పసితనం నుంచీ షిరిడీ బాబా భక్తురాలు.చాలా శ్రద్ధ భక్తితో వారిని అర్చించిన ఈమెకు బాబా దర్శనమిచ్చారు ..ఆ రాత్రి కలలో చాలా ఎత్తైన మెట్లు ఉన్న గుడి దగ్గరకు తీసుకువెళ్లి ..నేను ఇంతవరకే నిను తీసుకురాగలిగాను ఆ పైన ఆధ్యాత్మిక పయనం నీదే అని దీవించి అదృశ్యమయ్యారు. భయపడి వెనక్కు తిరగకుండా ఆ మెట్లన్నీ ఎక్కిన ఆమెకు దివ్య సర్పాల దర్శనం, విష్ణుమూర్తి దర్శనమయింది. నేను నీ గురువును కాను మరొక మూడు నెలలకు నీ నిజ గురువు వచ్చి ఉపదేశం ఇస్తారు అని చెప్పారు బాబాగారు. సరిగ్గా మూడు నెలల తరువాత అమ్మగారి దర్శనభాగ్యము సుషుమ్న క్రియా యోగ దీక్ష కలిగాయి…”నీకు వివాహ కర్మ ఉన్నది”అన్న అమ్మగారి ఆశీర్వచనం వలన అనుకూలమైన భర్త లభించారు ఆమెకు. నేను ఏ విషయంలోనూ విజయం పొందలేను … ఆధ్యాత్మికంగా కూడా ఎదగలేనేమో ,నాకు ఎందుకు దివ్య దర్శనాలు జరగవు?! అని తపించిన లక్ష్మీ విజేత గారికి సుషుమ్న క్రియా యోగినిగా మారగానే అద్భుతమైన అనుభవాలు ,సజీవంగా మూడు సార్లు బాబా గారిని దర్శించుకోవడం జరిగాయి… థాట్ లెస్ మైండ్ (ఆలోచనా రహిత స్థితి) అంటే ఏమిటో అని అర్థం వెతికిన ఈమెకు క్రమంగా ట్రాన్స్ ,సమాధి స్థితి అంటే అర్థం తెలిసింది.
నిరంతరం దర్శనమిచ్చే రెండు కళ్లు ఏమిటంటే “నీ పూర్ణాత్మవి”అన్నారు అమ్మగారు…” ప్రతి ఒక్కళ్లనూ బ్రహ్మే సృష్టిస్తారు అన్నది నిజం కాదు.ఒక పూర్ణాత్మ కొన్ని అంశాత్మలను సృష్టి చేస్తారు.అట్లాగే నీ సోల్ ను ఎవరు సృష్టించారో ఆ పూర్ణాత్మ మోక్షం చేరుకునే వరకు కూడా గైడ్ చేస్తారు..నిరంతరం మోక్షపథం వరకు మరలించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు.”అన్న అమ్మగారు నీ పూర్ణాత్మ ఎవరో నువ్వే ధ్యానంలో తెలుసుకో అని ఆశీర్వదించారు… నిరంతర ధ్యానంతో అమ్మగారి ఆశీర్వచనంతో జలపాతం వెనకాల తెల్లచీరతో పెద్ద జుట్టుతో “అరుంధతిమాత” ఆమెకు ఆమె పూర్ణాత్మగా దర్శనమిచ్చారు..
అతి మామూలుగా కనిపించే ఈ సుషుమ్న క్రియా యోగినిలో అమ్మగారు ఏమేమి గ్రహించారు? ఎంత అంతఃదర్శనం చేయించారు?! ఈ సుషుమ్న క్రియ యోగ ప్రయాణం వల్ల ఎంత కర్మరాహిత్యం చేసి అద్భుతంగా ఆమెకు పూర్ణాత్మ దర్శనం చేయించారు?!
ఆధ్యాత్మిక స్థితిలో చిటికెన వేలు పట్టుకుని నడిపించే ఈ గురుమండలరూపిణీ ఎన్ని ఆధ్యాత్మిక సత్యాలు నేర్పిస్తారో? మనకు అర్థమౌతున్న ఈ కొత్త జ్ఞానంతో మరింత ముందుకు వెళదాము.
About Sushumna Kriya Yoga
Recent Posts
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 |
Welcome to the BLISSFUL journey