2005 డిసెంబర్ నుండి నేను రోజు సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన చేసుకుంటున్నాను.2009 లో ఒక ఎమర్జెన్సీ సిజేరియన్ ఆపరేషన్ చేశాను. బేబీని డెలివర్ చేసే వరకు ఎటువంటి కాంప్లికేషన్ అనిపించలేదు. బేబీని డెలివరీ చేసి చూసేసరికి మూత్ర సంచి అంటే యూరినరీ బ్లాడర్ లో అరచేయి మందం చిరిగి పోయి కనపడింది.ఒక్క క్షణం మైండ్ పనిచేయలేదు, గురువులను ప్రార్థిస్తూ ఆపరేషన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను. కానీ, బ్లాడర్ ని పూర్తిగా రిపేర్ చేయలేకపోయాను. అప్పుడు యూరాలజిస్ట్ సాయంతో ఆ బ్లాడర్ రిపేర్ కంప్లీట్ చేయాలని నిర్ణయించి, పేషెంట్ ని యూరాలజీ సెంటర్ కి షిఫ్ట్ చేసాము. అప్పుడు సమయం ఉదయం 6 గంటల 15 నిమిషాలు లేదా 6 గంటల 30 నిమిషాలు అవుతుంది ఆ టైంలో గురుమాత పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మ గారికి ఫోన్ చేసి, విషయం అంతా చెప్పాను. అమ్మగారు “నువ్వు టెన్షన్ పడకు నేను చూసుకుంటాను” అని చెప్పారు. అలానే ఆపరేషన్ దానికి సంబంధించిన స్పెషలిస్ట్ తో మాత్రమే చేయించు అని చెప్పారు. మధ్యాహ్నం రెండున్నరకి తిరిగి ఆ పేషెంట్ కి ఆపరేషన్ మొదలు పెట్టాము. తీరా ఆపరేషన్ చేసి చూస్తే ఫీల్డ్ అంతా చాలా నీట్ గా ఉంది ఎక్కడ బ్లీడింగ్ కానీ, వాపు కానీ లేవు చాలా ఆశ్చర్యపోయాను. సాధారణంగా యూరినరీ బ్లాడర్ ని ఒకటికి రెండుసార్లు చేతితో తాకితేనే వాపు వస్తుంది. అలాంటిది అంత పెద్ద ఇంజురీ అయి దాదాపు 8,9 గంటలు అయినా ఫ్రెష్ గా ఉండటం చాలా మిరాకిల్. ఆపరేషన్ కంప్లీట్ చేసిన తరవాత యూరాలజిస్ట్ గారు ఇంజురీ చాలా పెద్దది కదా కాబట్టి పూర్తిగా నయం కాకపోవచ్చు, మళ్లీ మూడు లేక ఆరు నెలల తరవాత మరోసారి ఆపరేషన్ అవసరం పడవచ్చు అని చెప్పారు. నార్మల్ గా బ్లాడర్ కి దెబ్బ తగిలినప్పుడు ప్రత్యేకంగా ప్రసవ సమయంలో బ్లాడర్ ఇంజురీ అయితే మాత్రము అది కంప్లీట్ గా హీల్ కాదు. దానివల్ల యూరిన్ కంటినువస్ గా లీక్ అవుతూ ఉంటుంది. నిజంగా అది చాలా ఇబ్బందికర పరిస్థితి, కానీ చాలాసార్లు కంప్లీట్ గా హీల్ అవక అలా ఇబ్బంది పెడుతుంది. పేషంట్ ని ఐసీయూలో షిఫ్ట్ చేసిన తరవాత, సాయంత్రం 5.30 గంటలకి అమ్మగారికి ఫోన్ చేసి అంతా వివరించాను.అప్పుడు అమ్మగారు చెప్పారు “అలాంటిది ఏది కాదు పేషెంట్ పూర్తిగా కోలుకుంటుంది తనకు ఎటువంటి ఇబ్బంది ముందు ముందు కూడా ఉండదు” అని చెప్పారు. అమ్మగారు చెప్పినట్టే రెండు వారాలలో పేషెంట్ పూర్తిగా కోలుకుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా, సాధారణంగా బ్లాడర్ ఇంజురీ అయితే మూడు వారాలు పడుతుంది కంప్లీట్ గా హీల్ అవడానికి కానీ అమ్మగారి కృపతో ఆ పేషెంట్ రెండు వారాలలోనే కోలుకుంది. ఎందుకంటే… ఉదయం 6.30 గంటలకి నేను ఫోన్ చేసి అమ్మగారికి చెప్పినప్పటి నుంచి సాయంత్రం తిరిగి ఐదున్నర గంటలకి నేను మళ్ళీ ఫోన్ చేసినప్పటి వరకు కూడా అమ్మగారు నిరంతరాయంగా ఆ పేషెంట్ కి ఎనర్జీస్ ఫ్లో చేస్తూనే ఉన్నారు. అందుకే టిష్యూస్ లో ఎక్కడా వాపు లేకుండా ఎంతో ఫ్రెష్ గా ఉన్నాయి అందుకే అవి త్వరగా కోలుకున్నాయి. యూరాలజిస్ట్ గారు ఈరోజుకు కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ఆశ్చర్యపోతూనే ఉంటారు. ఆ కేసు చాలా మిరాకిల్ అండి అని అందరికీ చెప్తూ ఉంటారు. ఇదంతా కేవలం గురు మాత పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారి అద్భుతలీల మాత్రమే అని నేను నొక్కి చెప్పగలను.
ఓం శ్రీ గురుభ్యోనమః.
About Sushumna Kriya Yoga
Welcome to the BLISSFUL journey