Welcome to the BLISSFUL journey

49 రోజుల డిటాక్స్

1

యోగ శుద్ధి
యోగ శుద్ధి అన్న వినూత్న విధానం తనువు, మనసు, ఆత్మల సమన్వయం కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.వేసవి వేడిమిని అధిగమించి, కాలంలో రాబోయే  మార్పులకు అనుగుణంగా శరీరాన్ని దృఢంగా చేసుకొని, రోగ నిరోధక శక్తిని పెంపొందించేలా చేసే విలక్షణ విధానం యోగ శుద్ధి.
మేము ప్రతి రోజు అందించే చిట్కాలు మీకు వంటింట్లో అందుబాటులో ఉన్నవే. 7 వారాల పాటు మీరు ఈ చిట్కాలను మేము చెప్పిన పద్ధతిలో పాటించినట్లయితే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రగతి తధ్యం.
శరీరం క్లేశపూరితం అయినప్పుడు పౌష్టికాహారం తిన్నా కూడా ప్రయోజనం ఉండక పోవచ్చు. అంతే కాక మానసికోల్లాసం కూడా కొరవడుతుంది. శరీర పనితనాన్ని మందగించేలా చేసే విషపూరితమైన పదార్థాలు శరీరం నుంచి బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే శరీరం ఆరోగ్యవంతం అవుతుంది. జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరిగి, శరీరం తేలిక బడుతుంది.  దీని  వలన చురుకుదనం ప్రోది అవుతుంది.
యోగ శుద్ధికి  తొలి మెట్టు దృఢ సంకల్పం.సంకల్ప బలమే మీ విజయాన్ని నిర్ణయించగలదు. ఈ ప్రక్రియను ప్రారంభించే ముందు  మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ప్రక్రియ నేనెందుకు చేయాలి? దీని వల్ల ప్రయోజనం పొందేది ఎవరు? ఈ ప్రక్రియ చేయటానికి నాకు అవాంతరాలుగా నిలిచేవి ఏవి? నేను దీక్షగా ఈ ప్రక్రియను చేయాలంటే ఎలా? ఈ ప్రశ్నలు వేసుకోవటంతో పాటు యోగ శుద్ధి ద్వారా మీరు ఏమి పొందనున్నారో అన్న దాని గురించి నోట్స్ తయారు చేసుకోండి. అన్నీ విధాలా మీకు సరైనదని తోచినట్లైతే అప్పుడు ఇక రంగంలోకి దిగండి.

యోగ శుద్ధి మరియు పరిపూర్ణ వికాసం
శరీరం
: 49 రోజుల యోగ శుద్ధి ప్రక్రియను పాటించటానికి కొన్ని చిట్కాలు.
మనసు: : మానసికమైన కల్లోలాన్ని సృష్టించే 4 ప్రధానమైన ఇబ్బందులను పరిశీలించి వాటిని ఒక్కొక్కటిగా మనోమయ కోశం నుండి పెకలించి వేసే ప్రక్రియ.
ఆత్మ:  రోజు 21/49 నిమిషాల  సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా ఆత్మపరంగా  దిగ్విజయంగా పురోగమించటం.
శరీరం శక్తికి మూలం. శరీరం అన్ని విధాలుగా శక్తిమంతంగా ఉండటమే ఈ ఆధునిక మానవుడి తక్షణ అవసరం. ఈ రోజు నుంచి 49 రోజులు పాటు శరీరాన్ని ఉత్తేజితం చెయ్యగల యోగ శుద్ధిని  ప్రవేశపెడుతున్నాం. ఈ పద్ధతి ద్వారా  శరీరంలో హానికారకమైన మలినాలు నుంచి విముక్తి పొందవచ్చు. ఇది ఒక డైట్ ప్లాన్ లాంటిది కాదు, కానీ కావాల్సినవన్నీ తింటూ కూడా పాటించగల అద్భుతమైన విధానం.
ఇందుకు మీరు సిద్ధమా?
49 రోజుల పాటు ఆచరించగల ఈ పద్ధతిని పాటించి మీ శరీరం, మనసు, ఆత్మను శుద్ధంగా మార్చుకోండి ఎంతో  సులువుగా, చిన్న చిట్కాల ద్వారా ఆరోగ్యం మన సొ0తం కాగలదు. మీ రోజును ఈ ప్రత్యేకమైన డైట్ ప్లాన్ తో ప్రారంభం చెయ్యండి. ఇక మార్పు మీరే చూస్తారు.

ఎటువంటి ప్రక్షాళన జరగాలన్నా కేవలం శరీరంలో జరిగితే సరిపోదు. శరీరంతో పాటు మనసు అలాగే శరీరాంతరాళాల్లో ఇతర ఆధ్యాత్మిక పొరల్లో కూడా ప్రక్షాళన జరగాలి. అప్పుడే పరిపూర్ణ ఆరోగ్యం అని చెప్పబడింది.
భగవంతుడు మానవుడికి ప్రసాదించిన విలువైన వరమే దేహం. శరీరంలో 72000 నాడులు 7 చక్రాలు ఉన్నాయి.  వీటిలో సుషుమ్న నాడి అత్యంత ముఖ్యమైనది. ప్రాణ శక్తి అనబడే విశ్వ శక్తి ఈ  చక్రాలలోకి  ప్రవహించినప్పుడు ఆరోగ్యం, ప్రాణ శక్తి ప్రవాహానికి ఆటకం ఏర్పడినప్పుడు అనారోగ్యాలు సంభవిస్తాయి. ఈ చక్రాలలో సమతుల్యం కలగటం వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం మన వశం అవుతుంది. కాబట్టి

మనో శుద్ధి
శరీరం, మనసు ఆత్మలను ఒకటిగా చేసే ప్రక్రియ “యోగ శుద్ధి”. ఆత్మ శోధన ఒకటి, మానసికంగా కోరుకునేది ఒకటి, శరీరం చేసేది మరొకటి. మానవ జీవితంలో శాంతి కొరవడటానికి కారణమైనది, ఈ సమన్వయ లోపమే. “యోగ శుద్ధి” ద్వారా భౌతిక శరీరానికి కావాల్సిన శక్తి, మానసికంగా కావాల్సిన వికాసం, ఆత్మ పరంగా జరగాల్సిన చేతన అద్భుతంగా సంభవిస్తాయి
మానవుడు జీవితంలో ఎన్నో మిళితమైన అనుభవాలను పొందుతాడు. సుఖమని, దుఃఖమని, బాధ అని, భయమని….. ఇలా ఎన్నో రకాల అడ్డంకులు మానవ ప్రగతిని నియంత్రిస్తా. అపజయాలు పెరిగే కొద్దీ ఏ పని తలపెట్టాలన్నాభయం. జీవితంలో అసంతృప్తి, జీవితమంటే నైరాశ్యం కలుగుతాయి. ఆధునిక జీవన విధానంలో కేవలం ఆహార ద్వారానే కాక, ఇంటర్నెట్, సోషల్ మీడియా, టీవీల కారణంగా మానసిక కాలుష్యం ఏర్పడుతోంది. దీనికి తోడు భారతీయులంతా తమ ఉనికిని విస్మరించి వేరొక జీవన శైలికి అలవాటు పడటం, పురాణాలు, ఇతిహాసాలలో నీతి, నియమాలను తెలుసుకోలేక పోవటం వల్ల కూడా అస్థ వ్యస్థమైన జీవనాన్ని వెళ్లదీయవలసి వస్తోంది. ఇన్ని రకాల బాహ్య అంతర్ యుద్ధాలను ఎదుర్కొంటున్నాడు మానవుడు.
ఆధునిక మానవుల జీవన శైలికి అనుగుణంగా రూపొందించినదే “యోగ శుద్ధి ”

శరీర శుద్ధి : శారీరక శుద్ధి కోసం వంటింట్లో అందుబాటులో ఉన్న మూలికలు, ఆకులతో శారీరక ఆరోగ్యానికి ప్రతిబంధకాలైన విష పూరితమైన పదార్థాలను తరిమి వేయటం.

మానసిక శుద్ధి : మానసిక ఆరోగ్యానికి విచారణ చేయాల్సిన అంశాలు
* అభద్రతా భావం. ( అన్నీ ఉన్న కూడా ఏమైనా జరుగుతోందోనన్న ఇన్సెక్యూరిటీ )
* ఇతరులతో పోలిక , (వారికి ఇంత అని కంపారిజన్)
*అనుకున్నది జరదేమోనన్న బెంగ. (నేను కోరుకున్నది జరగదేమో అన్న బెంగ )
*జరగకూడనిది ఏమైనా జరుగుతుందేమో అన్న ఉద్రిక్తత.
అంతర్ శుద్ధి: దైవ శక్తిని జాగృతం చేసి  ఆత్మ సాక్షాత్కారం అందించగల సుషుమ్న క్రియా యోగ సాధన 21 /  49 నిమిషాల పాటు చేయటం.

చిన్న చిన్న మార్పులను జీవితంలోకి ఆహ్వానించ గలిగితే అవి జీవితంలో పెను మార్పులను తెస్తాయి. మానవ జీవన పునర్ నిర్మాణం, నవ నిర్మాణమే “యోగ శుద్ధి”.

49 రోజుల యోగ శుద్ధి చేసే విధానం

శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా అభ్యున్నతి సాధించటం కోసం ఈ ప్రక్రియను ప్రారంభించండి.మొదటి వారం మేము అందించే ప్రణాళిక ప్రకారం మీరు పాటించాల్సిన నియమావళికి మీరు సిద్ధమే కదా? అయితే ఒక్క రోజు కూడా మానకుండా మీరు మేము అందించే ప్రక్రియలను శ్రద్ధగా చేయాలి. ఈ ప్రక్రియ కేవలం శారీరక లాభాలకు మాత్రమే ఏర్పరిచింది కాదు. అన్నీ విధాలుగా పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించటమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. మీరు ఈ ప్రక్రియను చేస్తూ ఖచ్చితంగా ప్రతి  రోజు 21 నిమిషాలు  సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన చేయాలి.

అలాగే శారీరకమైన శుద్ధి జరిగేందుకు కొన్ని పదార్థాలు మీరు స్వీకరించాలి. మేము చెప్పిన పదార్థం దొరకని పక్షంలో మీరు ఆ పదార్ధానికి బదులుగా పసుపును వాడవచ్చు.

సిద్ధ గురువుల పర్యవేక్షణలో ఏర్పాటైన ఈ ప్రక్రియ ఏడు చక్రాలను ప్రభావితం చేయటానికి తీర్చిదిద్దబడింది.

 • ప్రతి రోజు ఉదయం 5 :45 నిమిషాల నుండి 6 :15 మధ్యలో నీటిలో మేము ప్రణాళికలో సూచించిన పదార్ధాన్ని మరిగించి స్వీకరించటం జరిగిపోవాలి.
 • ఆ తరువాత ధ్యానం
 • అనంతరం ఆధ్యాత్మిక పరివర్తనకు ఉపయోగపడే 4 సూత్రాలలో మొదటి దానిని (అభద్రతా భావం)6 రోజుల పాటు ఆచరించాలి.
 • మరో 6 రోజుల పాటు దాన్ని గురించి విచారణ చేయాలి.
 • యోగ శుద్ధికి సంబంధించిన ప్రక్రియలన్నీ ఉదయం 7:౦౦ గంటలకు పూర్తి కావాలి..

 

మొదటి వారం

శరీరం : స్థూల శరీర శుద్ధి కోసం సూర్య ప్రణామం.

సూక్ష్మ: శరీర శుద్ధి కోసం బిల్వ పత్రాలు, తులసి, వేప, పసుపు

మనసు: ఓం కారాలు, దీర్ఘ శ్వాసలు

ఆత్మ: ఆత్మ శక్తికి, జ్ఞాన వికాసానికి 21 నిమిషాల సుషుమ్న క్రియా యోగ ధ్యానం.

 

రెండవ వారం

గత వారం మేము అందించిన నియామావళిని మానకుండా చేశారు కదా. ఇదే ఉత్సాహంతో రెండవ  వారం కూడా విజయవంతంగా పూర్తి చేయండి.

శరీరం: స్థూల శరీర శుద్ధి కోసం సూర్య ప్రణామం.

సూక్ష్మ శరీర శుద్ధి కోసం  యాలుక, దాల్చిన చెక్క, జామ ఆకు, అల్లం, ధనియాలు

మనసు: ఓం కారాలు, దీర్ఘ శ్వాసలు.

ఆత్మ: ఆత్మ శక్తికి, జ్ఞాన వికాసానికి 21 లేదా  49 నిమిషాల సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన

 

మూడవ వారం

యోగ శుద్ధి ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం, ఆనందమే లక్ష్యంగా ప్రక్రియలన్నీ చేస్తున్నారు కదా!

