గురు పౌర్ణమి సందర్భంగా గురువులు మనకు అనుగ్రహించిన ప్రక్రియలను యోగ శుద్ధిలో భాగంగా నిరాటంకంగా చేసిన వారికి శుభాభినందనలు.
మరొక్క వారం రోజుల పాటు మేము అందించే ప్రక్రియలను చేసి పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.
మీకు సుషుమ్న క్రియా యోగ 49 నిమిషాల ధ్యాన ప్రక్రియను గురించి మరింత సమాచారం కావాలంటే మా వెబ్సైట్ కు వెళ్ళండి! జీవితానికి స్ఫూర్తినిచ్చే అనేక విషయాల కోసం మా ఫేస్బుక్ పేజీ లోకి వెళ్ళండి!
ఈ వారానికి కావాల్సిన పదార్ధాలు
కానుగ ఆకులు
మునగాకులు
పసుపు
కొబ్బరి నీళ్లు
శరీరం:
సూర్య నమస్కారాలు,
నీటిలో మేము సూచించిన విధంగా పదార్ధాలను మరిగించి తాగటం.
మనసు:
మానసిక శుద్ధి కోసం ఓంకారాలు /దీర్ఘ శ్వాసలు
జరగకూడనిది ఏమైనా జరుగుతుందేమో అన్న ఉద్రిక్తతను తొలగించటం అన్నది జీవితానికి అన్వయించుకొని దాని పై విచారణ చేయటం
ఆత్మ: సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన
❖ కానుగ ఆకులు
కానుగ చెట్టు ఆకులు. చర్మ వ్యాధుల నివారణలో బాగా పనిచేస్తాయి. మూత్ర పిండాల సంబంధిత వ్యాధులు, యూరిన్ ఇన్ఫెక్షన్స్, పైల్స్, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు, ఇలా రకరకాల సమస్యలకు దివ్య ఔషధిలా పనిచేస్తుంది. ఆయూర్వేదం మరియు సిద్దవైద్యంలో కానుగ చెట్టు యొక్క భాగాలను ఉపయోగించేవారు. చెట్టు యొక్క ఆకులను, పూలను, గింజలను, బెరడు మరియు వేరు యొక్క అన్ని భాగాలను వివిధ రకాల దేహరుగ్మతల నివారణ, మందుల తయారిలో వినియోగిస్తారు. తేలు విషానికి విరుగుడుగా కూడా ఈ ఆకు పసరును వాడతారు.
❖ మునగాకు
మునగాకు కడుపులో మంటను చల్లార్చి ఉపశమనం ఇస్తుంది. శరీరంలో కొవ్వును కరిగించి హృత్ సమస్యల నుంచి కాపాడుకునేలా చేస్తుంది. అధికమైన బరువు, పొట్ట ఉన్న వారు సరైన శరీర వ్యాయామంతో పాటు మునగాకును నీటిలో మరిగించి తీసుకోవచ్చు.
❖ ఓంకారం
ఓంకారం మహామంత్రం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే ఓంకారం. ఈ ప్రణవ నాదాన్ని నాభి నుంచి ఉచ్ఛరించినప్పుడు బీజ రూపంలో ఉన్న జన్మ వాసనలు, జ్ఞాపకాలు, కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్యాలు సాధనకు అడ్డంకులుగా నిలవకుండా, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ బీజాలు విష వృక్షాలుగా మారి విజృంభించకుండా ఉండటానికి నాభి స్థానం నుంచి ఓంకారం చెయ్యాలి. ఇలా ఓంకారం చెయ్యటం వల్ల ధ్యాన సాధన కూడా సుగమం అవుతుంది. అన్ని మంత్రాలకు ఆది, పునాది ఓంకారం.
❖శ్వాస
శ్వాస మానవ శరీరా లైన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను బంధించే సూత్రం. శ్వాస లేనిదే ఈ జగతి లేదు. దీర్ఘ శ్వాస ద్వారా అంతః క్లేశములు తొలగిపోతాయి. శ్వాస లోపలికి తీసుకున్నపుడు ఆరోగ్యం, ఆనందం, ధైర్యం, విజయం ఇంకా ఎన్నో సత్ గుణాలు కావాలని భావం చేస్తే గురువులు అనుగ్రహిస్తారు. శ్వాస విడిచేటప్పుడు ఏ గుణాలు, లక్షణాలు మన జీవితానికి అవాంతరాలుగా ఉన్నాయో వాటిని విడిచి పెడుతున్నట్లు భావం చేస్తూ శ్వాసను విడవాలి.
❖ సూర్య నమస్కారాలు
సూర్యుడిని సూర్యభగవానుడిగా భావిస్తుంది భారతీయ సనాతన ధర్మం. ఎందరో యోగులు సూర్య రశ్మి కారణంగా వందల సంవత్సరాలు శరీరాన్ని నిలుపుకున్నట్లు గాధలు ఉన్నాయి. సూర్యుడి బంగారు కాంతికి మానవ సహస్రారంలో ఉన్న రహస్య ఆధ్యాత్మిక గ్రంథికి సంబంధం ఉండటం వల్ల సూర్యోదయ సమయంలో అధికమైన శక్తి ప్రకంపనలు ఆ ప్రదేశంలో కలుగుతాయి. భక్తి ప్రపత్తులతో సాక్షాత్ గురు స్వరూపంగా భావించి సూర్యుడికి నమస్కారం చెయ్యండి.
❖ పసుపు:
పసుపు అంటే శుభం. వాయువులో, నీరులో, పృథ్విలో సంభవించే కాలుష్యాల కారణంగా ఏర్పడే దోషాలను నయం చేసి పంచ కోశాలలో సమతుల్యాన్ని ముఖ్యంగా ప్రాణ శక్తి ప్రవహించే కంటికి కనిపించని నాడీ కూడళ్లలో శుద్ధి చేస్తుంది పసుపు.
❖ కొబ్బరినీళ్లు
మణిపూరక చక్రంలో బలమైన బీజాలు దురలవాట్లు. హానికారక రసాల వంటివి సేవించటానికి బదులుగా కొబ్బరి నీళ్లు అలవాటు చేసుకొని, ధ్యాన సాధన చెయ్యటం వల్ల ఆరోగ్యకరమైన జీవనం మన సొంతం కాగలదు. కాలేయాన్ని ప్రక్షాళన చేసి శరీరమంతా పరిశుభ్రపరిచే గుణం కొబ్బరి నీటిలో ఉంది.