Welcome to the BLISSFUL journey

డా.వంశీ కృష్ణ కుమారి అనుభవాలు

0

ఆయుర్వేద డాక్టర్ అయిన వంశీ కృష్ణ కుమారిగారు నవంబరు 2013 లో సుషుమ్న క్రియా యోగ దీక్ష స్వీకరించి, అత్యంత శ్రద్ధతో గురుమాత పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారి పట్ల సంపూర్ణ విశ్వాసంతో, శరణాగతితో సాధన సాగిస్తున్నారు.వీరు సుషుమ్న క్రియా యోగ సాధనలోకి రాక పూర్వం చాలా సంవత్సరాలుగా దీర్ఘకాలిక చర్మ రుగ్మత అయిన సోరియాసిస్ తో చాలా బాధపడుతూ ఉండేవారు. వంశీ గారికి వ్యాధి చిన్న సింపుల్ ప్లేక్ సోరియాసిస్ గా మొదలై క్రమేపీ పెరిగి క్లిష్టమైన సమస్యాత్మక స్థితికి చేరుకుంది.సోరియాసిస్ వ్యాధి అప్పుడప్పుడు కొంత ఉపశమనం చూపిన మళ్లీ తిరగపెడుతూ ఉంటుంది. కానీ వంశీ గారికి రాను రాను ఉపశమనం అనేదే దాదాపు లేనట్టే అయ్యింది.వ్యాధి తీవ్రత పెరిగి వారిని చాలా బాధించింది ఎంతలా అంటే వారు కృంగుబాటుకు అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు.ప్రారంభంలో పెద్ద పెద్ద ఎర్రటి దురదతో కూడిన ఉబ్బెతు పొట్టు పొట్టు రాలిపోయే చర్మ మచ్చలలా శరీరమంతటా మొదలై క్రమేపి వ్యాధి పెరిగి నొప్పి, సలుపుతో కూడిన చీము బొబ్బలలా తయారయ్యాయి. ఈ స్థితిని పశ్చులార్ సోరియాసిస్ అని అంటారు. సోరియాసిస్ ఏడు రకాలుగా ఉంటుంది.మచ్చల తీరు శరీరంలో ఏ భాగానికి సోకింది వంటి వాటిమీద ఈ వివిధరకాల సోరియాసిస్ ఆధారపడి ఉంటుంది.కొద్ది సంవత్సరాల తరువాత వంశీ గారి వ్యాధి మరింత ముదిరి గోటికి సోకింది గోరులు పచ్చగా రంగు మారి గుంటలు పడి నొప్పితో, సలుపుతో బాధ పడేవారు.దీనిని నేల్ సోరియాసిస్ అంటాము.మరి కొంత కాలానికి సోరియాసిస్ కీళ్ళకు సోకింది చేతి వేళ్ళ కీళ్లు కాలి వేళ్ళ కీళ్లు వాచి నొప్పి, సలుపుతో బాధ పడేవారు.ఇది ఒక రకమైన కీళ్ల వాతం .దీనిని సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటాము.కాలేజీలో చదివే రోజుల్లోనే చిన్నవయసులోనే విపరీతమైన నొప్పి దురదలతో శరీరమంతా పొట్టు పొట్టు మచ్చలతో కీళ్ల నొప్పులతో గోటి వాపులతో బాధ పడటం వల్ల సహజంగానే వంశీగారు ఆత్మన్యూనతతో చాలా కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళారు.తాను స్వయంగా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అవడం వల్లఆయుర్వేదలోని చికిత్స విధానాలన్నీ ట్రై చేశారు.తీవ్రమైన ఆహార నియమాలు,పత్యాలు కూడా చేశారు కానీ ఫలితం లేకపోయింది.అపుడు అల్లోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు.కానీ పెద్దగా గుణం చూపలేదు.స్నేహితుల సలహా మీద కొన్ని హీలింగ్ టెక్నిక్స్ అంటే రేకి లాంటి వాటిలోకూడ తన అదృష్టం పరీక్షించి చూసుకున్నారు కానీ అవి కూడా ఫలితం ఇవ్వలేకపోయాయి.అయితే మందులు వాడినప్పుడు ట్రీట్మెంట్స్ చేయించుకున్నపుడు మాత్రం కొంత ఉపశమనం కనిపించినా. అది తాత్కాలికమే అయ్యింది.విసిగి మందులు మానితే మునుపటికన్న తీవ్ర స్థాయిలో వ్యాధి తిరగబెట్టేది.