Welcome to the BLISSFUL journey

Day 33 – ఆకాశ గంగే , పావన గంగ

0
ఆకాశ గంగను దివి నుండి భువికి తీసుకురావటం కోసం కఠోర తపస్సు చేశారు భగీరథుల వారు.
“సకల కలుష భంగే
స్వర్గ సోపాన గంగే
తరళ తరంగే
దివి గంగే”
సకల కలుషాన్ని తన శక్తితో నశింపచేసి, తరళ కాంతులీనుతూ, భూమిని పావనం చేయటానికి స్వర్గం నుండి దిగి వచ్చిన నది గంగ. ఆ పుణ్య నదిని మానవుల శ్రేయస్సు కోసం కఠోర తపస్సుతో భూపైకి తీసుకు వచ్చిన మహా పురుషులు భగీరథ మహర్షి. భగీరథ మహర్షి తపస్సుకు మెచ్చిన ఆకాశ గంగ, స్వర్గ సీమ నుండి కిందకు కదిలింది. ఆ పుణ్య నది స్పర్శతో భూమాత శాంతించిందని పురాణాలు చెబుతాయి. గంగమ్మ భూమిపైకి వచ్చాక ఆ ఉధృతికి ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. గంగమ్మ ప్రవాహాన్ని అదుపు చేసే శక్తి కేవలం పరమ శివుడికి ఉండటంతో ఆయన గంగను తన జటాజూటంలో నిర్బంధించి ఆయన సిగ నుండి ధారగా గంగను ప్రవహింప చేశారు. భగీరథుల ద్వారా భువికి వచ్చిన నది కాబట్టి గంగను భాగీరథీ అంటారు. ఆ భాగీరథీ నది వద్దకే వెళ్ళాం.
Share.
Leave A Reply