మురమళ్ల వనజ గారు ఆమె గురుభక్తి,భావము వీటితోనే ఆమె చాలా అనుభవాలు పొందిన అదృష్టవంతులు…శ్రీ ఆత్మానందమయి అమ్మగారు సాధకుల కర్మలను తీసుకుని వీలైనంత వరకు న్యూట్రలైజ్ చేసి, ఒకొక్క సారి సంకల్ప సిద్దితో వారే అనుభవించడము ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులలో వనజగారు ఒకరు.
వనజ గారు విపరీతమైన శారీరక బాధలు పడేవారు.గురువులను ప్రార్థించినప్పుడు కలలో పండిన అరటి పళ్లు అత్తం నుంచి రాలి పడడం చూసి,ధ్యానం వలన తన కర్మలు రాలిపోతున్నాయి అని తెలుసుకున్నారు…ధ్యానం మొదలు పెట్టిన కొత్తలో ,విపరీతంగా నడుము నెప్పితో తను పడుతున్న నరక యాతనకు కారణము తెలిసింది ఆమెకు.గత జన్మలో ఆమె ఒక పామును కొట్టించారు.దానికి ఆ దెబ్బ వెన్నుపైన
తగిలింది.తల కదులుతున్నా ,నడుము భాగము కదలని స్థితిలో ఆ పాము ” నువ్వు నాలాగే బాధ పడుతావు” ..అని శపించడము స్పష్టంగా తెలిసింది…కొద్ది రోజుల ధ్యానం తరువాత కొల్లిగల్ లో ఒంటరిగా ఉన్నప్పుడు భయమనిపిస్తే శ్రీ రమణుల వారి దర్శనాణుగ్రహం కలగడం ,ఆంజనేయ స్వామి పాద స్పర్శ,స్వామి మంచుకొండల్లో ముత్యాలహారంతో జపం చేయడము ,కొబ్బరికాయ రెండు సార్లు కొట్టినా ప్రతీ సారి ఒకచిప్ప ఖాళీగా ఉండటము ,ఇదేమిటని ప్రశ్నిస్తే ,ధ్యానము వలన సహము కర్మ నశించింది అని గురువులు చెప్పటము – ఇన్ని అనుభవాల వల్లే – భావము బాగా లేనప్పుడు ధ్యానము మానేస్తాను – అని చెప్పగల ధైర్యము ఆమెకు వచ్చింది.భావముతో ధ్యానము ఎంత ముఖ్యమో అమ్మగారు చెప్పిన మాటలు శిరో ధార్యాలు ఆమెకు ,ధ్యానములో శ్రీ మూకాంబికా దేవి సన్నిధిలో పుష్ప గుచ్చముతో అక్కడ ఉన్న వారి కర్మలు అమ్మగారి ద్వారా…అమ్మవారు న్యూట్రలైజ్ చెయ్యడం చూసిన అదృష్టవంతురాలు వనజగారు.
కేవలం భావము,మెడిటేషన్ – వీటితో ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు పొందగలిగారు వనజగారు