శరీరం: స్థూల శరీర శుద్ధి కోసం సూర్య ప్రణామం.

సూక్ష్మ శరీర శుద్ధి కోసం  వెల్లుల్లి, వేప,యాలుక, మిరియాలు

మనసు: ఓం కారాలు, దీర్ఘ శ్వాసలు.

ఆత్మ: ఆత్మ శక్తికి, జ్ఞాన వికాసానికి 21 లేదా  49 నిమిషాల సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన

 

నాల్గవ వారం

ఎంతో అద్భుతంగా నాలుగు వారాల పాటు యోగ శుద్ధి ద్వారా లభించే పరిపూర్ణ ఆరోగ్యం దిశగా అడుగులు వేశారు. ఈ ప్రక్రియ వల్ల మీరు మునపటి కంటే అధికమైన శక్తితో రోజును వెళ్లదీస్తున్నారా?
ఈ ప్రక్రియ ద్వారా మీరు ఇప్పటి వరకు పొందిన లాభాలను గురించి మాకు రాసి పంపండి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధి ఏ స్థాయిలో మీలో జరుగుతోందో మాతో పంచుకోండి!

ఈ వారం యోగ శుద్ధికి కావాల్సిన పదార్థాలు
దూర్వ గడ్డి
బిల్వ పత్రం
నిమ్మ రసం
జీల కర్ర

శరీరం: సూర్య నమస్కారాలు
నీటిలో మేము సూచించిన విధంగా పదార్థాలు మరిగించి తాగటం.

మనసు: మానసిక శుద్ధి కోసం ఓంకారాలు దీర్ఘ శ్వాసలు

ఆత్మ: సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన

ఐదొవ వారం

ఈ రోజు వరకు క్రమం తప్పకుండా యోగ శుద్ధి ప్రక్రియను కొనసాగిస్తున్నవారు విజయానికి అత్యంత చేరువలోనే ఉన్నారు.

ఈ వారంలో కావాల్సిన  పదార్థాలు
గసగసాలు
పుదీనా
నిమ్మాకు
వేపాకు

శరీరం: సూర్య నమస్కారాలు
నీటిలో మేము సూచించిన విధంగా పదార్ధాలను మరిగుంచి తాగటం.

మనసు: మానసిక శుద్ధి కోసం ఓంకారాలు దీర్ఘ శ్వాసలు

కోరుకున్నది/ అనుకున్నది జరుగుతుందో? జరగదో! అన్న బెంగను జీవితం నుండి ఎలా తొలగించాలో దానిపై విచారణ

ఆత్మ: సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన

ఆరొవ వారం

ఇంతే దీక్షతో మరో రెండు వారాల పాటు మేము చెప్పిన రీతిలో ప్రక్రియలను చేయండి
ఈ వారానికి కావాల్సిన పదార్ధాలు

వాము
తులసి
కరివేపాకు
ఉసిరి

శరీరం:
సూర్య నమస్కారాలు,
నీటిలో మేము సూచించిన విధంగా పదార్ధాలను మరిగించి తాగటం.

మనసు:
మానసిక శుద్ధి కోసం ఓంకారాలు /దీర్ఘ శ్వాసలు
జరగకూడనిది ఏమైనా జరుగుతుందేమో అన్న ఉద్రిక్తతను తొలగించటం అన్నది జీవితానికి అన్వయించు కోవటం.

ఆత్మ: సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన

ఏడొవ వారం

గురు పౌర్ణమి సందర్భంగా గురువులు మనకు అనుగ్రహించిన ప్రక్రియలను యోగ శుద్ధిలో భాగంగా నిరాటంకంగా చేసిన వారికి శుభాభినందనలు.
మరొక్క వారం రోజుల పాటు మేము అందించే ప్రక్రియలను చేసి పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.
మీకు సుషుమ్న క్రియా యోగ 49 నిమిషాల ధ్యాన ప్రక్రియను గురించి మరింత సమాచారం కావాలంటే మా వెబ్సైట్ కు వెళ్ళండి! జీవితానికి స్ఫూర్తినిచ్చే అనేక విషయాల కోసం మా ఫేస్బుక్ పేజీ లోకి వెళ్ళండి!

ఈ వారానికి కావాల్సిన పదార్ధాలు
కానుగ ఆకులు
మునగాకులు
పసుపు
కొబ్బరి నీళ్లు

శరీరం:
సూర్య నమస్కారాలు,
నీటిలో మేము సూచించిన విధంగా పదార్ధాలను మరిగించి తాగటం.

