Welcome to the BLISSFUL journey

యోగ శుద్ధి 5వ వారం

0

ఈ రోజు వరకు క్రమం తప్పకుండా యోగ శుద్ధి ప్రక్రియను కొనసాగిస్తున్నవారు విజయానికి అత్యంత చేరువలోనే ఉన్నారు.

ఈ వారంలో కావాల్సిన  పదార్థాలు
గసగసాలు
పుదీనా
నిమ్మాకు
వేపాకు

శరీరం: సూర్య నమస్కారాలు
నీటిలో మేము సూచించిన విధంగా పదార్ధాలను మరిగుంచి తాగటం.

మనసు: మానసిక శుద్ధి కోసం ఓంకారాలు దీర్ఘ శ్వాసలు

కోరుకున్నది/ అనుకున్నది జరుగుతుందో? జరగదో! అన్న బెంగను జీవితం నుండి ఎలా తొలగించాలో దానిపై విచారణ

ఆత్మ: సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన

 

గసగసాలు
విటమిన్స్, ఐరన్, కాల్షియమ్, ఒమేగా  ఫ్యాటీ యాసిడ్స్ గసగసాల్లో ఉంటాయి. కిడ్నీ రాళ్ల సమస్యను ఎదుర్కొనే శక్తి వీటిలో ఉంటుంది. గసగసాలు స్వీకరించటం వల్ల శరీరంలో వేడి తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అతి  ఉత్సాహం కలిగినప్పుడు నాడులను శాంతిపచేయగల సామర్థ్యం ఉన్న పదార్థం గసగసాలు.

నిమ్మ ఆకులు
నిమ్మ ఆకును ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వంట పదార్థంగా వినియోగిస్తారు. నిమ్మ ఆకులను వికారానికి, తలనొప్పి, ప్రయాణాల్లో నీరసం, ఆస్తమా వంటి సమస్యల నివారణకు వినియోగిస్తారు. కంటి నిండా నిద్ర పట్టటానికి, నిమ్మ ఆకులు మంచివి. నిమ్మ ఆకుల ప్రాశస్త్యం మన పురాణాల్లో కూడా చెప్పబడింది. నిమ్మ ఆకులో ఔషధ విలువలు మీకు ఎంతో ఉపకరిస్తాయి.



ఓంకారం
ఓంకారం మహామంత్రం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే ఓంకారం. ఈ ప్రణవ నాదాన్ని నాభి నుంచి ఉచ్ఛరించినప్పుడు బీజ రూపంలో ఉన్న జన్మ వాసనలు, జ్ఞాపకాలు, కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్యాలు సాధనకు అడ్డంకులుగా నిలవకుండా, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ బీజాలు విష వృక్షాలుగా మారి విజృంభించకుండా ఉండటానికి నాభి స్థానం నుంచి ఓంకారం చెయ్యాలి. ఇలా ఓంకారం చెయ్యటం వల్ల ధ్యాన సాధన కూడా సుగమం అవుతుంది. అన్ని మంత్రాలకు ఆది, పునాది ఓంకారం.

శ్వాస
శ్వాస మానవ శరీరా లైన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను బంధించే సూత్రం. శ్వాస లేనిదే ఈ జగతి లేదు. దీర్ఘ శ్వాస ద్వారా అంతః క్లేశములు తొలగిపోతాయి. శ్వాస లోపలికి తీసుకున్నపుడు ఆరోగ్యం, ఆనందం, ధైర్యం, విజయం ఇంకా ఎన్నో సత్ గుణాలు కావాలని భావం చేస్తే గురువులు అనుగ్రహిస్తారు. శ్వాస విడిచేటప్పుడు ఏ గుణాలు, లక్షణాలు మన జీవితానికి అవాంతరాలుగా ఉన్నాయో వాటిని విడిచి పెడుతున్నట్లు భావం చేస్తూ శ్వాసను విడవాలి.

సూర్య నమస్కారాలు
సూర్యుడిని సూర్యభగవానుడిగా భావిస్తుంది భారతీయ సనాతన ధర్మం. ఎందరో యోగులు సూర్య రశ్మి కారణంగా వందల సంవత్సరాలు శరీరాన్ని నిలుపుకున్నట్లు గాధలు ఉన్నాయి. సూర్యుడి బంగారు కాంతికి మానవ సహస్రారంలో ఉన్న రహస్య ఆధ్యాత్మిక గ్రంథికి సంబంధం ఉండటం వల్ల సూర్యోదయ సమయంలో అధికమైన శక్తి ప్రకంపనలు ఆ ప్రదేశంలో కలుగుతాయి. భక్తి ప్రపత్తులతో సాక్షాత్ గురు స్వరూపంగా భావించి సూర్యుడికి నమస్కారం చెయ్యండి.

పుదీన 

పోషకాలు పుష్కలంగా ఉన్న  పుదీన  ఆకు క్రిములను నాశనం చేస్తుంది. మలినాలను శరీరం నుంచి బయటకు పంపుతుంది.  పుదీన  ఆకును నిత్యం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికే కాదు,  చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది. పుదీన  ఆకుల్లో సుమారు 5 వేల 480 మైక్రో గ్రాముల విటమిన్లు జిటా కెరోటిన్‌ రూపంలో వెలువడుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. పుదీన ఆకుల్లో ఉండే ఖనిజ లవణాలు.. కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్‌ సీ ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు.


వేప
శక్తి స్వరూపంగా భావించే వేప వృక్షమే దేవీ అవతారంగా కొలుస్తారు. ఎంతటి మలినమైనా ఎదుర్కొని దేహానికి రోగ నిరోధక శక్తి ని ప్రసాదించే దివ్యమైన వృక్షం వేప. అనాది కాలం నుండి వేప ఆకులతో రకరకాల మందులను అనేక వైద్య ప్రక్రియల్లో వినియోగిస్తూ ఉన్నారు. వేపకు ప్రకృతిలో ఉన్న విషతుల్యమైన గాలిని నియంత్రించగల శక్తి ఉంది. ప్రకృతి మాత ప్రసాదంగా భావించి వేప ఆకులను మరిగించి స్వీకరించండి.



‘అనుకున్నది జరుగుతుందో జరగదో అన్న బెంగను విడిచిపెట్టడం’ గురించి మరిన్ని విషయాల కోసం దీనిపై క్లిక్ చేయండి.

49 రోజుల యోగ శుద్ధి“గురించి మరిన్ని విషయాల కోసం దీనిపై క్లిక్ చేయండి

Share.

Comments are closed.