Browsing: Himalayanam

యువ శిష్యులమైన మేము కాస్త చురుకుగా, తెలివిగా వ్యవహరించి ఉంటే అమ్మగారిబ్యాగులు ఢోలి పై పెట్టేవారం కాదని మళ్లీ బాధపడ్డాం. అమ్మగా, అనురాగ వల్లిగా, గురువుగామాకు దిశా నిర్దేశం చేస్తూ, మమ్మల్ని కంటికిరెప్పలా కాపాడే అమ్మగారి విషయంలోఅలసత్వం ఇక పై పనికిరాదనితీర్మానించుకున్నాం. తెలిసి చేసిన తప్పుఅయినా, తెలియక చేసిన తప్పైనా గురువువిషయంలో పొరపాట్లు తగవు. పొరపాట్లుజరిగినా వాటి నుండి పాఠాలు నేర్చుకోండనిఅమ్మగారు చెప్తారు కానీ, ఇలా ఉండండి, అలా చెయ్యండని అమ్మగారు పరుషంగాఆజ్ఞాపించటం మేము ఎరుగం. భూమాతవంటి ఓర్పు అమ్మగారిది. కానీ తమగురువులైన శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు, శ్రీ శ్రీ భోగనాథ మహర్షుల వారి పనులనుచాలా భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తారు అమ్మగారు. అమ్మగారు తమ గురువుల విషయంలో శ్రద్ధగాఉన్నట్లే, మనం కూడా శ్రద్ధగాఉండాలనుకుంటూ ఉండగా., తొందరగాస్నానాలు చేసి భోజనానికి రండి, అంటూకబురువచ్చింది. ఆ రోజు చాలా నడక మూలాన, కాస్త వేడి నీళ్లతో స్నానం చేశాక పరిస్థితి కుదుట పడింది. ఆ…

అమ్మగారితో పాటు కాసేపు సేద తీరాక, పయనం ఆరంభించాం. అప్పటికే చాలా దూరం నడిచాం కానీ కను చూపు మేరలో ఆలయం జాడ లేదు. చాలా ఎత్తుకు వెళ్ళాం. అక్కడి నుండి కిందకి చూస్తుంటే భూమికి, ఆకాశానికి మధ్యలో మేము ఉన్నట్లు ఉంది. వంశీ గారు ఒక చోట బాగా నీరస పడి ఇక ఎక్కలేను అన్నట్లు నిలబడి పోయారు. అమ్మగారు కాసేపు వారి వంక చూస్తూ… అమ్మగారి నేత్రాలతోనే వారిలో శక్తిని నింపారు. కొద్ది సేపటికి శక్తి పుంజుకున్న వంశీ గారు, లేడి పిల్లలాగా చెక చెకా పర్వతం ఎక్కటం ప్రారంభించారు. వారిస్థితికి వారికే ఆశ్చర్యం కలిగింది. అమ్మగారు మాత్రం యువ బృందంతో సమానంగా నడుస్తూ, వెనక బడిన మా బృందంలో కొందరిని గురించి ఆరా తీస్తూ, వెనక బడిన వారికి తోడుగా కొందరిని ఉండమని చెప్పి ముందుకు సాగారు. ఇంకొంత దూరంలో గుడి ఉంది అనగా, మాకు కుడి భాగంలో ఒక పెద్ద పర్వతం కనిపించింది. ఆ పర్వతం పై మంచు. ఆ పర్వతానికి ఆవలి వైపు సప్త ఋషులు తపస్సు చేస్తారని చెప్పారు అక్కడి గైడ్. ఆ పర్వతానికి నమస్కారం చేస్తూ కళ్ళు మూసుకునే సరికి ఎంతటి శక్తి ప్రకంపనలు కలిగాయంటే, ఆప్రాంతమంతా కదలి పోతున్నట్లు అనిపించింది. ఆ ప్రదేశంలోని ప్రతీ అణువు పవిత్రమే. అందునా, మహా గురువైన అమ్మగారి పాద స్పర్శతో మరింత శక్తిమంతంగా వెలిగిపోతున్నది ఆ పుణ్య సీమ. అమ్మగారు ఆ ప్రాంతానికి వచ్చారని, యమునా నది పరవశంతో ఉరకలు వేస్తూ ఉంటే, దేవతా వృక్షాలు ఆనందంగా తలలూపుతున్నాయి, అమ్మగారి రాకను గురించి చెబుతూ గాలులు సవ్వడులు, సందడులు చేస్తున్నట్లు తోచింది. పర్వతం పైకి నడిచి వెళ్లిన మేము నదిలో స్నానం చేయలేకపోయాము.