Welcome to the BLISSFUL journey

రాధ దంతులూరి అనుభవాలు

0

శ్రీ ఆత్మానందమయి అమ్మగారి ఆశీర్వచనము పొందిన రాధగారి అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి.
రాధగారి తల్లి తండ్రి ఇద్దరూ క్రియా యోగులే. వీరి తల్లి పార్వతిగారు అమ్మగారి సన్నిహితులు అవడం వలన చిన్నతనము నుంచీ అమ్మగారు పరిచయమే రాధగారికి,పార్వతిగారు అమ్మగారికి ఫోన్ చేయమన్నప్పుడు అమ్మగారు”హల్లో” అనడము విని తల్లికి ఫోన్ ఇచ్చేవారు రాధగారు.అమ్మగారు హల్లో అన్నపుడు ఎదో మాగ్నెటిక్ పుల్ లాగా అనిపించేది రాధ గారికి.షిరిడీ సాయి బాబాగారితో కనెక్ట్ అయిన రాధగారు ,మొదటి సారి అమ్మగారిని కలిసినప్పుడు “రాధా!మనము ఒక గంట ధ్యానము చేద్దాము” – అనగానే కొంచము ఉలిక్కిపడ్డారు.కారణం ,అమ్మగారితో ఒక గంట కూర్చుని ధ్యానము చెయ్యగలనా,ఒకవేళ చెయ్యలేకపోతే గురు ధిక్కారమౌతుందేమోనని బాబాగారిని ప్రార్థించారు.బాబా గారు నవ్వి ” ఒక పని చెయ్యి పడుకో”అన్నారు.ఒక గంట తరవాత లేచిన రాధగారికి ఒళ్ళంతా కరెంట్ పాస్ అయినట్లు చాలా ఎనర్జీ వచ్చినట్లు అనిపించింది.ఆ సాయంత్రము మరొక గంట మెడిటేషన్ తో నేను ఈ ప్రక్రియకు అలవాటు పడ్డాను అంటారు రాధగారు.రాధగారి తల్లి తండ్రుల ప్రోత్సాహము చాలా ఉన్నది రాధగారికి – ఆమెతో మాట్లాడేటపుడు వారి మాటల్లో ధ్యానము గురించిన హెచ్చరికలు,అనుభవాలు,ఆనందాలు – ఇవే ఎక్కువ.ధ్యానము చేయటం ప్రారంభించినప్పటి నుంచీ ఆమెకు అనేక స్వప్నానుభవాలు , దృష్యానుభూతులు అనుభవమయ్యేవి.ఒక రోజు తన పుట్టుక ముందు ఒక దివ్య కాంతి వచ్చి,తన మాతృమూర్తి పార్వతిగారి గర్భస్తమయినట్లు ,ఆ సమయంలో తెలుపు వర్ణం కలిగిన ఒక ఎనర్జీ బాడీ పార్వతిగారి గర్భంలో ప్రవేశించినట్లు ఆ తరవాత రక రకాల మార్పులు,అక్కడ గురువులందరూ ఉన్నట్లు తెలిసింది రాధగారికి.ఆ తరవాతే తను శిశువుగా రూపు దాల్చినట్లు కనబడింది.తల్లిగారిని అడిగితే అవును….ఆ అనుభవం తరవాతే నువ్వు జన్మించావు అని చెప్పారు పార్వతిగారు.ఈ జన్మలో మెడిటేషన్ మొదలైన వాటి గురించి సీరియస్ గా ఆలోచించకపోయినా ,తను ఇంతటి స్థాయిలో మెడిటేషన్ లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో అర్థమైంది రాధ గారికి.ఒకప్పుడు చిన్న తనంలో అమ్మగారి ముఖము మర్చిపోయినట్లు అనిపించగానే ,ఆ రాత్రి కలలో అమ్మగారు కనబడి,ఇప్పుడు నా ముఖము గుర్తుంటుందా?! “I wont leave my students even if they forgot me” అన్నారు అమ్మగారు.ఈ అమృత వాక్కులు రాధ గారికే కాదు ప్రతి సుషుమ్న క్రియా యోగికి అమ్మగారు వెన్ను నిమిరినంత ఆనందము,జలదరింపు కలిగిస్తాయి.
ఒకరోజు గాలి వాన వస్తూ ఉంటే,అమ్మగారి ఇంట్లో ఉన్న రాధగారు తలుపులు మూద్ధామని పరిగెత్తారు..అప్పుడు కిటికీలోనించి వెలుతురు ఒక బాల్ లాగా లోపలికి ప్రవేశించింది.అన్ని కిటికీలు,తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి.ఆమె నిలుచున్న స్థలంలో కాస్మిక్ ఎనర్జీఫీల్డ్ అట అది ఆమె కాలు కింద బంతిలా రెండు అంగుళాల ఎత్తున నిలబెట్టింది అంటే ఆమె పాదాలు భూమి మీద ఆనడము లేదు.ఆ అనుభవము చాలా బౌన్సీ బౌన్సీగా అనిపించి ప్రతి రూములోనూ చిన్న పాపలాగా తిరిగారు ఆమె.ఇంతకీ తను చూసిన ఆ అధ్బుతమైన వెలుతురు కాస్మిక్ ఎనర్జీగా మాస్టర్ సి.వి.వి గారు లోపలికి ప్రవేశించారు.
అరకులో అమ్మగారితో గ్రూప్ మెడిటేషన్ లో రకరకాల రూపాలు,జాతుల వారి ముఖాలు కనబడినప్పుడు – అవి అన్నీ ఆమె గత 100 జన్మల రూపాలు ఫాస్టుగా జూమ్ ఇన్ అయి,చాలా త్వర త్వరగా ముందుకు వెనక్కు కనబడి దర్శనమిచ్చాయి – అని వివరించారు అమ్మగారు.