చాలా సంవత్సరాలుగా బాధపడటంవల్ల తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్ళారు. సరిగ్గా అటువంటి సమయంలో వారు గురువుల కృపకు పాత్రులై గురుమాత పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారి నుండి సుషుమ్న క్రియా యోగ దీక్ష స్వీకరించి సాధన మొదలుపెట్టారు అంతే ఆశ్చర్యంగా తన కళ్ళను తానే నమ్మలేని విధంగా కొద్ది కాలపు సాదనలోనే కీళ్ళవాతం నుండి సంపూర్ణ విముక్తి కలిగింది. తరువాత బాధించే గోళ్ళ సమస్యల నుండి ఉపశమనం కనిపించింది. పూర్వం చర్మంపై చీము బొబ్బలుగా వుండే పశ్చూలార్ సోరియాసిస్ కూడా తగ్గి ఇప్పుడు చాలా కొద్ది మాత్రపు చిన్న చిన్న పొట్టు మచ్చలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇవి కూడా మునుపటిలా దురదతో బాధ పెట్టడం లేదు అంతే కాక మునుపు ఏ మెడిసిన్ ఫలితం చూపలేదు కానీ సాధన చేసుకోవడం వల్ల మిగిలిన కొద్ది మాత్రపు మచ్చలు మెడిసిన్ కి మంచి గుణం చూపిస్తున్నాయి. ఎంతో తీవ్రమైన చికిత్సేలేని వ్యాధితో బాధపడుతున్న తనకు మిరాకిల్ గా నయం చేసిన గురువుల పట్ల కృతజ్ఞతతో వంశీ గారు ఈ రోజు దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ కి పర్మనెంట్ వాలంటీర్ గా తన సేవలను అందించడానికి ధృడ సంకల్పంతో ముందు వరసలో నిలబడి ఉన్నారు.సోరియాసిస్ అనేది వ్యాధినిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధించిన దీర్ఘ కాలిక చర్మరుగ్మత. ఇది ఇంచుమించు జీవితకాలం ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇందులో ఏడు రకాలుగా సోరియాసిస్ ఉంటుంది. వ్యాధి అప్పుడప్పుడు కొంత ఉపశమనం కలిగి ఉన్నా తరచూ పెరుగుతూ ఉంటుంది. ఎంతకాలం ఉపశమనం పొందుతామో లేక ఎంత తీవ్రంగా తిరగబెడుతుంది అనేది వారి వారి వ్యాధినిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఒత్తిడి, చల్లగాలి, కొన్ని ఇన్ఫెక్షన్స్, ఎలర్జీలు, కొన్ని రకాల ఆహార పదార్థాలు, ఈ వ్యాధి తీవ్రత పెంచుతాయి. ఈ వ్యాధికి సంపూర్ణ చికిత్స లేనేలేదు ఎటువంటి మందులు అయినా చికిత్స పద్ధతులైనా కొంత ఉపశమనం కలిగిస్తాయే కానీ నయం చేయలేవు అందుకే ఈ వ్యాధితో బాధపడేవారు తరచూ డిప్రెషన్కు గురవుతుంటారు వంశీగారు కూడా చాలా రకాల సొరియాసిస్ తో బాధపడుతూ తీవ్రమైన కీళ్లవాతంతో బాధపడటం వలన ఆత్మన్యూనతతో డిప్రెషన్ కి గురి అయి ఉన్నారు.అయితే సమయానికి సుషుమ్న క్రియా యోగ సాధన మొదలు పెట్టడం వలన తను సోరియాసిస్ లోని అత్యంత ప్రాణాంతకంగా మారగలిగె ఎరిత్రోడర్మిక్ సోరియాసిస్ నుంచి కాపాడ బడిందనే చెప్పవచ్చు.
ప్రేమ మూర్తి అయిన గురుమాత పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారి దివ్య ఆశీస్సులతో క్రమంతప్పక పూర్తి విశ్వాసంతో తను సాగించే సుషుమ్న క్రియా యోగ సాధనలో తను పొందుతున్న దివ్య ఎనర్జీస్ వల్ల వంశీ గారు ఆనందంగా, ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
ఓం శ్రీ గురుభ్యోనమః

Share.

Comments are closed.