేదు. అలా దాదాపు రెండు రెండున్నర సంవత్సరాలు బాధ పడ్డాక అదృష్టవశాత్తు వారికి అమ్మగారి దర్శన భాగ్యం 2003లో కలిగింది. అప్పుడు అమ్మ గారు రోజు క్రమంతప్పక ధ్యానం చెయ్యి నీకు ఈ బాధ నుండి విముక్తి కలుగుతుంది అని అన్నారు. మూర్తి గారు పూర్తిగా తగ్గిపోతుందా అమ్మ మళ్ళీ రాదు కదా అని అడిగారు. అమ్మగారు నీ ప్రారబ్ధ కర్మ ఫలితంగా నువ్వు ఈ విధంగా బాధ పడుతున్నావు కర్మని దగ్ధం చేయగలిగేది కేవలం ధ్యానాగ్ని మాత్రమే కాబట్టి ధ్యానం ద్వారా నీ కర్మ నుండి నీవు విముక్తి పొందమని చెప్పారు.వెంటనే మూర్తి గారు అమ్మగారి దిశా నిర్దేశంలో ధ్యాన సాధన మొదలు పెట్టారు.ఆరు నెలల తరువాత ముఖంలో కొంత భాగంలో స్పర్శ తెలిసింది అంతే కాక మునుపటి నొప్పి బాధ చాలా మటుకు తగ్గిపోయాయి.ఒక రోజు మందులు అయిపోయి కొనుక్కోవడానికి డబ్బులు లేక మూర్తిగారు మందులు వాడటం ఆపేశారు. కానీ ఎటువంటి మందులు వాడకపోయినా అసలు నొప్పి కానీ బాధ కానీ రాలేదు. దానితో మూర్తిగారు పూర్తిగా మందులు వాడటం మానేసి కేవలం ధ్యాన సాధనని మాత్రమే సాగించారు. అలా ధ్యాన సాధన సాగిస్తూ ఉండగా ప్రతి ఆరు నెలలకి తేడా గమనించసాగారు… నెమ్మదిగా కొంత కొంత ముఖ భాగం స్పర్శ పొందడం మొదలు పెట్టింది నొప్పి బాధ ఎప్పుడో తగ్గిపోయాయి అలా నెమ్మదిగా సాధారణ స్థితికి వచ్చేశారు.చికిత్సే లేని వ్యాధి నుండి విరుగుడే లేని బాధ నుండి ఏటువంటి చికిత్స లేకుండానే కేవలం ధ్యాన సాధనతో స్వస్తతను సాధ్యం చేసుకోగలిగారు మూర్తిగారు.మూర్తిగారు అనుభవించిన వ్యాధిని tri geminal neuroligiya అంటారు. ఇది ఒక నరానికి సంభందించిన వ్యాధి trigeminal nerve మనయొక్క ముఖ కండరాల నుండి డైరెక్టుగా మెదడుకి వెళ్తుంది.Trigeminal neuroligiya ఒక క్రానిక్ painful condition. ఇది ముఖ కండరాలని ఎఫెక్ట్ చేస్తుంది.ముఖం మీద స్పర్శ కోల్పోయి సడెన్ గా కరెంట్ షాక్ కొట్టినట్లు ప్రాణాలు విల విలలాడే వర్ణించలేని బాధతో నొప్పి వస్తూ ఉంటుంది.దీనికి కంప్లీట్ క్యూర్ కూడా లేదండి.కేవలం నొప్పి నుండి కొంత ఉపశమనం కలగడానికి మందులు ఇస్తారు. అలానే కొంతమందికి ఈ వ్యాధితో బాధ పడేవారికి కను రెప్పలు క్రిందికి వాలిపోయి చూపు కూడా కష్టం అవుతుంది అలా రెగ్యులర్ లైఫ్ కి ఆటంకం కలిగిస్తూ ఉంటే కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ని ట్రై చేస్తారు. కానీ అవి కూడా పూర్తిగా నయం చేయలేవు.అలానే ఈ ఆపరేషన్స్ వల్ల ఒకొక్క సారి కొత్త రకమైన కాంప్లికేషన్స్ కూడా రావచ్చు అంతే కాక ఇదంతా కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్నది.ఇంత క్లిష్టమైన వ్యాధితో బాధ పడిన మూర్తిగారు కేవలం ధ్యాన సాధన ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని వారు పొందగలిగారు అంటే ఇది నిజంగా ఒక గొప్ప మిరాకిల్ కదండీ. ఇటువంటి మిరాకిల్స్ కేవలం మన ఆత్మానందమయి అమ్మగారి కరుణతో వాత్సల్యంతో మాత్రమే మనం పొందగలుగుతాము అండి. ఓం శ్రీ గురుభ్యోనమః

Share.

Comments are closed.