ఆ రోజు డెహ్రాడూన్లో దీక్షా శిబిరాల నిర్వహణ కోసం అందరం ముస్సోరీ నుండి కింద డెహ్రాడూన్ కు వెళ్ళాం. అమ్మగారు…
Browsing: Himalayanam
ఓంకారాలు ప్రారంభించగానే దేహ స్పృహ లేదు. ఎక్కడ ఉన్నామో కూడా తెలియని స్థితిలో ధ్యానంలో లీనమయ్యాం. కాసేపటి తర్వాత అమ్మగారు ఓకే చెప్పారు. నెమ్మదిగా అందరం కళ్ళు తెరిచాం. కొందరికికొన్ని అనుభవాలు కలిగాయి. అవి విన్నాక అమ్మగారు, ధ్యానం చేసిన మనందరి సూక్ష్మ శరీరాలు బద్రీనాథకు వెళ్లాయన్నారు. నిజానికి హిమాలయ యాత్రకు సన్నాహాలు జరుగుతున్న సమయంలోబద్రీనాథకు కూడా వెళ్లాలనుకున్నాం, కానీ తర్వాత ఎందుకనో మరొక సారి వెళదామని తీర్మానించారట అమ్మగారు. అటువంటిది ఆ రోజు గురువు దయవల్ల, అంతటి మహిమ గల ప్రదేశానికి సూక్ష్మంగావెళ్ళిరా గలగటం ఆత్మానందాన్ని కలిగించింది. మధుశ్రీ గారికి ధ్యానం లో గరుడ పక్షి దర్శనమిచ్చిందని చెప్పారు. శ్రీ మహా విష్ణువు క్షేత్రమైన బద్రీనాథకు వెళ్లి వచ్చినట్లు, అమ్మగారు చెప్పిన మాటలకుసంకేతంగానే గరుడ పక్షిని ధ్యానంలో దర్శించారు మధుశ్రీ గారు. చాలా అద్భుతమైన అనుభూతిని కలిగించిన ఆ నాటి ధ్యానం ఇప్పటికీ మా హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. శంకర్ కిషోర్ గారికిఅభినందనలు తెలియచేసి, అక్కడి నుండి రూములకు బయలుదేరాం. మరుసటి నాడు ఉదయం డెహ్రాడూన్లో ధ్యాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయాన్నే లేవాలి కాబ్బటి మరుసటి నాడుకి కావాల్సినసన్నాహాలు చేసుకొని నిదురించాం.
ओंकार का उच्चारण प्रारंभ होते ही, हमें अपने देह का स्पर्श पता नहीं चला।ध्यान स्थिति…
Few moments into chanting of Omkara our bodies became lighter and the consciousness wandered in…
That day in the evening at about 4 o’clock, along with the DRDO Director of…
उस दिन शाम ४बजे, डी र डी ओ के श्री शंकर किशोर जी ने उनके…
ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అమ్మగారు, DRDO ముస్సోరీ డైరెక్టర్ శ్రీ శంకర్ కిశోర్ గారి గృహానికి వారి…
अगले दिन हम सब अपने कमरों में तैयार होकर पैदल निकलकर ओडिटोरियम पहुंचे।सुबह ६ बजे…
మరుసటి రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి వెంట వెంటనే తయారై కాలి నడకనే మా రూమ్ దగ్గర నుండి ఆడిటోరియం చేరాం. ఉదయం 6:00 గంటలకు ఒక సెషన్ తిరిగి 7:00 గంటలకు మరొక సెషన్ కలిపిరెండు సెషన్లు ఏర్పాటు చేశారు. ఎంతో శ్రద్ధగా అక్కడి వారంతా అమ్మగారి వద్ద దీక్షను పొంది, ధ్యానానికి సంభందించిన అనేక ప్రశ్నలు వేశారు. DRDO ఉద్యోగులు, శాస్త్రవేత్తలు దీక్షా శిబిరానికి హాజరయ్యారు.సుషుమ్న క్రియా యోగ వైశిష్ట్యం, దీక్ష, సుషుమ్న క్రియా యోగంలోని శాస్త్రీయ విజ్ఞానం ఈ మూడు కార్యక్రమాలతో రెండు సెషన్లు ముగిసాయి. కార్యక్రమం ముగిసాక అమ్మగారు రూమ్ వరకునడుస్తానన్నారు. అమ్మగారికి నడక అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ప్రకృతి శోభ నిండి ఉన్న ప్రదేశాలంటే చాలా ఇష్టపడతారు. అమ్మగారి వెనుకనే కొందరం ఉన్నాం. అమ్మగారు అక్కడి పర్వత సౌందర్యాన్నితదేకంగా చూస్తూ..నెమ్మదిగా నడుస్తున్నారు. మేము నడుస్తున్న మార్గం మధ్యలో చిన్న చిన్న పూ బాలలు అనేక రంగుల్లో కనిపించాయి. అమ్మగారు ప్రతీ పువ్వును తిలకిస్తూ మురిసిపోతున్నారు. ఆచిన్న చిన్న పూల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, ముగ్ధులవుతూ….. ఒక పుష్పాన్ని పసి పాపాయిని ముద్దాడుతున్నట్లుగా పట్టుకుని ఆనందంగా నవ్వుతూ నడిచారు. వెనకనే వస్తోన్న మా మదిలో మెదిలినభావన. ఈ రోజు ఆ పువ్వు ఎంత అదృష్టం చేసుకుందో….! అమ్మగారి కర స్పర్శతో దాని జీవితం ధన్యం అయింది! అనిపించింది. ఆ రోజుకు ధ్యాన కార్యక్రమాలు ముగిసాయి. అమ్మగారు అందరినివిశ్రమించమన్నారు. మధ్యాహ్నం వేళ కాస్త విశ్రాంతి తీసుకొని 4 గంటల ప్రాంతంలో మరొక చోటికి బయలు దేరాం.
The next day, we got up during the Brahma Muhurat and got ready immediately and…