2004 డిసెంబర్ 18 నాడు లతగారు కొత్తపేట నుండి కాకినాడ వచ్చి అక్కడ మొదటి సారిగా గురుమాత ఆత్మానందమయి అమ్మగారిని కలుసుకుని అమ్మగారి ముందు కూర్చుని ధ్యాన సాధన చేసే భాగ్యం పొందారు.1987 నుంచి లతగారు డస్ట్ పొల్యూషన్ ఎలర్జీతో బాధపడుతున్నారు.అమ్మగారిని కలిసి మర్నాడు తిరిగి కొత్తపేట వెళ్తున్నపుడు వారిని డస్ట్ ఎలర్జీ అస్సలు బాదించలేదని ఈ రోజుకు కూడా ఎంతో సంబ్రమాశ్చర్యాలతో గుర్తు చేసుకుంటారు లతగారు.1987 లో లతగారి కుటుంబం ముంబైలో స్థిరపడ్డారు అప్పటి నుండి వారు డస్ట్ పొల్యూషన్ ఎలర్జీ వల్ల అస్తమా అంటే ఉబ్బసం వ్యాధితో బాధ పడేవారు ఎంతగా అంటే కనీసం నెలలో ఒకటి రెండు సార్లు అయినా హాస్పిటల్లో అడ్మిట్ అయి నరానికి ఏమినొఫిలిన్ ఇంజెక్షన్ తీసుకోవలసి వచ్చేది.రోజు deleferin టాబ్లెట్స్, ఇన్హేలర్ వాడేవారు. అల్లోపతీలో మంచి గుణం కనిపించక పోవడంతో 1992లో గుజరాత్ లోని అహ్మదాబాద్ వెళ్లి హోమియోపతి మందులు తెచ్చుకున్నారు ఆ మందుల ప్రభావం వల్ల కొంత ఉపశమనం కలిగి నెలకు ఒకటి రెండు సార్లకు బదులు ఐదు ఆరు నెలలకు ఒకసారి హాస్పిటల్ కి వెళ్లి నరానికి ఎమినో ఫైలిన్ ఇంజెక్షన్ తీసుకోవడం మొదలు పెట్టారు.కానీ ఎప్పుడూ వెంట ఇన్హేలర్ మాత్రం ఉండేది.ఈ క్రమంలో 2004 లో అమ్మగారిని కలిసి ధ్యానం మొదలు పెట్టిన తరువాత తిరిగి 2005 విజయ దశమి రోజున సుషుమ్న క్రియా యోగ సాధన మొదలు పెట్టారు .2006 ఫిబ్రవరిలో కాకినాడలో పబ్లిక్ క్లాస్ జరిగినప్పుడు లతగారికి యాంకర్ గా వ్యవహరించే అవకాశం ఇచ్చారు అమ్మగారు.ఉబ్బసం వ్యాధి వల్ల ఎక్కువ సేపు మాట్లాడితే లతగారికి దగ్గు వచ్చేది. యాంకర్ గా చాలా మాట్లాడాలి అదీ స్టేజ్ మీద నా వల్ల అవుతుందా అని మొదట్లో సందేహించిన, గురువుల మీద భారం వేసి సిద్దం అయ్యారు చేతిలో ఇన్హేలర్ పోడియం వద్ద వాటర్ బాటిల్ పెట్టుకుని గురువులను శరణు వేడుతూ కార్యక్రమం మొదలుపెట్టారు.ఆశ్చర్యంగా మూడు గంటలపాటు సాగిన పబ్లిక్ క్లాస్ లో లతగారికి ఒక్క సారి కూడా దగ్గు కానీ ఆయాసం కానీ రాలేదు.ఆ రోజు నుండి ఆయాసం క్రమంగా తగ్గి రెండు సంవత్సరాలలో పూర్తిగా నయం అయిపోయింది.ఇప్పుడు లతగారు ఎటువంటి హోమియో మందులు కానీ ఇన్హేలర్ కానీ లేకుండానే హాస్పిటల్ కి వెళ్లసిన అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యం తో ఉన్నారు అంటే ఇది మన పరమ గురువులు మరియు ఆత్మానందమయి అమ్మగారి ఆశీస్సులే అని ఆర్ద్రతతో చెప్తారు లత గారు.