మనసు:
మానసిక శుద్ధి కోసం ఓంకారాలు /దీర్ఘ శ్వాసలు
జరగకూడనిది ఏమైనా జరుగుతుందేమో అన్న ఉద్రిక్తతను తొలగించటం అన్నది జీవితానికి అన్వయించుకొని దాని పై విచారణ చేయటం

ఆత్మ: సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన

మనసు – మాయ

మనకున్న అపారమైన శక్తిలో కేవలం  పదవ వంతు మాత్రమే మనం వినియోగిస్తాం. ఎందరో శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్ర నిపుణులు తమ పరిశోధనల ద్వారా తెలుసుకున్న వాస్తవం ఇది. సమాజంలో విభిన్న రంగాలకి చెందిన వారంతా మనసు పెట్టే క్షోభకు లోనయ్యే వారే. ఎంత ఉన్నతమైన పదవుల్లో ఉన్నా, అన్నీ ఉన్నా కూడా మానసిక నైరాశ్యానికి లోనవుతుంటారు కొందరు. ఎన్ని కోరికలు తీరినా ఇంకా ఎదో కలవరం. ఎదో లోటు ప్రతీ మనిషిని వెంటాడుతుంటుంది.
” తొంభై శాతం జీవితం మనం దాన్ని మలచటం పై ఆధారపడితే, పది శాతం మాత్రం మనకు ఎదురయ్యే సవాళ్ల పై ఆధార పడి ఉంటుంది.
మనిషికి అన్నిటిలోకి మానసిక సౌచాన్ని పాటించటం చాలా కష్టం. మన ప్రమేయం ఉన్నా, లేకపోయినా మనసు పనిచేస్తూనే ఉంటుంది. ఏ పని చేసినా మానసిక అంతర్ యుద్ధం నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. మానసిక శుద్ధి జరగాలంటే ప్రతీ ఒక్కరూ ఆచరించి, విచారించాల్సిన విషయాలు నాలుగు.
ఇవే మానసిక ఆరోగ్యానికి సిద్ధ గురువులు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు అందరికీ అందించిన నాలుగు సూత్రాలు.

 1. అభద్రతా భావం తొలగించటం(అన్నీ ఉన్నా ఏమైనా జరుగుతోందోనన్న ఇన్సెక్యూరిటీ ).

  6రోజులు (అభద్రతా భావం తొలగించటం ఆచరించటం) + 6 రోజులు (ఆ భావం మీద  ఆత్మ విచారణ).

మొదటి 6 రోజులు  (ఆచరించటం) :
మొదటి 6 రోజులు ఈ సూత్రాన్ని  మీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలలో ఆచరించండి.

రెండవ 6 రోజులు (ఆత్మ విచారణ):

 •   మొదటి రోజు ఈ విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం  చేయండి!
 • రెండవ రోజు దీని  గురించి విచారణ చేసి, మీ ఆలోచనలను రాసుకోండి!
 • మూడు, నాలుగు, ఐదవ రోజు  ఏయే సందర్భాల్లో మీ జీవితంలో ఇది  తారస పడుతుందో, మీరు అందుకు ఎలా స్పందిస్తున్నారో గమనించండి!
 • యధాలాపంగా పనులు చేయటం కాక ఎరుకతో ఉండండి!

ఇతరులతో పోలిక వదిలిపెట్టడం(నాకు ఇంత, వారికి అంత అని కంపారిజన్  వదిలిపెట్టడం)

మొదటి వారం మీ ఆధ్యాత్మిక పురోగమనానికి తోలి అడుగుగా,  మేము సూచించిన విధంగా విచారణ, ఆత్మ పరిశీలనను చేసారు కదా! ఈ వారం మొదటి 6 రోజులు ప్రతీ విషయంలో ఇతరులతో పోల్చుకొనే లక్షణాన్ని వదిలిపెట్టడం అన్నది నిత్య జీవితంలో ఆచరించండి.

ఈ క్రమంలో, ఏదైనా ఒక సందర్భంలో ఆచరణ సాధ్య పడనప్పుడు తిరిగి మళ్ళీ ప్రయత్నం చేయండి

ఇతరులతో పోల్చుకోవటం వల్ల కలిగే పర్యావసానాలను గురించి తెలుసుకోండి

ఇతరులతో పోలిక వల్ల నిజమైన ఆత్మ తత్వం ఏ విధంగా మరుగున పడుతుందో గమనించండి.

