Welcome to the BLISSFUL journey

Day 27 – అమ్మగారి పాద స్పర్శతో పునీతమై పులకించిన ప్రకృతి మాత

0

అమ్మగారితో పాటు కాసేపు సేద తీరాక, పయనం ఆరంభించాం. అప్పటికే చాలా దూరం నడిచాం కానీ కను చూపు మేరలో ఆలయం జాడ లేదు. చాలా ఎత్తుకు వెళ్ళాం. అక్కడి నుండి కిందకి చూస్తుంటే భూమికి, ఆకాశానికి మధ్యలో మేము ఉన్నట్లు ఉంది. వంశీ గారు ఒక చోట బాగా నీరస పడి ఇక ఎక్కలేను అన్నట్లు నిలబడి పోయారు. అమ్మగారు కాసేపు వారి వంక చూస్తూ… అమ్మగారి నేత్రాలతోనే వారిలో శక్తిని నింపారు. కొద్ది సేపటికి శక్తి పుంజుకున్న వంశీ గారు, లేడి పిల్లలాగా చెక చెకా పర్వతం ఎక్కటం ప్రారంభించారు. వారిస్థితికి వారికే ఆశ్చర్యం కలిగింది. అమ్మగారు మాత్రం యువ బృందంతో సమానంగా నడుస్తూ, వెనక బడిన మా బృందంలో కొందరిని గురించి ఆరా తీస్తూ, వెనక బడిన వారికి తోడుగా కొందరిని ఉండమని చెప్పి ముందుకు సాగారు. ఇంకొంత దూరంలో గుడి ఉంది అనగా, మాకు కుడి భాగంలో ఒక పెద్ద పర్వతం కనిపించింది. ఆ పర్వతం పై మంచు. ఆ పర్వతానికి ఆవలి వైపు సప్త ఋషులు తపస్సు చేస్తారని చెప్పారు అక్కడి గైడ్. ఆ పర్వతానికి నమస్కారం చేస్తూ కళ్ళు మూసుకునే సరికి ఎంతటి శక్తి ప్రకంపనలు కలిగాయంటే, ఆప్రాంతమంతా కదలి పోతున్నట్లు అనిపించింది. ఆ ప్రదేశంలోని ప్రతీ అణువు పవిత్రమే. అందునా, మహా గురువైన అమ్మగారి పాద స్పర్శతో మరింత శక్తిమంతంగా వెలిగిపోతున్నది ఆ పుణ్య సీమ. అమ్మగారు ఆ ప్రాంతానికి వచ్చారని, యమునా నది పరవశంతో ఉరకలు వేస్తూ ఉంటే, దేవతా వృక్షాలు ఆనందంగా తలలూపుతున్నాయి, అమ్మగారి రాకను గురించి చెబుతూ గాలులు సవ్వడులు, సందడులు చేస్తున్నట్లు తోచింది.

పర్వతం పైకి నడిచి వెళ్లిన మేము నదిలో స్నానం చేయలేకపోయాము.

Share.
Leave A Reply