కొత్త సంవత్సరం సందర్భంగా, సుషుమ్న క్రియా యోగ కుటుంబ సభ్యులందరికి నా ఆశీస్సులు, శుభాకాంక్షలు.
భగవంతుడు మనకి మరొక మంచి అవకాశాన్ని కల్పించారు. ఈ సంవత్సరంలో మనం గత సంవత్సరం సాధించలేని విషయాలని సాధించే లాగ 100 % ప్రయత్నం చెయ్యాలి.అంటే భయాన్ని, బాధని, కోపాన్ని, లోభత్వాన్ని… ఇలా చాలా ఉండొచ్చు. వీటిని విచారణ ద్వారా ధ్యాన సాధన ద్వారా తగ్గించుకొనే ప్రయత్నం మీరు చెయ్యాలి. మీ జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి సుషుమ్న క్రియా యోగ సాధన క్రమం తప్పకుండా చెయ్యండి.
విచారణలో మీకు తెలుస్తుంటాయి.. ఏ విషయాల్లో నాలో improvement రావాలి. ఏ విషయాల్లో నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి… అనుకున్న వాటిని ఎలాగైనా ఈ సంవత్సరం పూర్తి చెయ్యాలని సంకల్పం చేసి.. దానికి తగ్గట్లుగా వర్క్ అవుట్ చెయ్యండి. మీ సమస్య పెద్దదైన చిన్నదైనా, మీ లక్ష్యం ఏదైనా గురువులు మీకు తోడుగా ఉంటారు. ఆ ధైర్యంతో మీరు ముందుకు సాగండి. రాబోయే రోజుల్లో మరింత ప్రవర్ధమానం అయ్యే సుషుమ్న
క్రియా యోగ కుటుంబ సభ్యులుగా… మీరు అంతా కలిసి మెలిసి… కలహాలను, మనస్పర్థలు పక్కకు పెట్టి… అందరూ ఒకే మాటగా, ఒకే బాటగా ఈ విశ్వ కార్యానికి పనిచేయాలి. మీరందరు భగవంతుడికి, గురువులకు చాలా దగ్గరైన వారు. అందుకే మీరు మరింత బాధ్యతగా ఉండాలి. మీకై మీరు జీవించటమే కాక, సమాజ శ్రేయస్సు, ఈ విశ్వ శ్రేయస్సు కోసం మీరు పనిచేస్తున్నారన్న భావన మీరు ఎప్పుడు మరువద్దు. ధ్యాన సాధన, ఆత్మ విచారణ, సేవ, భావం ఈ నాలుగు సూత్రాలు మిమల్ని పరమాత్మ స్థితికి తీస్కువెళ్తాయి. ఈ సంవత్సరం పరిపూర్ణమైన ఆనందం ఆత్మ స్వరూపులైన మీకందరికీ లభించాలని నా ఆశీస్సులు.
6 Comments
Pranamams Amma me anugrham tho Meru cheppina bata lo nadusthamu daniki kavalasina Sakthi ni prasadinchandi
Pranamams Amma me assisulu sada Matho vundalani koruthu
Pranamams amma
Amma, Amma Amma Amma
Pranamam Ammagaru!!!
Pranams