కార్పొరేట్ ఆఫీసులో పనిచేస్తూ, అత్యాధునికమైన వాతావరణంలో వుంటున్న అంకిత గారు,తమ వైష్ణవ గురువుగారి ఆదేశము,నాడీ జ్యోతిష్యము, మంచి స్నేహితుడైన మోహిత్ గారి నమ్మకము చూసి సుషుమ్న క్రియా యోగానికి అంత త్వరగా ఎట్లా అంకిత భావము పెంపొందించుకున్నారు?!ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం.
ఆమె 12వ క్లాసులో ఉండగా స్నేహితులతో కలిసి నాడీ జ్యోతిష్యము సరదాగా చూపించుకున్నప్పుడు ఈమెకు చాలా కష్టాలు పడవలసిన జాతకము,పూర్వజన్మ కర్మల వలన ఈమెకు ఉద్యోగము వివాహము ఈ రెండూ పద్ధతిగా అమరే ప్రశక్తే లేదు – కానీ, అని పరిహారము చెప్తూ ఈమె దక్షిణ భారతదేశంలో ఒక సుప్రసిద్ధ శైవక్షేత్రంలో తన గురువుతో కలిసి శివాభిషేకం చేస్తే ఈమె కష్టాలు తీరుతాయి అని చెప్పి అంతా క్యాసెట్టుగా రికార్డు చేసి ఇచ్చారు.కాలక్రమేన ఆ విషయమే మరిచిపోయారు అంకిత.
ఆమె ఉత్తర భారతదేశానికి చెందిన యువతి చాలా సాంప్రదాయబద్ధమైన వైష్ణవ కుటుంబంలో జన్మించారు తన 16వ ఏట నుంచి శ్రీ కృష్ణుల వారిని, కుల గురువును స్మరించి,అనుసరించి బ్రతికిన యువతి. 2013లో ఆమె వైష్ణవ గురువు ఆమెతో అంకిత!ఇంక మీదట నీకు ఈ జన్మలో మార్గదర్శకులైన గురువు వస్తారు నేను ఈరోజు నుంచి నీ గురువును కానమ్మా! అని చెప్పినప్పుడు అంకిత అవాక్కయిపోయారు. ఆమె కొలీగు, మంచి స్నేహితుడైన మోహిత్ గారు గురుపౌర్ణమికి అమ్మగారికి అంకిత కష్టాలు చెప్పి అనుమతి తీసుకుని శ్రీశైలం గురు పౌర్ణమికి తీసుకువచ్చారు అదే అమ్మగారి తొలిదర్శనం.సుషుమ్న క్రియా యోగ ఉపదేశం “నీ స్థానం ఇక్కడే” అన్న అమ్మగారి ఆదేశం, అమ్మగారు చేసిన శక్తిపాతం, ఆ తరువాత అమ్మగారితో అంకిత మోహిత్ ప్రత్యేకంగా శ్రీ మల్లిఖార్జున స్వామికి చేసిన అభిషేకము – వీటితో శాప విముక్తి అయిందా అన్నంత అద్భుతాలు జరిగి,మోహిత్ గారితో వివాహము,మంచి ఉద్యోగము,ఆత్మ దిశానిర్దేశము అన్నీ గబగబా జరిగిపోయాయి.ఆ తరవాత ఆ నాడీ జ్యోతిష్యము కాసెట్టు విన్నప్పుడు ఆమె సంభ్రమాలకు లోనైంది.
మోహిత్ ఉద్యోగరీత్యా దూరంగా వెళ్ళినా ఆమె ఒంటరితనం ఒక ఆశీర్వచనంగా మారింది.కారణం అమ్మగారికి మరింత దగ్గర అయింది అంకిత.అమ్మగారి ఆదేశంతో రెండు వేళలా ధ్యానం చేసేవారు అంకిత…ఒంటరితనంలో గురువు తోడుగా వుంటారు అన్న గొప్ప అనుభవం ఆమెది…సంపాదనలో ఆరవ వంతు సత్కార్యాలకు వినియోగించాలి అన్న అమ్మగారి ఆదేశం,ఇంకా ఎక్కువగా ఫౌండేషన్ కు ఏ రూపంలో ఇవ్వాలా? అనుకున్నప్పుడల్లా జీతం పెరగడం ..ఇటువంటి అద్భుతాలు ,మిగతా వారి అనుభవాలు విని అంకిత శరణాగతి మరింత పెరిగింది.శివరాత్రి రోజున రాత్రి 12 గం.నుంచి 3 గంటల మెడిటేషన్ లో పరమేశ్వరుడి గజ్జల శబ్దము ఆ స్వామి నిశ్శబ్ద ఆశీస్సు అర్ధమయ్యాయి మోహిత్ అంకిత దంపతులకు.ముగ్గురు గురువులు దివ్యసర్పమైన శేషుడి తలపై యోగముద్రలో దర్శనమివ్వడం,పలనిలో శ్రీ భోగనాథ మహర్షి గారి సమాధి వద్ద 7 నిమిషాల మెడిటేషన్ లో థర్డ్ ఐ తెరుచుకుని కాంతి పుంజాలు వెదజల్లడము ,ఆ తరవాత ఎప్పుడు స్మరించినా భోగనాథ సిద్ధుల వారు ఆజ్ఞా చక్రంలో దర్శనమివ్వడము – రెండు కళ్లు యోగ దృష్ఠిగా నిలిచిపోవడము – ఇట్లా ఏదైనా కంటితో చూస్తే కానీ నమ్మలేను అనుకునే అంకిత గారికి, అమ్మగారి దయ వలన అనేక దివ్యానుభూతులు ఆశీస్సుగా పొందారు.
విద్యావంతులు, సంస్కార వంతులు, మాట,ఆలోచన,చేత కూడా ఏకోన్ముఖంగ ఉండే అంకిత వంటి సుషుమ్న క్రియా యోగులు – మన ఫౌండేషన్ లో పూర్తి శరణాగతితో సర్వీసు చెయ్యగలరని, వారిని దిశానిర్దేశం చేస్తూ భౌతికంగా,ఆర్థికంగా,ఆధ్యాత్మికంగా అనేక ఉన్నత సోపానాలు అధిరోహింప చేస్తున్న అమ్మగారి నిర్దేశికత్వానికి ప్రణామాలు అర్పిద్దాము.
About Sushumna Kriya Yoga
Welcome to the BLISSFUL journey