Welcome to the BLISSFUL journey

శృతి తోటకూర అనుభవాలు

0

హైదరాబాదు లోని కొంపల్లి వాస్తవ్యులు అన్నపూర్ణగా గారి కూతురు శృతి 2010 అక్టోబరు నుండి శుషున్న క్రియా యోగ ధ్యాన సాధన ఎంతో విశ్వాసంతో గురువుల పట్ల భక్తి శ్రద్ధలతో క్రమం తప్పకుండా చేస్తుంది. శుషుంన క్రియా యోగ ధ్యాన సాధనకు రాక ముందు చాలా సంవత్సరాలుగా తను డస్ట్ ఎలర్జీ వల్ల క్రానిక్ synasitis మరియు ఎలర్జిక్ డర్మ తైటిస్ తో బాధ పడేది క్రానిక్ సైనసైటిస్ వల్ల తనకు విపరీతమైన తల భారము,పోటు,నొప్పి ఉండేది.అలాగే చాలా సంవత్సరాలుగా ఈ సైనసైటిస్ తో బాధ పడడం వల్ల ఆ వ్యాధి తన కుడి చెవి వరకు పాకింది అందువల్ల తనకు చెవి నొప్పి దిబ్బడ వంటి వాటితో కూడా బాధపడుతూ ఉండేది.అలానే అప్పుడప్పుడు పంటి నొప్పి కూడా వస్తూ ఉండేది. ఎలర్జిక్ సైనసైటిస్ కి మందులు అంత పెద్దగా ఉపశమనం కలిగించవు అందులోనూ శృతిది డస్ట్ ఎలర్జీ.దుమ్ము ధూళి లేని ప్రదేశం అసాధ్యం మనకి మనం ఇల్లు చిమ్మినకూడ ధూళి రేణువులు పైకి లేగుస్తాయి అందుకే శృతి చాలా సంవత్సరాలుగా ఈ ఎలర్జిక్ సైనసైటిస్ తో బాధ పడుతూ ఉండేది.ఈ వ్యాధి ముదిరి నప్పుడు చెవి వరకు సోకి అక్కడ నుండి మెదడుకు కూడా పాజిపోవచ్చు. అలా మెదడుకు పాకినప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది. అలా చాలా ముదిరినప్పుడు ఆపరేషన్ చేయవలసి వస్తుంది కానీ ఎలర్జిక్ సైనసైటిస్ లో ఆపరేషన్ చేసినా కొద్ది కాలం మాత్రమే పేషంట్ కి ఉపశమనం కలుగుతుంది మళ్లీ నెమ్మదిగా వ్యాధి తిరగబెడుతుందు ఎందుకంటే దుమ్ము ధూళి తన చుట్టూ ఎప్పుడూ ఉంటాయి కాబట్టి.అలానే శృతికి డస్ట్ ఎలర్జీ తో పాటు ఎలర్జిక్ dermatitis అనే ఒక చర్మ రుగ్మత తో కూడా బాధ పడుతూ ఉండేది.ఈ ఎలర్జిక్ dermatitis వల్ల చర్మం దురదలు పెట్టి పొలుసులుగా,గరుకుగా మందంగా అయ్యి పగిలినట్టు కోసుకుపోయినట్టు అయ్యి చాలా బాధ పెడుతుంది ఒక్కొకపుడు గోకడం వల్లనో లేదా రాపిడి వల్లనో అంటే బట్ట రాసుకుపోయిన మరేదైనా రాపిడి కారణం వల్ల రసి లాంటిది కూడా కారినప్పుడు ఆ ప్రదేశమంతా ఇన్ ఫెక్షన్ వస్తుంది.అలానే ఎలర్జిక్ డర్మితితిస్కి కూడా అంత సులభంగా పెర్మనెంట్ క్యూర్ లేదు.మందులు లేపనాలు వాడినప్పుడు తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరిగి వస్తూ ఉంటుంది ఇంచిమించు పెర్మనెంట్ క్యూర్ లేని డస్ట్ ఎలర్జీ తో ఎన్నో సంవత్సరాలుగా బాధ పడుతున్నారు శృతి.ఒక రోజు ధ్యానంలో తన తల కుడి వైపు వెనక భాగంలో ఎవరో గట్టిగా కొట్టినటుగా అనిపించింది.తరువాత ఒక దారానికి సూది లాంటిది పెట్టుకుని ముక్కు పైభాగం నుండి గట్టిగా లాగినట్టు అయింది.ఆ తరువాత వెంటనే తన ముఖం లోని కుడి భాగం అంతా చల్లగా ఐయ్యింది.ధ్యానం నుంచి బైటికి వచ్చిన తరువాత తనకు ఆ బరువు,దిబ్బడ లాంటిది అనిపించలేదు.ఆ రోజు నుంచి మళ్లీ ఈ రోజు వరకు అంటే దగ్గర దగ్గరగా తొమ్మిది సంవత్సరాలు దాటింది.ఇప్పటివరకు ఎప్పుడూ కూడా తను మళ్లీ సైనసైటిస్ ప్రోబ్లం తో బాధ పడలేదు.తరువాత ఇదే విషయాన్ని మన గురు మాత ఐన పూజ్య శ్రీ ఆత్మా నంద మయి అమ్మగారికి విన్నవించినప్పుడు అమ్మగారు ఇలా చెప్పారు నీకు కుడివైపు తలలో ఉన్న ప్రోబ్లం క్లియర్ అయింది అని.తరువాత తన డస్ట్ ఎలర్జీ. ఒక రోజు ధ్యానంలో ఉన్నపుడు తన ఎదురుగా మూడు టాబ్లెట్స్ మన పెరసితమల్ టాబ్లెట్స్ లాగ ఉన్నాయి ఆ సైజ్ ఆ రంగు అలా ఉన్నాయి పెరసితమాల్ టాబ్లెట్స్ కావు ఆ మాదిరి కనపడే టాబ్లెట్స్ మూడు తన ముందు ఉన్నాయి.అందులో ఒక టాబ్లెట్ లోపలికి వేసుకుంది రెండు టాబ్లెట్స్ భ్రూ మద్యం నుండి లోపలికి వెళ్ళాయి.ఇది జరిగిన కరెక్ట్ గా పదిహేను రోజులకు తన ఎలర్జీ ప్రోబ్లం మొత్తం కూడా నయం ఐపోయింది.మళ్లీ ఇప్పటివరకు తను ఎప్పుడు కూడా ఈ ఎలర్జిక్ dermatitis తో బాధ పడడం అనేది జరగలేదు.నిజంగా ఎంత అదృష్టం అండి.పెర్మనెంట్ క్యూర్ లేని డస్ట్ ఎలర్జీ తో పాటు డర్మితితిస్ తో కూడా బాధ పడుతున్న శృతికి గురువులు ఎంత త్వరగా ఎంత సునాయాసంగా మొత్తం సమస్య అంతా పెర్మనెంట్ గా నయం చేశారు కదా. ఇది మన పరమ గురువులు మన గురు మాత ఐన పూజ్య శ్రీ ఆత్మానందం మయి అమ్మగారి అమితమైన ప్రేమ,వాత్సల్యము మరియు వారు కురిపిస్తున్న అద్భుతమైన ఎనర్జీస్ ఫలితమే కదండీ.

Share.

Comments are closed.