అమ్మగారి వద్ద సుషుమ్న క్రియా యోగ దీక్ష తీసుకొని, చాలా సంవత్సరాలుగా సాధన చేస్తోన్న తేజ, తనకు చెట్టు ద్వారా కలిగిన తొలి ధ్యాన అనుభవం గురించి ఇంకా ఇలా చెప్ప సాగారు “ఈ ప్రపంచంలో రక్త సంబంధీకులు, ఆశ్రితులైన వారే మన కర్మల భారాన్ని తీసుకునేందుకు ఇష్టపడరే…! అటువంటిది నా కర్మ భారాన్ని మోసేందుకు అంగీకరించిన ఆ వృక్ష దేవత ఎంతటి కరుణామయి..?” అనుకుంటుండగా చాలా అధికంగా తనకు కర్మ క్షయం జరిగినట్లు చెప్పారు తేజ. తన అనుభవం విన్న మాకందరికీ జ్ఞానోదయం కలిగింది. అమ్మగారు చెప్పిన ప్రక్రియను చేశాము కానీ, అమ్మగారు నిరంతరరం నొక్కి వక్కాణించే “భావం” ఇలా ఉండాలి కాబోలు అని అర్ధమైంది. అందుకే సాధకులంతా ఒక్క విషయాన్ని మాత్రం పదే పదే పునశ్చరణ చెసుకోవాలి. అదే “గురువే నా దైవం” అని. ఆ ‘భావ’ ప్రవాహంలో లీనం కాగలిగితే ఇక ఆనందమే ఆనందం.