Welcome to the BLISSFUL journey

డాక్టర్. నాగతేజ అనుభవాలు

0

Wordsworth daffodils..అన్న కవితలో చెప్పినట్లు విశ్వాత్మ ప్రకృతిలో ప్రతి ఒక్కరి నుంచి దూసుకుని స్పందిస్తూ సర్వ చైతన్యాన్ని కలుపుతుంది అన్నది కేవలం కవిత్వం కాదు శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీత లో నేను సర్వ వ్యాపిని ప్రతి ఒక్కరిలోనూ మణిహారం లో కనిపించని సూత్రం లాగా ఉంటాను అన్నప్పుడు అది కేవలం గీతా వాక్యము కాదు అవి సత్య ప్రమాణాలు అని సుషుమ్న క్రియా యోగులకు గురు మాత వారిని ఆ స్పందనలో లయలో మనందరమూ స్పందిస్తున్నాము అని రుజువులు చేసారు.
నాగ తేజ గారు డాక్టర్ మధు శ్రీ మేడం గారి అబ్బాయి అమ్మగారిని విపరీతంగా నమ్మి ఆరాధించి ప్రేమించే వారి తల్లి వీరిని బ్రతిమాలిలాలించి సుషుమ్న క్రియా యోగం లోకి తీసుకు వచ్చారు కానీ అమ్మగారు ఆమెను అయిష్టంగా ఇందులోకి వచ్చిన తేజ గారిని సమానంగా అక్కున చేర్చుకున్నారన్న అద్భుతమైన అనుభూతి నాగ తేజ గారు అనుభవించారు. అమ్మ గారిని చూసి మొట్టమొదట చేసిన 14 నిమిషాలు ధ్యానం దాని విశిష్టత అతనికేమీ వెంటనే అర్థం కాలేదు.
రేడియాలజీ పీజీ సీటు కోసం దాదాపు ఆరు కాలేజీల్లో అప్లై చేసినా సీటు రానప్పుడు నిరాశ పొందిన నాగతేజ గారికి ఉన్నట్లుండి సీటు రావడం తనకు సీటు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన కాలేజీలు స్కామ్ లో మునిగిపోవటం ఇటువంటివి జరిగినప్పుడు మాత్రము దీని వెనకాల దైవీకమైన అమ్మగారి హస్తం ఉందా అనిపించేది … అమ్మగారితో హిమాలయాలకు తల్లితో కలిసి వెళ్లే అవకాశము వచ్చినప్పుడు కానీ ఈ సుషుమ్న క్రియా యోగం ప్రత్యేకత అమ్మగారి ఎనర్జీ ఫీల్డ్స్ ఎంత సర్వ వ్యాపకమో అతనికి అర్థమైంది. అంతకు ముందు గురు పౌర్ణిమకు కుట్రాలం వెళ్లడం కూడా తల్లి బలవంతం మీదే అక్కడ అమ్మగారు పౌర్ణమి నాడు రెండు గంటలు మెడిటేషన్ చేయమన్నప్పుడు అమ్మో ఎట్లాగా?ఇంత సేపా అనుకున్న నాగతేజ అంత మంది మధ్యలో తను ఒక్కడు నడిచి వెళ్లిపోతె బాగుండదు, అన్న చిన్న భీతితో కళ్లు మూసుకుని కూర్చున్నారు కానీ కొద్దిసేపట్లో అతనొక అలౌకిక ప్రపంచంలోకి వెళ్ళిపోయి రెండు గంటలైపోయింది అన్న స్పృహ అర్థం కాని స్థితిలో ఉండిపోయారు అది చాలా ఆశ్చర్యకరమైన విషయం అతనికి.
అమ్మగారితో 2013లో ఫౌండేషన్ కు పబ్లిక్ క్లాసు పనులు చూసుకోవటం, అలా పని చేయాలి అంటే 49 నిమిషాలు ప్రాక్టీస్ అవసరం కావడం కోపం అదుపులోకి రావడం తనని ప్రభావితం చేసే ఆలోచనలు రావడం అతని వృత్తిలో చక్కటి ఎదుగుదల ఇటువంటి అద్భుతాలతో అమ్మగారితో హిమాలయ ప్రయాణం మరొక గొప్ప మలుపు…క్లీనింగ్ ప్రాసెస్ లో భాగంగా అక్కడ ఉన్న సుషుమ్న క్రియా యోగులంతా బోలెడు దేవదారు వృక్షాలు ఉన్న విశాలమైన ప్రదేశంలో ధ్యానం చేయాలి అన్నారు అమ్మగారు.తమాషాగా ఎంతమంది సుషుమ్న క్రియా యోగులున్నారో అన్ని దేవదారు వృక్షాలు ఉన్నాయి.కానీ నాగతేజ గారికి మెడిటేషన్ చేయడానికి దేవదారు వృక్షం దొరకలేదు ఎలాగా అనుకుంటున్న నాగతేజ గారికి, అమ్మగారు ఒకే కాండం నుంచి రెండు పాయలు ఉన్న దేవదారు వృక్షమును చూపించి,ఒక పాయ దగ్గర నాగతేజను ధ్యానం చెయ్యమన్నారు.ఆ చెట్టులోకి ఆత్మ శక్తితో ఇతను మమైక్యం అయిపోవడం కాళ్లు భూమి మీద ఆనక పోవడం, భ్రూ మధ్యం నుండి ఏదో లాగివేయబడ్డం అనుభవ మైంది అతనికి,దాదాపు సమాధి స్థితికి వెళ్ళిన అతన్ని అమ్మగారు పిలుస్తున్నారు అన్న సాటి సుషుమ్న క్రియా యోగి పిలుపు ఈ లోకంలోకి దించింది. అప్పటి దాకా ఏ స్పిరిచువల్ అనుభవం లేని తేజ గారికి ఆ రోజు ఒక గొప్ప మలుపు వృక్షాత్మతో లీనమవడం. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాగ తేజ గారు మన సుషుమ్న క్రియా యోగంలో ఆత్మార్ధంగా అనుభూతితో పనిచేసే ప్రత్యేక వ్యక్తిగా రూపు దిద్దుకున్నారు.

Share.

Comments are closed.