చిన్నప్పటినుంచి భక్తితత్వం తెలిసిన కుటుంబంలో పుట్టడం వలన, ఆధ్యాత్మిక బీజాలు నాటుకునే అవకాశము చాలా ఉంటుంది….కొన్ని అనుభవాల వలన “భయం” నిరంతరం జీవితాన్ని వెంటాడుతూ ఉండటం వలన దేవుళ్ళు,భక్తి, పూజలు జరిగే వాతావరణంలో ఉన్నా అభద్రతా భావంతో ఉన్న వ్యక్తిని గురువు ఎట్లా అక్కున చేర్చుకుని ఆస్ట్రల్ బాడీకి ఆధ్యాత్మిక చికిత్స చేసి – అనుభూతి పరంగా నిర్భీతిని, అద్భుత లోకాల దర్శనాలను ఇవ్వగలరా?! అన్న ప్రశ్నకు
శృతకీర్తి గారే నిదర్శనము.
పేరెన్నికగల నృత్యకారిణి అయిన శృతకీర్తిగారు నా నాట్యం ద్వారానే భగవంతుడిని చేరగలను అని నృత్యమే అర్చనగా భావిస్తూ, తన గురువును అన్వేషిస్తూ ఉండేవారు. ఒక మహానుభావుడిని గురువుగా అనుకుంటే వారు స్వప్న దర్శనమిచ్చి “నీ గురువు నేను కాదు” అని చెప్పగానే మళ్ళా గురువును గురించి అన్వేషణ ప్రారంభము అయింది.వీరి తమ్ముడు కౌశిక్ గారికి ఇమ్మని ఎవరో ఇచ్చిన “ఒక యోగి ఆత్మకథ” ఆమెలో ఆత్మతత్వం గురించిన ఆలోచనలు పెంచింది .శ్రీ లాహిరి మహాశయులు శ్రీ మహావతార్ బాబాజీ గారు ఆమెకు ధ్యాన గురువులు అనిపించినా, ప్రత్యక్ష గురువు అవసరము అన్నారు అందరూ… అనవసర ధ్యాన పద్ధతుల వలన తన ఆరోగ్యము దెబ్బ తిన్నది. ఈ అన్వేషణలో విజయగారు అనే సుషుమ్న క్రియా యోగిని ద్వారా సాక్షాత్తు శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయి అమ్మగారి ముఖతః సుషుమ్న క్రియా యోగాన్ని ఉపదేశం పొందారు శృతకీర్తి .వారి తమ్ముడు శ్రీ కౌశిక్ చెప్పినట్లు ఆజ్ఞాచక్రం దగ్గర స్పందన అనుభవించారు…ఆమె అదృష్టం వలన వరసగా 3 రోజులు ధ్యానం, అమ్మగారి సన్నిధి కలిసి వచ్చాయి.అమ్మగారి సన్నిధి విడవలేక పోయినంత అనుబంధము, సత్సంగము,పౌర్ణమి ధ్యానం,దేవతా దర్శనాలు ,గురువుల పటాలనుంచి వెలువడే కాంతి పుంజాలు,సహస్రారంలో విపరీతమైన స్పందనలు ఇవన్నీ అనుభవమయ్యాయి.
ఒంటరి తనంలో భయం వెంటాడే ఆమెకి చిన్నప్పటి భయాల వలన గ్రూప్ మెడిటేషన్ నచ్చేది.ఎరుకలమ్మ జోస్యం చెబుతూ నువ్వు ఏవో తొక్కావు…దుష్ట గ్రహం ఆవరించింది..అన్న మాటలు మళ్లీ భయ భ్రాంతులు కల్పించినా,ఆ సాయంత్రం మెడిటేషన్లో ఒక దివ్యమైన గొంతు ” ఏది మంచి,చెడు అని గ్రహించే జ్ఞానం నువ్వే గ్రహించుకోవాలి”అని చెప్పిన అనుభూతి కలిగింది.49 రోజుల సాధనలో కోపం,చిన్న మాటకే అలజడి పడడం తగ్గిపోయింది.నిరంతరము ప్రాణభీతి,భయము ఉండే శృతకీర్తిగారిని ఏవో భయంకర ఆకారాలు నిద్రలో భయపెట్టేవి.కానీ,తనలోనించి అమ్మగారు లేచి ఆ ఆకారాలను చూపుతోనే నిగ్రహించడము గమనించారు.వారి ఇలవేల్పు శ్రీ కంచి కామాక్షి అమ్మవారిలో గురుదర్శనం అవడం అదొక అపారమైన అనుభవం.వరంగల్ కు అమ్మగారితో కారు ప్రయాణం కేవలము భౌతికమైన గమ్యం మాత్రమే కాదు…అలౌకిక ఆధ్యాత్మిక ప్రయాణంగా మారింది.కొన్ని వ్యక్తిగత కారణాల వలన ధ్యానం కొద్ది రోజులుగా సరిగా లేదన్న ఆమెను కారులో సుషుప్తావస్థకు పంపించారు అమ్మగారు….మెలుకువ వచ్చేటప్పటికి తనలోనించి “అమ్మగారు”లేవడం కనబడింది శృతకీర్తి గారికి…తన సూక్ష్మ శరీరంలో – ఎంత ఎనర్జీ ఇచ్చి ఆధ్యాత్మిక మరమ్మత్తు జరిగిందో అనుభవించ గలిగారు శృతకీర్తిగారు.
స్వప్నంలో అమ్మగారి సేవ, వైజాగ్ లో అమ్మగారు శ్రీ చక్ర స్వరూపిణిగా దర్శనమివ్వడం. మేరువుపైన వజ్రంతో సహా ఆ శ్రీ చక్రం అక్కడ వైజాగ్ అక్కయ్యపాలెం ధ్యాన మందిరంలో భూగృహంలో నిక్షిప్తం అవడం చూశారు శృతకీర్తిగారు.
శృతకీర్తిగారి మాతృమూర్తి కూడా ఉపదేశం పొందడం, తండ్రిగారి ప్రోత్సాహం ,తమ్ముడి ఆధ్యాత్మిక ఔత్సాహం ఆమెను మరింత యోగ మార్గం వైపు అడుగులు వేయిస్తున్నాయి.
శృతకీర్తిగారి గురించి రోడ్డు దాటడానికి భయపడే పిరికి అమ్మాయి అన్న అభిప్రాయం దగ్గరగా తనను చూసిన కుటుంబ సభ్యుల్లో ఉండేది. ట్రాఫిక్ అంటే వణికిపోయే శృతకీర్తిగారికి గురువు అనుగ్రహం వల్ల ఆమె ఆస్ట్రల్ బాడీకి డ్రైవింగ్ నేర్పించారు. ఇప్పుడు శృతకీర్తిగారు నదురు బెదురు లేని మంచి డ్రైవర్ అయ్యారు.
శృతకీర్తిగారి ప్రతి అనుభవం సుషుమ్న క్రియా యోగంలో గురువులను నమ్మాలా వద్దా?! అన్న సందేహం ఉన్న వారికి ఆర్తితో అన్వేషించి తెలుసుకోవాలి అనుకునే వారికి గొప్ప మార్గదర్శకం.
About Sushumna Kriya Yoga
Recent Posts
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 |
Welcome to the BLISSFUL journey