చిన్నప్పటి నుంచీ భక్తి, భయము – రెండింటి మధ్యా నలుగుతూ పెరిగిన జలంధరగారికి కొన్ని భక్తి పేరుతో జరిగే మూర్ఖత్వాలకు అర్థం తెలిసేది కాదు.కానీ, ఆయుర్దాయము లేదు ఈ పాపకు అని 6వ ఏట ఈమెకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన పులుందుమలై స్వామిగారు ఈమెను నిరంతరము గురువుల రక్షణలో ఉంచారు.భక్తి ,హోమాలు, పూజలు తరువాత మంత్ర జపము, ఉపాసన – ఇలా ఆమె జీవశక్తి ఎదుగుదలకి గురువులు దోహదకారులైనా ప్రాపంచిక కష్టాలు ,మానసిక దుఃఖాలు తప్పలేదు.వీటికి “కర్మ” కారణమని అర్థమైనప్పుడు ఈ సమస్యకు పరిష్కారము క్రియా యోగము అని “ఆటో బయోగ్రఫీ ఆఫ్ యోగి” – “ఒక యోగి ఆత్మ కథ”పుస్తకము చదవమని జలంధరగారి గైడ్ అండ్ ఫిలాసఫర్ అయిన శ్రీ డాక్టర్ గోపాలకృష్ణ గారు సూచించారు.కానీ, అప్పట్లో క్రియా యోగము 3 గంటల ప్రాసెస్ అని, చాలా నియమాలు నిష్టలు ఉంటాయని తెలిసి నిరాశ చెందారు జలంధరగారు.
ఆ అన్వేషణలోనే సుషుమ్న క్రియా యోగుల పరిచయము, వారి అనుభవాలు ఆమెను సంభ్రమ పరిచాయి. వారు 49 రోజుల, 49 నిమిషాల సాధనతోనే, కొందరు అతి మెల్లిగా, కొంతమంది అప్పటికప్పుడే, రోగ విచ్చేదము, 80% కర్మ ధ్వంసము, థర్డ్ ఐ ఓపెనింగ్, వ్యక్తిత్వ వికాసము, ప్రాపంచికమైన లెవల్లో అవసరమైన కోరికలు తీరడం, పదోన్నతి, పెద్ద చదువులు చదువుకోగలగడం, విదేశాలలో ఉద్యోగావకాశాలు, దివ్యపురుషుల దర్శనాలు.. ఒక్కొక్కరి అనుభవం వింటుంటే జలంధరగారికి ఆశ్చర్యమనిపించింది.వీరు చేసినది సాధనే కానీ సర్వస్వానికి కారణం “గురువు” అని అప్పట్లో ఆమెకి అర్థం కాలేదు. షట్ చక్రాల పేర్లు కూడా తెలియని ప్రాపంచిక దృష్ట్యా అమాయకులైన వారు ఇడా పింగళ నాడుల్లో ఎనర్జీ ఫీల్ అవ్వడం, సుషుమ్ననాడి ఛాలన, సహస్రార కమలము – వీటిని ఎలా దర్శించి తమ అనుభవంగా చెప్పగలుగుతున్నారు?!
కానీ, వీరి గురువుగారు అయిన శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయయి అమ్మగారు మాస్ మెడిటేషన్ చేయిస్తారు అని వినగానే కొంచెము కంగారు సందేహము వచ్చాయి జలంధరగారికి… కారణము – ఒక్కొక్కసారి అట్లాంటి మెడిటేషన్స్ లో జరిగే నాడీమండల విధ్వంసం గురించి ఎంతో మంది గురువుల ద్వారా విని ఉన్న జలంధరగారు ఇంతమంది సూక్ష్మ శరీరాల మీద ఆస్ట్రల్ వరల్డ్ లో వ్యతిరేక శక్తుల చేతికి చిక్కకుండా వారి ఆధ్యాత్మిక మార్గాన్ని సుగమము చెయ్యగలుగుతున్న ఈ గురుమాత శక్తి ఏమిటి?! అన్న జిజ్ఞాసతో అమ్మగారిని దర్శించుకున్నారు జలంధరగారు.
అమ్మగారి అద్భుతమైన ఆరా ఫీల్డులోకి అడుగు పెట్టి దయతో ఆమె చేయించిన మెడిటేషన్ వల్ల తన ప్రశ్నలకు జలంధరగారికి జవాబులు దొరికాయి.
శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మగారి సూక్ష్మశరీరము బంగారు, లేత గులాబీరంగు, లేత ఎలక్ట్రిక్ వైలెట్ రంగులతో కలిసి ఉన్నట్లుగా ఉన్న కాంతి పుంజం.ఇంత వయస్సు కూడా లేదు ఆ శరీరానికి వెలుతురులో వెన్నెల ముద్దలా ఉన్నారు. ఒక తామర పుష్పంలో కూర్చొని ధ్యాన ముద్రలో ఉన్న అమ్మగారి చుట్టూ గుర్తు తెలియని అధ్బుత దివ్య మూర్తులు బంగారు భాండాలతో వెలుతురు ధారలు ఆమె మీద అభిషేకిస్తూ ఒక సర్కిల్ లో తిరుగుతున్నారు. ఆమె కాంతి శరీరము ఆ దివ్య కాంతుల్ని ఇంద్ర ధనస్సు వన్నెలుగా తనలోకి తీసుకుంటున్నారు.ఆమె రక్షణ,పుంజీ భూతమైన శక్తి వలయము ఏమిటో జలంధరగారికి అర్థమైపోయింది. ఆమె మహోన్నత ఆత్మజ్ఞాని, నిరంతర ధ్యాని శ్రీ శ్రీ శ్రీ భోగనాథ సిద్ధులు, శ్రీ బాబాజీ గారు ఎన్నుకున్న ఆత్మజ్ఞాన పరికరము.
అమ్మగారి డివైన్ మాగ్నటిజం జలంధరగారికి కొద్దిగా అర్థమైంది. ఆమెకు ఆనాడు రకరకాల సందేహాలకు జవాబులు దొరికాయి.
ఆనాడు ఇన్నర్ సర్కిల్ మీటింగ్ లో శిక్షణ, శ్రద్ధ, ప్రేమాభిమానాలు, భగవంతుడికి జవాబుదారీ లేని చాలా మంది ఉన్నత స్థితులు అందుకుని కూడా కేవలం అహంకారంతో,దక్షిణ మీద ఉండే దృష్టి శిక్షణ మీద లేకపోవడంతో అమాయకులైన శిష్యుల నాడీమండలాలు భగ్నమై సైకిక్ ఎనర్జీస్ చిందరవందర అయి ఉన్న వాళ్ళని ఎలా దారికి తీసుకువచ్చి రక్షించవలసి వస్తుందో చిన్న చిన్న మాటలతో తెలియపరిచారు అమ్మగారు. ఎంత గొప్ప ఆధ్యాత్మిక జనరేటరో అమ్మగారు కొంత వరకు అర్థమైంది జలంధరగారికి.ఆమెలో ఆర్ద్రత, వాత్సల్యం ఆశ్చర్యపరిచాయి. ప్రసాదంగా పటిక బెల్లం పెడుతూ జలంధరగారి కళ్ళల్లోకి చూస్తూ ఎనర్జీ ఇస్తున్నప్పుడు అది ఎంత గొప్ప శక్తి పాతమో అర్థమైంది.జలంధరగారి మెడిటేషన్ అప్పట్లో అది 49 నిమిషాలు కూడా కాదు చేస్తూ ఉండగా శ్రీ భోగనాథ సిద్ధులు ఆయన కాలి బొటనవేలితో ఆమె నుదిటి మీద గట్టిగా నొక్కి పెట్టటం అనుభవమైంది.శ్రీ భోగనాథ సిద్ధులు పలనిలో నవ పాషాణ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం , కొడైకెనాల్ లో దశ పాషాణ విగ్రహం,ఖదిర గ్రామంలో సుబ్రహ్మణ్య యంత్ర రూపం,అమెరికాలోని పెరూలోనూ,నల్లమల అడవుల్లోనూ మరి కొన్ని విగ్రహాలు అవి కూడా ఈ జనరేషన్ లో బయట పడవని అమ్మగారు తెలియపరిచారు. సర్వేశ్వరుడు ఆజ్ఞతో ప్రపంచంలోని ఎనర్జీ బ్యాలన్స్ కోసం ప్రతిష్టాపించారు అని అమ్మగారు తెలియపరిచారు.ఆ క్షేత్రాలన్నీ పుంజీభూతమైన శక్తి క్షేత్రాలు.పలనిలో శ్రీ భోగనాథ సిద్దుల సమాధి వద్ద,కొడైకెనాల్ లో దశ పాషాణ విగ్రహం వద్ద భోగనాథ సిద్ధుల దివ్య దర్శనం అయింది జలంధరగారికి. మెడిటేషన్ అన్న సూక్ష్మ మైన వెలుతురు తీగల సోల్ కనెక్షన్, మన గురువుల కరుణ, రక్షణ ఆమెకి తెలియవచ్చాయి.