Welcome to the BLISSFUL journey

త్రిశూలం యొక్క ప్రతీకవాదం

0


త్రిశూలం, శివుని అత్యంత గుర్తింపు పొందిన చిహ్నం. త్రిశూలం అనేది భగవంతుని యొక్క శక్తివంతమైన ప్రతీక; దానిని చూసినప్పుడు, ఎవరైనా ఆదియోగి శివున్ని తలచుకుంటారు. త్రిశూలాన్ని శివునికి అంత శక్తివంతమైన చిహ్నంగా సూచించేది దాని మూడు మొనలు. దీనికి అనేక వివరణలు ఉన్నాయి.

సుషుమ్న క్రియా యోగి యొక్క దృష్టి కోణం నుండి వీటిలో కొన్నింటిని మనం అర్థం చేసుకుందాం.

జీవితం యొక్క ఉద్దేశ్యం నిజమైన ఆనందాన్ని (సత్-చిత్-ఆనంద) సాధించడమే. మనకు బాధ లేకుండా ఉంటే ఆనందం సాధ్య పడుతుంది. “షుల్” అంటే బాధ. కాబట్టి త్రిశూలం యొక్క మూడు అంచులు మూడు మూలాల నుండి వచ్చే బాధని సూచిస్తాయి. బాధ కలిగించే ఈ మూడు మూలాలు ఏమిటి?
• అధి దైవిక అంటే దైవం లేదా విధి, కనిపించని శక్తులు మరియు దేవతలకు సంబంధించినది.
• అధిభౌతిక అంటే భూతములు లేదా జీవులకు సంబంధించినది.
• ఆధ్యాత్మిక అంటే ఆత్మ లేదా శరీరానికి(మరియు మనస్సుకి ) సంబంధించినది .

త్రిశూలం బాధ యొక్క మూడు మూలాలను నాశనం చేసే ఆయుధం.

ఆదియోగి మనకు అందించిన సుషుమ్న క్రియా యోగం ఒక రకమైన త్రిశూలం – ఇది మూడు పరిధులలో బాధని అధిగమించి, దైవీక ఆనందాన్ని సాధించడంలో సహాయపడుతుంది.

ఈ కారణంగానే మన ప్రార్థనలన్నీ మూడుసార్లు “ఓం శాంతి:” అనే మంత్రం తో ముగుస్తాయి… ఈ మంత్రం మూడు స్థాయులలో – మనలోని ప్రపంచం (ఆధ్యాత్మిక), మన వెలుపల ఉన్నది (అధిభౌతిక) మరియు మనకు నియంత్రణ లేనిది మరియు మనకు తెలియనిది (ఆధిదైవిక); శాంతి పొందటానికి చేసే ప్రార్థన.

Share.

Comments are closed.