సాధారణంగా మెడిటేషన్ చెయ్యడం వలన ,గురువు సాన్నిధ్యం వలన మన కష్ఠాలు మ్యాజిక్ చేసినట్లు ఎగిరిపోతాయి,గురువు కామధేనువు,కల్పవృక్షము అయిపోతారు – అన్న భ్రమలో చాలా మంది ఏ యోగాన్ని అయినా ప్రారంభించి వాళ్లు భ్రమించినవి జరగకపోతే …యోగం నుంచి బైటకు వెళ్లిపోతారు…ఏ యోగమైనా ముఖ్యంగా సుషుమ్న క్రియా యోగం మన కష్ఠాలను మ్యాజిక్ తో మాయం చెయ్యదు..మన కర్మలను ధ్వంసం చేస్తూ,అనుభవించక తప్పని వాటిని ఎదుర్కునే మన స్థైర్యం ఇస్తూ ,ఆ దుఃఖ భాజనమైన “మలుపు”ను అతి జాగ్రత్తగా,మానసిక స్థైర్యాన్ని పోగొట్టుకోనీయకుండ దాటిస్తుంది.
వివిధ రకాల సమస్యలు , నష్ఠాల సుడిగుండంలో ఎండుటాకులాగా కొట్టుకుపోతున్న నన్ను ఒడిసిపట్టుకుని… “గురుమాత దగ్గరకు తీసుకుని సేదతీర్చారు” అనే ప్రభాకర్ గారికి ఎంత ఎదుగుదల అమ్మ గారు కలిగించారు? అది తెలుసుకోగలిగిన అతనిని అభినందించాలి అనిపిస్తుంది.అది తెలుసుకోవాలంటే చాలా సాధన ,జ్ఞానం కావాలి …”ఒక జననం పుట్టినపుడు జరిగితే మరొక జననం గురువు సాంగత్యం వలన జరుగుతుంది” అన్న మార్పును గుర్తించగల జ్ఞానం కలగడం చాలా కష్టమైన విషయం.
వారి భార్య హరిప్రియ గారి ద్వారా ఈ సుషుమ్న క్రియా యోగంలోకి వచ్చిన ప్రభాకర్ గారు మొట్ట మొదటి ఇనిషియేషన్ లోనే ” ప్రేమ మయ సంగీతం , మాతృ మూర్తి లాలన అనుభవించగలిగారు”.మొదటి దర్శనంలోనే ఎంతో మంది గురువులను అడిగినట్లు మిమ్మల్ని అడగను.నన్ను నేను సమర్పించుకుంటున్నాను అన్న ప్రభాకర్ గారికి “తథాస్తు” అన్న అనాహత ఆశీస్సు వినబడింది.2013 నవంబరు నుంచి సుషుమ్న క్రియా యోగం ప్రారంభించిన వీరు – ఎందుకు మా కుటుంబం ఎంత కష్టపడ్డా కష్ఠాలు, నష్ఠాలులో ఉండిపోతుంది?! అని బాధ పడినప్పుడు – మూడు తరాల క్రితము ఒక ఆరుమందిని వీరి కుటుంబ పెద్దలు సజీవ దహనం చేయించిన కర్మ ఫలితం – వీరందరూ అనుభవిస్తున్నారు – అని అమ్మగారు శలవిచ్చినప్పుడు అవాక్కు అయిపోయారు ప్రభాకర్ గారు..మరి నా వ్యక్తిగత కష్టాలు , నష్టాలు ఇంత భరింపలేనివిగా ఎందుకు వస్తున్నాయి అమ్మా?! అని అడిగితే ,అందరూ ఆ జన్మకు సరిపడ్డ కర్మలు పూర్తి చెయ్యడానికి భూమి మీదకు వస్తే, మీరు 3 జన్మల కర్మలు అడిగి మరీ తెచ్చుకున్నారు – కానీ, తీసుకున్న ఆ బాధ్యతను ఈ జన్మలోనే పూర్తి చేస్తారు – అని ఆశీర్వదించారు….ఒక పరిస్థితిలో “3 గంటలు ధ్యానం చెయ్యండి” అని ఆదేశమిస్తే ,అమ్మో ఒక గంటే ఎంత కష్టం?! అని విలవిల లాడిపోయారు.కానీ , సంకల్పం,ఆశీస్సు రెండింటి వలన 14 నెలలు చెయ్యగలిగారు…. ఏ నష్ఠాలు ఆగలేదు…. కళ్ల ఎదురుగా చాలా ఖరీదైన కారు తగలబడి పోవడం లాంటి భయంకరమైన భాదలను అనుభవించారు…మరి సుషుమ్న క్రియా యోగం వలన ఏమి జరిగింది?!అన్న ప్రశ్నకు వాటన్నింటిలో “నేనే ,నావే” అన్న అమాయకపు మూర్ఖ బాధతో కుంగిపోకుండా…ప్రేక్షకత్వాన్ని ప్రసాదించి … నష్ఠాన్ని, కష్ఠాన్ని,దుఃఖాన్ని ఇవన్నీ నేను కోరి తెచ్చుకున్నాను …అనుభవించి పూర్తి చేస్తాను…అమ్మ దయ ఉన్నదిగా అన్న మనః పరిపక్వత వచ్చింది.
అసలు రావలసినది ,కావలసినది ప్రభాకర్ గారికి జరిగినది…వీరి అనుభవాలు ప్రతి సుషుమ్న క్రియా యోగి తెలుసుకోవల్సిన ,మననం చెయ్యవలసిన విషయాలు… ఏ కష్టం వచ్చినా ఒక్కసారి చదువుకుని స్థైర్యం తెచ్చుకునే అనుభవాలు మన సుషుమ్న క్రియా యోగి ప్రభాకర్ గారివి.
About Sushumna Kriya Yoga
Recent Posts
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 |
Welcome to the BLISSFUL journey