బెంగుళూరులో ధ్యానం క్లాసులు చెప్పి వచ్చి తెలుపు డ్రస్ మార్చుకుని నిద్రపోయారు రాధ గారు,పక్కనే నైట్ వర్క్ చేసుకుంటున్న వారి భర్త ఆమెలో నుంచి కాంతి శరీరము తెలుపు డ్రస్ తో నడుచుకుంటూ గొడలోనుంచి బైటకు వెళ్లిపోవడము చూసి నిర్ఘాంతపోయారట – అది ఆత్మ స్పిరిట్యువల్ జర్నీకి వెళ్ళడం అని అమ్మగారు వివరించారు.2012 లో థైరాయిడ్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అమ్మగారికి తెలియచేయవద్దు ,మన బాధ తీసుకుని వారు అనుభవిస్తారు అని ఎవ్వరూ అమ్మగారికి చెప్పొద్దూ అన్నారట రాధ గారు. కానీ సరిగ్గా సర్జరీకి వెళుతుండగా అమ్మగారు ఫోన్ చేసి నేను రాధతో మాట్లాడాలి అనగానే ,రాధగారి తల్లి పార్వతి గారు సర్జరీ జరుగుతోంది అమ్మగారు మీకు చెప్పొద్దు అన్నది రాధ అన్నారట.అమ్మగారు ఎంత గొప్ప శక్తివంతమైన ఎనర్జీ పంపారు అంటే ఆ బాధ యాతన ఏ కొద్దిగానో మాత్రము ఉండి,ఎనర్జీ సముద్రంలో తేలిపోతున్నట్లు అనిపించిందట రాధగారికి. ఒకరోజు బాల్కనీలో ఉండి ఫోన్ మాట్లాడుతున్న రాధగారికి వెనక్కి తిరగ్గానే తన వెనకాల కొద్ది దూరంలో ఒక ఆజానుబాహుడైన దివ్యమూర్తి నిలబడి ఉన్నట్లు కనబడ్డారు, భయపడి వెంటనే ముందుకు తిరిగిపోయారుట.ఆ తరవాత ఆ దివ్యమూర్తి విశ్వ గురువుల్లో ఒకరైన జీసస్ క్రైస్ట్ గారని అమ్మగారు చెప్పినప్పుడు ,అయ్యో! అంత అధ్బుతమైన గురుదర్శనము అయితే సరిగా గౌరవము ,మర్యాద చెయ్యలేకపోయానని బాధపడ్డారు రాధగారు.అట్లాగే హాయిగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండే Happy go lucky person అయిన రాధగారు తను డిప్రెషన్ లో ఉన్నానన్న గ్రహింపు కూడా లేకపోయినా ,ఆ స్థితి కూడా దాటగలిగారు ఆమె.రాధగారి మృత్యువును ఎదుర్కొనే శక్తి ఆశ్చర్యంగా వచ్చింది…”నువ్వు కాసేపట్లో చనిపోతావు”..అని ఎవరో చెప్పినట్లుగా అనిపించింది – అయ్యో! అమ్మా నాన్న ప్రేమకు ఋణం తీర్చుకోకుండానే …అని బాధ పడుతూ ఉండగా హృదయ చక్రం నుంచి ఒక వెలుతురు మరొక వెలుతురుతో కలిసి పోయినట్లున్నది ..కానీ అమ్మగారు చెప్పినట్లు హృదయచక్రం నుంచి ప్రాణము పోతె పునర్జన్మ ఉంటుంది.అదే ఆజ్ఞాచక్రం నుంచి కానీ,సహస్రారచక్రం నుంచి కానీ ప్రాణోత్క్రమణ జరిగితే పునర్జన్మ ఉండదు అని చెప్పడము గుర్తుకు వచ్చింది.నా తపన గురుదేవులకు వినబడిందేమో ఫోన్ కాల్ వచ్చి ..ఆ మృత్యుఛాయ నుంచి రాధగారు బైటకు వచ్చేశారు…
రాధగారికి బుద్ధ భగవానుల బొమ్మలు,ఆరామాలు ఇవంటే చాలా ఇష్టము. ఎందుకనో అది సేకరించడమంటే చాలా జిజ్ఞాస …మనకు పూర్వ జన్మ వాసనలు ఎప్పుడూ ఉంటాయి..ఒక రోజు విజన్ లో ఒక పెద్ద కొండ చరియ,దాని గుహ తలుపు తెరుచుకుని చాలా మంది బుద్ధ దేవుని శిష్యులు కాషాయాంబరాలు , ముండిత శిరస్కులు,చేతిలో భిక్షా పాత్రతో ఎదో జప ఉచ్చారణ చేస్తూ వెళ్ళడము ,అదే బౌద్ధ ఆరామములో ముండిత శిరస్సుతో,పెద్ద నేత్రాలతో , విశాలమైన నుదురుతో ఒక రాయి పైన ధ్యానంలో ఉన్న తనను తాను చూసుకున్నారు రాధ గారు.
ఈ మధ్యనే times of India సెంటర్లో మెడిటేషన్ చేస్తూ ఉంటే రాధ గారికి ఉన్నట్లుండి ఒక మెసేజ్ వచ్చింది.
అమ్మగారు నీకు చాలా బాధ్యతగల పని పెట్టారు. మరి అది సరిగ్గా నిర్వర్తించడానికి నీ లోపల ఉండే ప్రేమ సరిపోతుందా ?!అని ఎవరో ప్రశ్నించారు…విని ఆశ్చర్య పోయిన రాధ గారికి thought processలోనే ఏమి చెబుతున్నారో అర్థమైంది.అమ్మగారు తనకు ఇచ్చిన బాధ్యతలో ప్రతి ఒక్కరితో ప్రేమగా,ఆప్యాయతతో ఉంటూ, ఏ మాత్రము పక్ష పాతము ,విమర్శ లేకుండా అందర్నీ సమానంగా ప్రేమించాలి..అంతే కాకుండా ఆమెను చూడగానే ఆమె నుంచి ప్రవహించే ప్రేమ తరంగాలు అందరినీ స్ప్రుజించాలి … అలా జరగాలి అంటే ఆమె ఎనర్జీ బాడీ expand అయి ..మరింత ప్రేమ తత్వాన్ని ఆమెలో ఇముడ్చుకోవాలి అని,ఇది అర్థమైన రాధ గారు అమ్మగారికి ఈ మెసేజ్ చెప్పగానే అమ్మగారు “నిజమేరా” అని గురువుల మెసేజ్ అంత చక్కగా అర్థం చేసుకుని , అలా తయారవడానికి సిద్ధ పడిన రాధగారిని చూసి సంతోష పడ్డారు.

రాధ గారి ఈ అనుభవాలు విన్న తరువాత మనకు ఒక విషయం అర్థమవుతుంది.”she is one of the choosen few”…ప్రాపంచికత వల్ల తనలోని శక్తి తానుగా ఆమె గ్రహించలేకపోయినా ,ఆమె “చేతనా శక్తి “క్రమశిక్షణా,పని పట్ల ఉండే శ్రద్ధ,అమ్మగారి మాటను తూ చ తప్పకుండా పాటించే క్రియా శక్తి ,చేస్తున్న పని పట్ల ఏకాగ్రత, అమ్మగారి మనసులో మాట చెప్పకుండానే గ్రహించగలిగే గ్రాహక శక్తి ఇవన్నీ కలబోసిన వ్యక్తి రాధగారు.ప్రాపంచికతతో చూస్తే కనబడే వ్యక్తులు వేరు ,వారు ఆస్ట్రల్ బాడీతో గురు అనుగ్రహంతో వారి ఆజ్ఞ పట్ల పూర్తి సరెండర్ తో చేసే వర్క్ వేరు…అది సామాన్యులకు గ్రాహ్యం కాదు.
రాధగారు సుషుమ్న క్రియా యోగ వర్క్ కోసం ఎన్నుకోబడిన ఉన్నతాత్మ.

Share.

Comments are closed.