Welcome to the BLISSFUL journey

మార్గశీర్ష మాసం

0

పవిత్రమైన కార్తీక మాసం నుండి మనం తదుపరి పవిత్ర మాసమైన మార్గశిర మాసం గురించి తెలుసుకుందాం.

మార్గశీర్ష మాసం అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల మరియు హిందూ గ్రంధాల ప్రకారం ఈ నెల నిబద్ధత సమయంగా భావించబడుతుంది. ఈ నెలను ‘మగ్సర్’ ‘అగహన్’ లేదా ‘అగ్రహయన్’ అని కూడా పిలుస్తారు.

హిందూ గ్రంధాల ప్రకారం ఈ మార్గశిర మాసం సేవా కార్యక్రమాలు చేయడానికి, మతపరమైన కార్యకలాపాల నిర్వహణకు మరియు దేవి ,దేవతలను  ఆరాధించడానికి ప్రాముఖ్యమైనది. ఈ మాసంలో అనేక పండుగలు మరియు వేడుకలు ఉంటాయి. ఇది మానవులకు మాత్రమే కాకుండా దేవతలకు కూడా దైవిక మాసంగా పరిగణింపబడుతుంది.  ఈ మార్గశిర మాసం నుండే సత్య యుగం ప్రారంభమైందని కూడా నమ్ముతారు.

శ్రీమద్ భగవద్గీతలో, శ్రీకృష్ణుడు స్వయంగా “నేను మార్గశీర్ష మాసం” అని  తెలిపారు.

పౌర్ణమి రోజు మరియు సమయం

మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి రోజును /పూర్ణ చంద్రుడిని కలిగిన రోజుని మార్గశీర్ష పౌర్ణమి అంటారు. ఇది డిసెంబర్ 18న ఉదయం 7.24 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 19న ఉదయం 10.05 గంటలకు ముగుస్తుంది.

ఈ మార్గశిర పౌర్ణమిని బట్టిసి పౌర్ణమి లేదా కోరల పౌర్ణమి, మార్గశీర్ష పూనమ్, నరక పౌర్ణమి లేదా ఉద్యతిథి పౌర్ణమి అని కూడా సూచిస్తారు. ఈ  పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతి మరియు అన్నపూర్ణ జయంతిని కూడా జరుపుకుంటారు.

మార్గశీర్ష పౌర్ణమి యొక్క మతపరమైన ప్రాముఖ్యత
ఆధ్యాత్మిక అన్వేషకులు చంద్ర దేవుణ్ణి పూజిస్తారు, ఎందుకంటే ఈ రోజున చంద్రుడు ‘అమృతం’ (అమరత్వం కోసం అమృతం)తో గౌరవించబడ్డారని విశ్వసిస్తారు.

మత విశ్వాసాల ప్రకారం, శరీరంపై తులసి వేర్ల (తులసి) మట్టిని (మిట్టి) పూసుకుని పవిత్ర నది, సరస్సు లేదా చెరువులో స్నానం చేయడం ద్వారా, ఆ వ్యక్తి విష్ణువు ఆశీర్వాదం పొందుతాడు అని భావిస్తారు.  హరిద్వార్, బనారస్, మధుర మరియు ప్రయాగ్‌రాజ్ వంటి పవిత్ర నదులలో వేలాది మంది భక్తులు స్నానం చేసి తపస్సు చేస్తారు. ఈ రోజున దానం చేయడం వలన ఇతర పౌర్ణముల ఫలితాల కంటే 32 మార్లు ఎక్కువ పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. అందుకే దీనిని బట్టిసి పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పవిత్ర మైన మార్గశిర పౌర్ణమి రోజున , సత్యనారయణుడిని ఆరాధించడంతోపాటు సత్యనారాయణ కథను వినడం వల్ల అధిక పుణ్యఫలం లభిస్తుంది. మార్గశీర్ష పౌర్ణమి నాడు పేదలకు దానం మరియు అన్నదానం చేయడం వలన శ్రీ మహా విష్ణువు ప్రసన్నులవుతారు . ఈ రోజున ధ్యానం చేయడం కూడా చాలా ప్రయోజనకరం.

