Author: Live
ఫిబ్రవరి నెలలో వచ్చే పౌర్ణమి మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమిని, మహా మాఘ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఇది పవిత్రమైన పౌర్ణమి రోజులలో ఒకటి. ఇది మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు, ఇది జనవరి మధ్య నుండి ఫిబ్రవరి మధ్య లో ఒక రోజున వస్తుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 16న వస్తుంది. మాఘ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత మాఘ మాసం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు ఉత్తర మార్గంలో అస్తమిస్తాడు. మాఘ పౌర్ణమి తో మాఘ మాసం ముగుస్తుంది మరియు మాఘ మాసంలోని శుక్ల పక్షం యొక్క ముగింపును కూడ సూచిస్తుంది. ఈ పవిత్రమైన రోజును తమిళనాడులో “మాసి మాగం” లేదా “మాసి మహం” గా జరుపుకుంటారు. మాఘ పౌర్ణమి సాంస్కృతికంగా మరియు ఆధ్యాత్మికంగా అర్ధవంతమైన / ముఖ్యమైన రోజు. మాఘ పౌర్ణమి, బౌద్ధమతస్తులకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి…