బలీయమైన ప్రారబ్ధకర్మను గురువు తప్పించారు అన్న కృతజ్ఞత సహజము. కానీ తన గురువు మనకోసం హిమాలయ గురువులు పంపించిన “పరమయోగిని” అని తెలిస్తే?! ఇంతకన్న అద్భుతమైన కృతజ్ఞతాపూర్వక అనుబంధము ఏముంటుంది?!
ప్రమీల గారు 2011లో అమ్మగారి ద్వారా సుషుమ్న క్రియా యోగ దీక్ష తీసుకున్నారు. ఆమె పూర్వజన్మ పుణ్యం వలన ధ్యానము అద్భుతంగా జరిగేది. యోగ ధ్యాన ముద్రలో అమ్మగారు దర్శనం ఇచ్చేవారు. స్వప్నంలో ఒక స్వామీజీ దర్శనమిచ్చి సుషుమ్న క్రియా యోగము చాలా అద్భుతమైనది శ్రద్ధగా చేస్తే మోక్షానికి దారి చూపిస్తుంది అని ఆశీర్వదించారు.
సుషుమ్న క్రియా యోగ దీక్ష తీసుకోకముందు గోముఖం దర్శించిన ప్రమీలగారికి అక్కడ చెట్టు కింద ఒక మహాయోగిని తపస్సు చేసుకుంటున్నారు దర్శించుకోమని ఎవరో చెప్పారు.కానీ వారి దర్శనం జరగలేదు.
శృంగేరి గురుపౌర్ణమి – అమ్మగారి సన్నిధి, సాక్షాత్ శంకరభగవత్పాదులు నడయాడిన భూమి అది అన్న ఆనందంలో
ధ్యానం నుంచి యోగనిద్రకు ఒరిగిపోయారు.స్వప్నంలో మళ్లీ గోముఖం వెళ్లారు గంగ “ఓం”కార శబ్దంతో ప్రవహిస్తోంది.అప్పుడే గుహనుంచి బయటకు వస్తున్న తేజోమయమూర్తిని తాను దర్శించ దలుచుకున్న తపస్విని గురించి అడగగానే – “నేను చూపిస్తాను రా” అని చాలా విశాలమైన చెట్టు తొఱ్ఱలో ధ్యానముద్రలో వున్న మహాయోగినిని చూపించారు. నమస్కరిస్తూ పరికిస్తే ఆమె శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మ,
స్వామీ!… నేను ఈ అమ్మ దగ్గరే దీక్ష తీసుకున్నాను అని ఆనందంగా చెప్పారు.అమ్మగారు నవ్వుతూ వారు ఎవరో తెలుసా సాక్షాత్ మహావతార్ బాబాజీ గారు అన్నారు ప్రమీలగారి ఆనందానికి అవధులు లేవు.తరువాత తెలిసిన నిజం ఏమిటంటే అమ్మగారు ఒక జన్మలో అదే చెట్టు తొఱ్ఱలో ధ్యానం చేశారట అలనాటి ఆ దృశ్యాన్ని బాబాజీగారు ఆవిడకి చూపించారు.
మరొకసారి ట్రైన్ లో అమ్మగారిని హైద్రబాద్ లో దర్శించాలని బయలుదేరిన ప్రమీలగారికి రిజర్వేషన్ లేదు… ఎదురు సీటులో ఉన్న “ఆమె”నవ్వుతూ,నా బర్త్ ను మీరు వాడుకోండి ,నాకు పక్క కంపార్ట్మెంట్లో బర్త్ ఉందని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమె అమ్మగారే అని తెలిసి ఆమె ఆనంద భాష్పాలతో పులకించిపోయారు. మరొకమారు హైద్రాబాద్ వస్తుంటే కంపార్ట్మెంట్ ఎక్కుతూ కాలుజారి పడిపోయారు.ట్రైన్ కదిలితే ప్రమాదం….పర్సు కళ్ళజోడు తలొక పక్కకు పడిపోయాయి.. ఆమె “అమ్మా”అని అమ్మగారిని తలుచుకుని ఆర్తనాదం చేశారు… ఎవరో ఆమెను గభాలున రెక్క పట్టుకుని లేపి బ్యాగ్ భుజాన తగిలించి, కళ్ళజోడు పెట్టారు. ఎరుపు అంచు తెల్లచీరతో సాక్షాత్ అమ్మగారే స్వయంగా వచ్చి రక్షించి ట్రైన్ ఎక్కించారు. ఆ దృశ్యం జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా ఆనందంతో కృతజ్ఞతతో పులకించిపోతారు ప్రమీలగారు.
ఆర్తత్రాణ పరాయణత్వం అసలు ,సిసలైన గురువు సద్గుణం…కానీ శిష్యులకు వారితో కనెక్టివిటీ ఉండాలి .సూక్ష్మ దర్శనం తోనే కాదు స్థూలంగా కూడా అమ్మ కనపడి తన శిష్యులందరినీ రక్షణ వలయంలో ఉంచి కాపాడుతారు.ఈ విషయం ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా సుషుమ్న క్రియా యోగ లందరికీ అనుభవమవుతుంది.
About Sushumna Kriya Yoga
Welcome to the BLISSFUL journey