దత్తాత్రేయ జయంతి

హిందువుల ఆరాధ్యదైవమైన దత్తాత్రేయుని జన్మదినోత్సవమే ఈ దత్తాత్రేయ జయంతి.  హిందువుల చాంద్రమాన మాసమైన మార్గశీర్ష పౌర్ణమి రోజున అవతరించిన శ్రీ దత్త జన్మదినాన్ని దత్త జయంతిగా జరుపుకుంటారు. దత్తాత్రేయ స్వామిని అవధూత , దిగంబర మరియు త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వర) స్వరూపమే దత్తాత్రేయుని అవతారం అని పిలుస్తారు. మార్గశీర్ష పౌర్ణమి నాడు, దత్తాత్రేయుడు దుష్ట శక్తులను సంహరించడానికి భూమిపై అవతరించాడని విశ్వసిస్తారు.

దత్తాత్రేయుడు మూడు శిరస్సులు కలిగిన అవతార మూర్తి. ఈ మూడు శిరస్సులు శాంతి మరియు ప్రశాంతతకు సంకేతాలు.

ఈ మూడు శిరస్సులను బ్రహ్మ, విష్ణు , మహేశ్వరులకు ప్రతీకగా పరిగణిస్తారు. దత్తాత్రేయుడు త్రిగుణాలైన సత్వ , రజ, తమో గుణాలను అధిగమించే సంపూర్ణ గురువు యొక్క ఉత్కృష్ట శక్తి . అందువలన, దత్తాత్రేయుడు దైవీక గురువు. అతను శంఖము, చక్రము , గదా, త్రిశూలం, కమండలము (నీటి కుండ) మరియు భిక్షా పాత్రను ధరిస్తారు. దత్తాత్రేయుల వారు “స్మరించినంత మాత్రమునే ప్రసన్నుడవుతాడు” అను నానుడి (స్మరణ మాత్ర సంతుష్టాయ). దత్తాత్రేయ హోమం భౌతిక ప్రయోజనాలైన సంపద, తెలివితేటలను అందిస్తుంది మరియు బ్రహ్మ, విష్ణు ,మహేశ్వరుల ఆశీర్వాదాలను అందిస్తుంది. దత్తాత్రేయుని హోమం అన్ని రకాల పితృ దోషాలను నివారించడం ద్వారా పితృదేవతలకు మోక్షాన్ని అందజేస్తుంది మరియు ఈ హోమ ప్రక్రియ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందడంలో సహాయపడుతుంది.

దేవుడి ఆలయాల్లో దత్త జయంతిని ఘనంగా జరుపుకుంటారు.దత్తాత్రేయ స్వామివారి ఆలయాలు భారతదేశం అంతటా ఉన్నాయి. వారిని పూజించే ముఖ్యమైన ప్రదేశాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్‌ , గుల్బర్గా సమీపంలోని కర్ణాటకలోని గాణగాపూర్, కొల్హాపూర్ జిల్లాలోని నరసింహ వాడి, కాకినాడ సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం ,సాంగ్లీ జిల్లాలో ఔదుంబర్, ఉస్మానాబాద్ జిల్లాలో రుయిబర్ మరియు సౌరాష్ట్రలోని గిర్నార్

అన్నపూర్ణదేవి జయంతి

మార్గశీర్ష పౌర్ణమి అమ్మవారి అవతారాలలో “మాత అన్నపూర్ణ దేవి” అవతరించిన రోజు. అన్నపూర్ణ, అన్నపూర్ణేశ్వరి, అన్నదా లేదా అన్నపూర్ణదేవి శక్తి ఆహారము మరియు పోషణకు ప్రతీక. భక్తులు ప్రతి సంవత్సరం అన్నపూర్ణదేవి జయంతి రోజున వైభవోపేతంగా పూజలు నిర్వహించి, ప్రతి రోజూ వారికి ఆహారాన్ని ప్రసాదిస్తున్నందుకు అమ్మవారికి ఎంతో భక్తితో కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అన్నపూర్ణదేవి కాశీ నగరానికి దేవత, ఇక్కడ ఆమె కాశీ రాణిగా పరిగణించబడుతుంది.

