Welcome to the BLISSFUL journey

 ఏమైనా జరుగుతుందేమో అన్న భయాన్ని తొలగించటం నాలుగవ సూత్రం

0

ఏమైనా జరుగుతుందేమో అన్న భయాన్ని తొలగించటం అన్నది ఆచరించటం……
మానసిక శుద్ధిలో భాగంగా సంక్లిష్ట పరిస్థితులను అధిగమించటంతో పాటు సత్యాన్ని నిర్భయంగా ఎదుర్కొనే నిబ్బరమైన మనసును ఏర్పరుచుకోవాలి. ఎన్నో సార్లు నిజాన్ని నిర్భయంగా ఎదుర్కోలేని పరిస్థితుల్లోకి వెళిపోతుంటాం. ఒక విషయాన్ని జరగకూడదు అని భయపడటం అంటే సత్యానికి దూరంగా మనం పారిపోవటం. ప్రకృతి ధర్మాలకు తలవంచటమే మానవ జన్మ పరమార్ధం. అహంకారం వల్ల మనిషి అంతా తానే అన్న భావనలో ఉంటాడు. ఈ విశ్వంలో నేను కేవలం ఒక రేణువును మాత్రమే అన్న అవగాహన కలిగినప్పుడు, నాది, నేను, అన్న భావన నుండి మనిషి బయటకు రాగలిగితే ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి సమున్నత స్థానాన్ని అధిరోహించినట్లు.

ఒక పర్షియా రాజుగారు తమ అంగుళీకం మీద “ ఇది సైతం వెడలి పోనీ” అన్న అక్షరాలను లిఖియింప చేసుకున్నారట.జీవితం అంటేనే ఒక ప్రయాణం.
ఈ ప్రయాణంలో ఏది శాశ్వతం కాదు అన్న అవగాహన రావాలి

మానసిక శుద్ధిలో ఆఖరుగా
జరగకూడనిది ఏమైనా జరుగుతుందేమో అన్న బెంగను వీడి, ఆ భయాన్ని తొలగించుకొని, అసలు ఎందుకు భయం? ఎందుకు దుఃఖం? ఏది సత్యం? ఏది నిత్యం?
మాయ ద్వారా కలిగిన భ్రాంతి నా మనసును వికలం చేస్తుందేమో!!! అనవసరంగా నేను తపన పడుతున్నానేమో….!! ఇక పై అనుమానం వద్దు..
నా అంతరాత్మలో దాగి ఉన్న అనంత శక్తిని నేను మేల్కొలపాలి. అని దృఢమైన సంకల్పం చేసుకొని సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధనతో భయ రహితమైన, భ్రాంతి రహితమైన, నవ్యమైన, దివ్యమైన, భవ్యమైన జీవనానికి శ్రీకారం చుట్టండి.
గురు పౌర్ణమికి ఆరు రోజుల ముందు ఈ అద్భుతమైన పరివర్తన విచారణ ద్వారా మీ జీవితంలోకి ఆహ్వానించి చూడండి. జీవన గమనం సుగమం అవుతుంది.
విజయోస్తు…!!!

Share.

Comments are closed.