Author: admin

పౌర్ణమి అనగా ఏమి ? సంస్కృతంలో పౌర్ణమి అనగా “పూర్ణ చంద్రుడు” అని అర్థము.పూర్ణ చంద్రుడుని కలిగిన రోజును పూర్ణిమ అని ఉత్తరభారత దేశంలో, పౌర్ణమి లేదా పౌర్ణిమ అని దక్షిణ భారత దేశంలో పిలుస్తారు.హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజును శుభదినంగా భావిస్తారు. చంద్రమానము ప్రకారము ఈ పౌర్ణమి ప్రతినెలా వస్తుంది. కొన్నిసార్లు పౌర్ణమి ఒక నెలలో రెండు సార్లు వస్తుంది.దీనినే “బ్లూ మూన్ ” అని కూడా అంటారు. నెలలో రెండు పౌర్ణములు వచ్చిన సంవత్సరము 13 పౌర్ణములు అవుతాయి. పౌర్ణమి సమయంలో చంద్రుడు సంపూర్ణంగా, కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటాడు. పూర్ణ చంద్రుడు అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింపచేయడానికి ప్రతీక. ఈ శుభదినాన చంద్రుడు భూమి చుట్టూ తిరిగి ఒక చక్రాన్ని పూర్తి చేస్తాడు.ఇది మనిషి జీవితంలో ఒక అధ్యాయాన్ని ముగించి మరొక నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్నట్లుగా భావిస్తారు. పౌర్ణమి అనేది ఒక నెలను రెండు సమాన…

Read More