అన్నపూర్ణ దేవితో ముడిపడి ఉన్న కథ ఒకరి జీవితంలో ఆహారం యొక్క ప్రాముఖ్యతను గూర్చి తెలియజేస్తుంది . ఒకరోజు, పరమేశ్వరుడు మరియు పార్వతిమాత భౌతికవాదంపై చర్చలు జరిపారు.పరమేశ్వరుడు భౌతికమైనదంతా కేవలం భ్రమ మాత్రమేనని మరియు అందులో ఆహారము కూడా ఉందని విశ్వసించారు. ఆహారము మనుగడకు అవసరమని, అది భ్రమ కాదని అన్నపూర్ణా దేవి విశ్వసించారు. పరమశివుడి వ్యాఖ్యకు నిరాశ చెందిన పార్వతీమాత అక్కడి నుండి అదృశ్యమవుతారు. ఆమె లేకపోవడం వలన కరువుకు దారితీసి, భూమిపై ఉన్న అన్ని రకాల జీవులు ఆహారము లేకపోవడం వల్ల ఆకలితో అలమటించబడతాయి.

అన్ని జీవులకు ఆహారాన్ని ప్రసాదించడానికిగాను, పార్వతీమాత “అన్నపూర్ణదేవి”గా భూమిపై అవతరిస్తారు.ఇదే “అన్నపూర్ణదేవి జయంతి” ప్రాముఖ్యత.

ఆ విధంగా, పరమశివుడు ఆహారం యొక్క ప్రాముఖ్యతను గ్రహించి మరియు ఆహారం లభించే ఏకైక ప్రదేశమైన వారణాసికి బయలుదేరుతారు.

అన్నపూర్ణదేవి జయంతోత్సవం ప్రాథమికంగా తన భక్తులు ఆహారాన్ని ప్రసాదించే మాతా “అన్నపూర్ణదేవికి” నివాళులర్పించడానికి జరుపుకుంటారు. ప్రజలు వంటగది, పొయ్యి, గ్యాస్ మరియు  ఇతర ఉపయోగకరమైన వస్తువులకు ప్రార్థనలు చేస్తారు.

అన్నపూర్ణ దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే భక్తుల ఇళ్లలో ధనానికి , ఆహారానికి కొరత ఉండదని కూడా నమ్ముతారు.

అన్నపూర్ణాదేవికి అంకితం చేయబడిన కొన్ని ఆలయాలు ఉన్నాయి, వాటిలో ప్రధానమైనది కాశీలోని అన్నపూర్ణాదేవి ఆలయం. ఈ ఆలయంలో ప్రతిరోజూ మధ్యాహ్న ప్రసాదం (అమ్మవారికి ప్రసాదంగా సమర్పించే ఆహార పదార్థాలు) వృద్ధులకు, వికలాంగులకు మరియు పేదలకు పంచిపెడతారు.

అన్నపూర్ణ జయంతి నాడు అన్నపూర్ణ దేవికి అంకితం చేయబడిన దేవాలయాలలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి.

కాశీలో మోక్షాన్ని పొందడానికి, శివుపరమాత్మ తన భక్తులకు సహాయం చేయడంలో నిమగ్నమై ఉండగా, అన్నపూర్ణ దేవి తన భక్తులను చూసుకుంటు మరియు కాశీకి వచ్చిన అన్ని జీవులకు ఆహారం అందుబాటులో ఉండేలా చూస్తుందని కూడా చెప్పబడింది.

సుషుమ్న క్రియా యోగులుగా మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు ఈ మార్గశీర్ష పౌర్ణమి రోజున కనీసం రెండు సార్లు అయినా సుషుమ్న క్రియ యోగ ధ్యానాన్ని  ఆచరించాలి.

Share.

Comments are closed.