కేరళలోని శ్రీ నాగార్జున ఆయుర్వేద క్లినిక్ లో శ్రీ భోగనాథ సిద్ధులు వచ్చి ఒక గుళిక ఆమె చేత తినిపించారు.అది ఎనర్జీ కోసమని అమ్మగారు తెలియ పరిచారట. ఒకరోజు మెడిటేషన్ లో తేలు పాము మధ్యగా ఉన్న ఎదో ఒక పురుగు లాంటిది జలంధరగారి మెదడు నుండి బయటకి వెళ్లిపోవడం స్పష్టంగా తెలిసింది ఆవిడకి, అది నెగటివ్ ఎనర్జీ అని తెలియ పరిచారట అమ్మగారు.మరొక రోజు మెడిటేషన్ లో రక్తం కక్కుకున్నారు పరీక్షగా చూస్తే అది నల్లటి రక్తం వెంటనే ఎవరో ఆమెకి ఎదో రంగు రుచి లేని ఔషధాన్ని కల్వంలో నూరి తాగించేసారు.అది కూడా నెగటివ్ ఎనర్జీ అని దానికి విరుగుడు ఔషదంతో ప్రక్షాళన జరిగిందని అమ్మగారు తెలియ పరిచారు.అట్లాగే ట్రైన్ లో ప్రయాణం చేస్తూ శృతకీర్తిగారు అమ్మగారు చేసిన ఇంటర్వ్యూ వింటూ మెడిటేషన్ ముద్ర పెట్టుకుని నిద్రలోకి పోయారు జలంధరగారు.అధ్బుతమైన ఒక విజన్ అమ్మగారిని రక రకాల రూపాల్లో ఒకేసారి రకరకాల స్థలాల్లో చూసారామే అవి డైమెన్షన్స్ అని అప్పుడు తెలియలేదు జలంధరగారికి,ఆవిడ ఉయ్యాల లాంటి దానిలో కూర్చున్నారట ,ఒకేసారి అమ్మగారు ఇన్ని చోట్ల ఉండి ఇంత మందికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అని ఆశ్చర్యపోయారు. అక్కడ కనబడ్డ వాళ్ళ ముఖాలు చాలా తేడాగా విచిత్రంగా ఉన్నాయి. ఉన్నట్లుండి చీకటి పడిందని జలంధరగారు ఇంటికెళ్లాలని మెట్ల లాంటివి దిగి రాగానే అక్కడ కొంత మంది దురుసుగా వెకిలిగా ప్రవర్తిస్తుంటే అమ్మగారు ఎవర్నో పంపించి, పిలిపించుకున్నారు.సారీ అమ్మ! మీరు బిజీగా ఉన్నారని నేను ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను కానీ, కింద వాళ్ళు ఎవరో ఎలాగో ప్రవర్తిస్తున్నారు అని చెప్పగానే “నేను పంపుతాగా అన్నారు”.. విజన్ కట్ అయిపోయింది. అమ్మగారు ఆస్ట్రల్ వర్క్ చేస్తున్న డైమెన్షన్ లోకి జలంధరగారు వచ్చారు అని చెప్పారట అమ్మగారు. జీవితంలో ఎన్నో అల్లకల్లోల సమస్యల మధ్య “నన్ను నన్నుగా” ఉంచిన దివ్య గురువుల ఆశీస్సులకు కృతజ్ఞత తప్ప మరేం చెప్పగలను. జలంధరగారి భావం చాలా బాగుంటుంది ఆమెచేత ఫౌండేషన్ వర్క్ చేయించమని అమ్మగారి ఆజ్ఞ నాకు శిరోధార్యం, “అమ్మగారి ఆశీర్వచనం అంటే ఆ దివ్యాత్మతో అనుసంధానం సన్నిధి దివ్యస్ఫూర్తి” అని నాకు అర్థమయ్యేట్లు చేసిన శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయి అమ్మగారి అనుగ్రహం ఈ అక్షరాల ఆధ్యాత్మిక సాధనకు వెలుగునిచ్చే కరదీపిక.నా అక్షరాలకు నాకు కూడా జీవము, ధ్వని, అర్థము, పరమార్థము కూడా గురువులే అంటారు జలంధరగారు.
About Sushumna Kriya Yoga
Welcome to the BLISSFUL journey