Welcome to the BLISSFUL journey

అనురాధ మండలిక అనుభవాలు

0

ప్రతి ఒక్కరి జీవితంలోనూ “ఆత్మీయుల మృతి” చాలా దుఃఖాన్ని నిరాశను కుటుంబము మొత్తము పొగమంచులాగా కమ్మేసి,కొన్ని సంవత్సరాల ఆనందాన్ని మృగ్యం చేస్తుంది.” జన్మించిన వారికి మరణము సహజము”అన్న గీతా వాక్యము ఎన్ని సార్లు మననము చేసినా అది అభ్యాసములోకి తెచ్చుకోవడము కష్టము.2007వ సంవత్సరములో చాలా కలివిడిగా ఉండే అనురాధగారి కుటుంబములో వారి మరిదిగారు అర్ధాంతరంగా యాక్సిడెంట్లో పోవడముతో అందర్నీ అయోమయ పరిస్థితికి గురిచేసింది.మామగారు, అత్తగారు ఒక గంట నిద్రపోవాల్సి వచ్చినా నిద్రమాత్రలు వేసుకోవల్సినంత అనారోగ్యానికి గురి అయి,బి.పి, షుగర్లు పెరిగి పోయి మంచాన పట్టారు.ఆమె భర్తగారు తమ్ముడితో ఉన్న సాన్నిహిత్యం వలన అతనిని పోగొట్టుకున్న దుఃఖంలో ఉద్యోగం మీద దృష్టి పెట్టలేని పరిస్థితి,అనురాధగారికి బాధ్యత ,బంధము పెరిగిపోయి బి.పి, థైరాయిడ్ సమస్యలకు గురి అయ్యారు.కుటుంబములో అందరూ జీవచ్చవాలుగా జీవితము గడుపుతున్న సమయంలో ఒక గురువుగారు ఆధ్యాత్మిక విషయాలు చెబుతూ ,పూజలు చేయిస్తూ,కొంత వారి కుటుంబాన్ని సేద తీర్చగలిగారు…ఆ గురువుగారు తప్పనిసరిగా కొన్ని యాత్రలకు వెళ్ళినప్పుడు మళ్లీ ఈ కుటుంబాన్ని ఎదో బాధ వెంటాడుతున్నట్లుండేది…ఒక ఆరేళ్లలో వారు వృద్ధాప్యం వలన పరమపదించారు.ఆ ఉపశమనం కూడా లేని స్థితిలో దైవ కృప వలన ఒక మిత్రులు వీరింటికి వచ్చి సుషుమ్న క్రియా యోగము ఉపదేశించారు. సుషుమ్న క్రియా యోగ గురువుల కృపవల్ల ఇంట్లో అందరూ ధ్యానం చేస్తూ,అరుణాచలంలో గురుపౌర్ణమికి అమ్మగారిని దర్శించుకునే అదృష్టం కలిగింది. అనురాధగారి అత్తగారిని చూసి, “మీరు ఈ నాటి నుంచి మీ చిన్న కొడుకును తలుచుకుని ఏడవను అని నాకు ప్రామిస్ చెయ్యండి – అని శ్రీ ఆత్మానందమయి అమ్మగారు వాక్కులో మాగ్నటిజమ్ మాటల్ని ఉపదేషంగా మార్చిందా? అన్నట్లు ప్రతిరోజూ కొన్ని గంటలు కన్నీరు పెట్టుకునే అత్తగారు తమాషాగా ఆ నాటి నుంచీ దుఃఖ పడడము మానేశారు.ఒక్క సంవత్సర ధ్యానంతో అందరికీ పాజిటివ్ మార్పులు కనిపించాయి.అత్తగారు , మామగారి ఆరోగ్యాల్లో మార్పులు వచ్చి,బి.పి ,షుగరు,నిద్ర మాత్రలు అన్నీ నియంత్రించబడ్డాయి.అనురాధగారు కూడా అన్ని మందులూ మానేశారు.
“సుషుమ్న క్రియా యోగము ఒక శాస్త్రీయమైన ధ్యాన పద్ధతి.ఇది శాంతిని ,ఆత్మ పరివర్తనమును మనలో తీసుకువచ్చి,నిజంగా మనలో సామర్థ్యాన్ని వెలికి తీసుకువస్తుంది”అంటారు అనురాధగారు…అంతే కాదు..మా కుటుంబంలో జరిగిన ఈ అధ్బుతమైన అనుభవం వలన,మా బోటి కుటుంబీకులందరికి ఈ అద్భుతాన్ని ఉపదేశించాలన్నదే నా ధ్యేయం…. అన్న అనురాధగారి మాటలు అనుభవ, అక్షర సత్యాలు అనిపిస్తాయి.

Share.

Comments are closed.