అమ్మగారు, హిమాలయ యాత్రలో జరిగిన మరిన్ని అద్భుతమైన అనుభవాల్ని పంచుకుంటూ “గంగోత్రి ఆలయం నుండి తిరిగి కాటేజీకి వెళ్ళాక నేను మళ్ళీ కాసేపు ఎవ్వరిని లోపలికి రావద్దు అన్నాను, అప్పుడే తిరిగి నా శరీరంలోకి నేను ప్రవేశించాను. ఆ తర్వాత మళ్ళీ ధ్యానం జరిగిన ప్రదేశానికి వెళ్ళాం కదా, అక్కడ గంగా నదిలో నిలబడి పర్వతం పై నుండి వారి అనుగ్రహాన్ని వర్షిస్తోన్నబాబాజీ గారికి, వారి శిష్యులకు కృతజ్ఞతలు తెలియజేశాను.
దివి నుండి దేవతలు ఎలా దిగివస్తారో నాకు అక్కడ అనుభవమైంది. గౌరి శంకర్ పీఠం నుండి నేను దిగి రావటానికి పర్వతం ఎలా ఉందొ అలాగే, ఆ పర్వతానికి సమాంతరంగా ఒక కాంతి ఏర్పడింది.ఆ కాంతి కదులుతూ నన్నుకిందకు దించింది. ఈ అనుభవం కలగటం అదే మొదటిసారి” అన్నారు అమ్మగారు