Welcome to the BLISSFUL journey

Day 46 – అమ్మగారు మాకు అందించిన దివ్య శిలలు

0

అమ్మగారు మరిన్ని ఆసక్తికర విషయాలు చెప్తూ….  “అలాగే మహావతార్ బాబాజీ గారి శిష్యురాలైన షణ్ముఖి మాతాజీ గారు మీతో ధ్యానం చేయించి, మీకు గంగా నదిలోని రాళ్లను అందిస్తున్నప్పుడు, బాబాజీ గారు, 49 మంది శిష్యులతో పాటుగా షణ్ముఖి గారి దేహంలో నేను కూడా ఉన్నాను. సూక్ష్మ దేహాల ద్వారా మేము పైనుండి చూస్తున్నాము. మీకు ఎదురుగా ఉన్న పర్వతాల దగ్గర నుండి బాబాజీ గారు శక్తిని ప్రసరిస్తున్నారు. మీరు అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడి భూ భాగమంతా గుండ్రంగా తిరిగింది. అదంతా నేను పై నుండి తిలకిస్తున్నాను. ధ్యానం చేయించాక షణ్ముఖి గారు, నా శరీరంలో నుండి పైకి నన్ను చూశారు”. అని చెప్పారు అమ్మగారు.
అమ్మగారు చుట్టూ ఉన్న శిష్యులందరితో “ఇంతకీ మీకు అందించబడిన రాళ్లు ఏమిటో తెలుసా?”అని అడిగారు.
“అవి పెట్టుకొని ధ్యానం చెయ్యాలి అనుకున్నాం అమ్మా” అని కొందరు అన్నారు. “అమ్మా శివ లింగం అనుకున్నాం” అన్నారు ప్రశాంతమ్మ. ఇంకొందరు శివ పార్వతులని, శాలిగ్రామమని సమాధానాలు చెప్పారు.

Share.
Leave A Reply