Welcome to the BLISSFUL journey

డాక్టర్.పి. సురేష్ వర్మ అనుభవాలు

0

“సుషుమ్న క్రియా యోగములోకి నేను రావడము కాదు… నన్ను గురువులే తీసుకువచ్చారు. వారి దయ లేనిదే వారి అనుమతి లేనిదే మనము ఏమీ చెయ్యలేము” – అని చెప్పే సురేష్ వర్మ గారి ఈ ఆధ్యాత్మిక దారిలో చాలా చాలా మంచి ముత్యాల వంటి సందేశాత్మక అనుభవాలు దొరుకుతాయి.
తన గురువైన శ్రీ షిరిడీబాబాగారే తనను ఎలా ఇంటర్ పాసైన విద్యార్థిని పై చదువులకు పంపినట్లు సుషుమ్న క్రియా యోగానికి దారి చూపించారు. మొట్టమొదటిసారి ధ్యానంలో గుర్తుపెట్టుకునేట్లు ఏమీ జరుగలేదుట … కానీ ఆ తరవాత ధ్యానం చేస్తూ అమ్మగారిని చూడాలన్న తపనతో ఏమి చెయ్యాలి? అని శ్రీధర్ రాజు గారు అనే సుషుమ్న క్రియా యోగిని అడిగితే “ధ్యానం ముందు ,ధ్యానంలో మీ కోరిక విన్నవించుకోండి తప్పకుండా నెరవేరుతుంది” – అని ఆదేశించగా….అలాగే ప్రార్థించి నిమిషం అమ్మగారిని దర్శిస్తే చాలు అనుకున్న సురేష్ వర్మ గారికి అమ్మగారితో అరగంట గడిపే ఆశీస్సు లభించింది…ఆయన దృష్టిలో అమ్మగారితో సాటి అయిన గురువు ఎవ్వరూ లేరన్న అద్భుతమైన భావన వర్మ గారిది”ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాము ,అవన్నీ ఆటోమేటిక్ గా ఎవరో విని తీర్చినట్లు తీరిపోతాయి అంటే ప్రతి చోట అమ్మగారు లైవ్ లో ఉన్నారు ఎంత త్వరగా పనులు అవుతాయి అన్నది మన సంకల్పాన్ని బట్టి, సాధనను బట్టి ఉంటుంది” అనే సురేష్ వర్మ గారు చాలామంది సుషుమ్న క్రియా యోగులకు అధ్యయన మార్గ దర్శకులు అనిపిస్తారు. “ఇన్ స్టాంట్ రిజల్ట్ కావాలి – అంటే 100% సరెండర్” ఇదే ఆయన చెప్పే మంత్రము.
కాశీ యాత్రలో తిరుగు ప్రయాణంలో భయంకరమైన ఆక్సిడెంట్ అయినా కూడా మొత్తము కుటుంబములో ఎవరికి ఏమీ చిన్న గాయం కూడా అవలేదు అంటే అక్కడ అమ్మగారి ఆశీస్సు ఉన్నదనే కదా! ఇది వారి నమ్మకము. “ఇంత మంచి గురువు ఉన్నప్పుడు మనము వెతుకులాట మానేద్దాము. సరెండర్ అయిపోయి అమ్మగారు చెప్పింది విని ఈ భూమి మీదకు మనం ఎందుకు వచ్చాము ,ఏమి చెయ్యాలి అనేది తెలుసుకుని , ఆ పనులు చేసేసి ,వీలైనంత మందిని సుషుమ్న క్రియా యోగులుగా తయారు చేసేసి అమ్మగారి పాదపద్మములకు అర్పిస్తే చాలు, మిగతా విషయాలు అమ్మగారు చూసుకుంటారు” – అని సుషుమ్న క్రియా యోగులకు కర్తవ్యబోధ చేస్తారు సురేష్ వర్మ గారు. ఇంత అద్భుతమైన అన్యధా శరణం నాస్తి భావన ఉన్నది కాబట్టే కాశి గురు పౌర్ణమి ధ్యానంలో హిమాలయాల్లో , పచ్చదనాల మధ్య కాషాయాంబర ధారిణి అయిన శ్రీ ఆత్మానందమయి అమ్మగారు ఒక గుంత తవ్వి అందులో అద్భుత శ్రీచక్రాన్ని మట్టితో తయారు చేస్తూ, దానిని ఆవుపేడ నీటితో కడుగుతున్న కొద్దీ అది బంగారపు శ్రీచక్రముగా మారి ఆ శ్రీచక్రము మీద త్రిశూలము, డమరుకముగా రూపు దాల్చింది అక్కడ సాటి సుషుమ్న క్రియా యోగులు కూడా ఉన్నారు… శ్రీ చక్ర సంపూర్ణ రూపం సాక్షాత్కరించగానే అమ్మగారి రూపు మారి బంగారు చెక్స్ చీర,ఆభరణాలతో శ్రీచక్రార్చన చేస్తున్నారు. పైనుంచి వస్తున్న అభిషేక పాల ధారకు అందరి కాళ్లు అక్కడ మునిగిపోయాయి…. పూజ తరవాత అద్భుతమైన జలధార, నది లాంటిది కనిపించింది.పక్క గుహల్లో ప్రసాదం తయారు చేస్తున్నారు… ఉన్నట్లుండి శివపార్వతులు అదృశ్యమై శ్రీ వేంకటేశ్వర స్వామి కనబడి అమ్మగారు వారికి హారతి ఇస్తూ గోచరించారు. ఇది వీరికి జరిగిన అద్భుతమైన విజన్.
సురేష్ వర్మ గారి అనుభవాలు చాలామంది సుషుమ్న క్రియా యోగులకు దశానిర్దేశాలు.

Share.

Comments are closed.