Welcome to the BLISSFUL journey

సాకినేటి సుష్మి అనుభవాలు

0

సుబ్బలక్ష్మి గారి అమ్మాయి.
సుబ్బలక్ష్మిగారి వంటి సుషుమ్న ధ్యాన యోగి గారి కుమార్తె అయిన సుష్మిగారు తన 8వ క్లాసు నుంచే సుషుమ్న క్రియా యోగ ధ్యానం చేసేవారు.ఆమెకు చదువు అంటే చాలా ఇష్టం ఎప్పుడూ క్లాసులో ముందంజలో ఉండే ఆమెకి తన మీద తనకు నమ్మకము, ఏదైనా సాధించగలనన్న పట్టుదల ఉండేది.12వ క్లాస్ తరవాత తను ఏమి, ఎలా చదువుకోవాలో అన్న సూచనలు కూడా ధ్యానంలో గురువు నుండే వచ్చాయి కాబట్టి, ఆమె గురువు పట్ల విపరీతమైన కృతజ్ఞతా భావం పెంచుకున్నారు.
సుష్మిగారు బి.టెక్ చదువుతూ ఉండగా కేవలం 2,3 మార్కులతో ఫెయిల్ అయ్యారు.ఇది ఆవిడ నమ్మకం మీద పెద్ద దెబ్బ కొట్టింది.తను 12 వ క్లాసు చదువుతుండగా హస్త సాముద్రిక శాస్త్రం చదువుకున్న స్నేహితురాలు ఒకామే నీ చదువు మధ్యలో ఆగిపోతుంది నీ రేఖలు అవే చెప్తున్నాయి అని చెప్పడం గుర్తుకొచ్చింది.ఈ విషయం వారి అమ్మగారు సుబ్బలక్ష్మి గారితో చెప్పినపుడు అవును నీ జాతకంలో చదువు మధ్యలో ఆగిపోతుంది అని ఉన్నదని నాకు కూడా ఎవరో హెచ్చరించారు అని చెప్పారు.అయినా నువ్వు నీ ప్రయత్నం మానకు అని కూడా చెప్పారు.సుష్మిగారికి అపుడు గురుమాత శ్రీ ఆత్మానందమయి అమ్మగారి మాటలు జ్ఞాపకానికి వచ్చాయి – సుషుమ్న క్రియా యోగ ధ్యానం చేయటం వల్ల కర్మలు దగ్ధం అయి, గ్రహ ప్రభావం కూడా తగ్గిపోతుంది అని, అందువల్లనేమో ఆగిపోవల్సిన చదువు ఒకసారి ఫెయిల్ అయి వదిలేసింది అన్న మనో ధైర్యంతో చదువు ఆపలేదు సుష్మిగారు.ఆ తరవాత చెప్పుకోదగ్గ విజయాలతో కొద్ది సంవత్సరాలు అమెరికాలో సాఫ్టు వేర్ ఇంజనీరుగా పని చేసి, ఇపుడు ఇండియాలో మంచి ఉద్యోగంలో స్థిర పడ్డారు.చదువు అంటే ఇష్టం ఉండే ఆమెకి ఇంత తృప్తికరమైన జీవితానికి పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారి అనుగ్రహమే కారణం అంటారు.
వారింట్లో ప్రతి రోజూ సత్సంగం జరుగుతుంది ఒకరోజు ధ్యానంలో ఆమెకి అందమైన అద్భుతమైన కృష్ణ విగ్రహం దర్శనమిచ్చింది ఆ పక్కనే రెండు బంగారు పాదాలు కూడా దర్శనమిచ్చాయి అవి శ్రీకృష్ణుల వారి పాదాలే అనుకున్నారు సుష్మి కానీ, ఈ విషయం అమ్మగారికి చెప్పినప్పుడు అవి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పాదాలు అని సూచించగానే పులకించిపోయారు సుష్మి.
ఒకసారి సుష్మిగారి భర్తకు వీసా రాదేమో అని చాలా టెన్షన్ పడుతూ ఉండగా సుష్మిగారు సూచన మీద 21 నిమిషాలు మెడిటేషన్ చేయగానే మరుసటి రోజు వీసా రెడీ అన్న విషయం తెలిసింది.ఆశ్చర్యపోయి ఆనందపడ్డ సుష్మిగారి భర్త ఆ నాటి నుంచి మంచి మెడిటేటర్ అయ్యారు.
సంకల్ప మాత్రాన అవసరాలు సిద్ధింప చేస్తుంది ఈ సుషుమ్న క్రియా యోగ ధ్యానం. అంతా గురువుల అనుగ్రహం అంటారు సుష్మి.

Share.

Comments are closed.