మరో ఆరు రోజుల పాటు, ఏ విధంగా మీరు దాన్ని జీవితానికి అన్వయించుకొని ఆచరించగలిగారో, దాన్ని గురించి అత్యంత సూక్ష్మంగా విచారణ చేయండి.

విచారణ చేసే క్రమంలో ఓపిక, నిశితమైన పరిశీలన అన్నది చాలా ముఖ్యం.

విచారణలో తెలుసుకున్న విషయాలను రోజు రాసుకోండి.

3. అనుకున్నది జరదేమోనన్న బెంగ. (నేను కోరుకున్నది జరగదేమో అన్న బెంగ )
*జరగకూడనిది ఏమైనా జరుగుతుందేమో అన్న ఉద్రిక్తత.

మనం అనుకున్నది అనుకున్నట్లుగా ఒక పని జరుగుతుందో లేదో అన్న ఆలోచన రాగానే దాని గురించి అప్రత్తం అవ్వండి!

ఈ ఆలోచన వల్ల ఎంతగా శక్తి వృథా అవుతోందో దాని గురించి జాగ్రత్తగా గమనించండి!

అనుకున్నది జరగాలని మనసు, కాలం కన్నా వేగంగా పరుగుపెట్టాలని చూస్తుంది! మనసు చేసే మాయలో భాగమే ఈ బెంగ అన్నది గుర్తించండి

ప్రతి నిత్యం మీ జీవనంలో అనుకున్నది జరగాలన్న బెంగను విడిచిపెట్టడం అన్నది ఆచరించండి

6 రోజుల పాటు ఇలా చేయండి.

అనుకున్నది / కోరుకున్నది జరుగుతుందో జరగదో అన్న బెంగను విడిచిపెట్టడం గురించి విచారణ

విచారణ చేసే క్రమంలో సాధకులు లోతుగా తమను గురించి తాము అధ్యయనం చేసుకోగలగాలి!

పక్క వారి తప్పులను వేలెత్తి చూపే విషయంలో ఎంత కఠినంగా ఉంటామో…. అలా మనని గురించి మనం విచారణ చేయాలి!

అనవసరమైన బెంగ వల్ల ఎంత అలజడికి లోను అవుతామో గ్రహించాలి !

బెంగ పడినంత మాత్రాన పరిష్కారం లభిస్తుందా అన్న దాని పై విచారణ చేయాలి!

ఈ క్షణంలో ఆనందాన్ని ఆస్వాదించగలగాలి!

4. ఏమైనా జరుగుతుందేమో అన్న భయాన్ని తొలగించటం 

మానసిక శుద్ధిలో భాగంగా సంక్లిష్ట పరిస్థితులను అధిగమించటంతో పాటు సత్యాన్ని నిర్భయంగా ఎదుర్కొనే నిబ్బరమైన మనసును ఏర్పరుచుకోవాలి. ఎన్నో సార్లు నిజాన్ని నిర్భయంగా ఎదుర్కోలేని పరిస్థితుల్లోకి వెళిపోతుంటాం. ఒక విషయాన్ని జరగకూడదు అని భయపడటం అంటే సత్యానికి దూరంగా మనం పారిపోవటం. ప్రకృతి ధర్మాలకు తలవంచటమే మానవ జన్మ పరమార్ధం. అహంకారం వల్ల మనిషి అంతా తానే అన్న భావనలో ఉంటాడు. ఈ విశ్వంలో నేను కేవలం ఒక రేణువును మాత్రమే అన్న అవగాహన కలిగినప్పుడు, నాది, నేను, అన్న భావన నుండి మనిషి బయటకు రాగలిగితే ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి సమున్నత స్థానాన్ని అధిరోహించినట్లు.

ఒక పర్షియా రాజుగారు తమ అంగుళీకం మీద “ ఇది సైతం వెడలి పోనీ” అన్న అక్షరాలను లిఖియింప చేసుకున్నారట.జీవితం అంటేనే ఒక ప్రయాణం.
ఈ ప్రయాణంలో ఏది శాశ్వతం కాదు అన్న అవగాహన రావాలి.

 

Share.

1 Comment

Leave A Reply