ధ్యానము,గురువు – అందరికీ అన్ని విధాల పని చేస్తుంది అన్న విషయం ఒప్పుకోలేము కారణము – అందరి ఎనర్జీ ఫీల్డ్స్ ఒకే రకంగా ఉండవు….ఆరాలు ఒకే స్థితిలో ఉండవు ఎవరికి ఏది అనుకూలమో దానినే అనుసరించాలి కానీ,ప్రకటనలను బట్టి ప్రాభావితము కాకూడదు – అన్న గొప్ప సందేశము మాధవి గారి అనుభవము నుంచి అర్థం చేసుకోగలము.
మాధవిగారికి చిన్నప్పటి నుంచీ ధ్యానము అంటే చాలా ఇష్టము అందుకే మొదట్లో ఒక మెడిటేషన్ గ్రూప్ లో చేరారు.వీరి తల్లిగారు కూడా గురువులు, భక్తి – ఈ మార్గానే ఉన్నారు కాబట్టి,అన్ని రకాల మార్గాలు, అందరు గురువులు ఉత్తములే అన్న సద్భావన సహజముగా ఉండేది…కానీ ఆ ధ్యానము వల్ల కంగారు ,భయము,టెన్షన్ పెరిగి పోయాయి..ఆరు నెలల్లో డిప్రెషన్ లోకి వెళ్లి పోయారు. డాక్టర్లకు చూపిస్తే , ముందు ఆ ధ్యానము మానెయ్యండి – అని సలహా వల్ల భయం వేసి ,పూర్తిగా ఆ మార్గం నుంచి బయటకు వచ్చేశారు.మెల్లిగా మామూలు స్థితికి వచ్చారు.ఆ తరవాత ఆరోగ్యానికి సంబంధించిన ధ్యానంలో చేరినా పూర్తిగా తృప్తి అనిపించలేదు కానీ, సుషుమ్న క్రియా యోగం లోని మహత్యం వల్ల ఒక్క సంవత్సరము ధ్యానము చేసేటప్పటికి ఫలితంగా ఆరోగ్యము,పరిస్థితులు,ఆధ్యాత్మిక ఎదుగుదల – అన్నీ బాగుపడినట్లు అనుభవమయ్యింది మాధవి గారికి.
ఈ ప్రాసెస్ లో చాలా మందితో మాట్లాడడము ,అనుభవాలు వినడము వలన కొన్ని ధ్యానాల వల్ల ఎనర్జీ సెంటర్లు దెబ్బతిని రక రకాల రోగాలకు విపరీతమైన ఆలోచనలతో ,అలజడులు జరిగి నెర్వస్ సిస్టమ్ దెబ్బతిని పోతుందని , ధ్యానం గొప్పది కదా! అని అన్ని రకాల ధ్యానాలు ప్రయత్నించకూడదు ఏ అనుభవము, అనుభూతి లేకపోయినా ఫరవాలేదు…కానీ, కొందరికి మళ్లీ తిప్పుకోలేనంత డామేజ్ జరుగుతుంది – అని కొందరి అనుభవాల వల్ల అర్థమైంది.ఆ పరిస్థితిలోకి జారిపోక ముందే అదృష్ట వశాత్తు సుషుమ్న క్రియా యోగాన్ని ఎన్నుకున్నాను అంటారు మాధవి గారు. నా అనుభవంలో గురువు అనేవారు భౌతికంగా ఎప్పుడూ మనతో ఉండాలన్న అవసరము లేదు.. గురువు మన లోపల మనతోటే ఎప్పుడూ ఉంటారు మనకు ఉండాల్సినది “గురు భావం” – ఈ సత్యాన్ని,సుషుమ్న క్రియా యోగులందరు ఆచరించవలసిన విధి అని చెప్తారు మాధవి గారు.
శృంగేరిలో ధర్మస్థల ప్రాంతంలో ఒక రామాలయంలో అమ్మగారు ధ్యాన సాధన చేయించినప్పుడు అమ్మగారి నుంచి విపరీతమైన వైబ్రేషన్స్ అనుభవిస్తున్న మాధవిగారికి కళ్లు మూతలు పడలేదు, అమ్మగారి వైబ్రేషన్ అగ్నిజ్వాల లాగా కళ్లల్లోకి వెళుతూ, శ్రీ మహావతార్ బాబాజీ గారి “ఊర్ధ్వదృష్టి” అనుభవమైంది… శరీరము స్వాధీనము తప్పి, గొప్ప ధ్యాన స్థితిలోకి వెళ్లి పోతున్నానని ఆమెకు అర్థమైంది. విజయనగరము పార్వతి గారు తట్టి లేపితే కానీ ఆ ఇంటెన్స్ ధ్యానము నుంచి “నాలో నుంచి నేను” బైటకు రాలేకపోయాను అంటారు మాధవిగారు.. ఆమెకు భౌతికమైన పేరు, వివరాలు, ఉనికి – ఇవి ఏవి గుర్తుకు రాలేదు. ఈ అద్భుతమైన అనుభవము తరవాత అమ్మగారి అనుగ్రహం వలన మరింత డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపో గలిగారు మాధవి గారు. ఒక్క రోజు కూడా ధ్యానము మానని, మానలేని ధ్యాని ఆమె.
రక్షణ, శిక్షణ, సౌభాగ్యము, ఆరోగ్యము, ఆధ్యాత్మికత కలగజేసే మెడిటేషన్ ఎన్నుకోవడము ఎంత ముఖ్యమో మాధవిగారి అనుభవాలు తెలుపుతాయి.
About Sushumna Kriya Yoga
Recent Posts
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 |
Welcome to the BLISSFUL journey