Welcome to the BLISSFUL journey

ఈ మహాశివరాత్రికి మీ చైతన్య శక్తిని పెంపొందించుకోండి

0

మన ఋషులు నిర్దేశించిన నాలుగు పురుషార్థాలు (మానవ జీవిత లక్ష్యాలు) ధర్మము, అర్థము,కామము మరియు మోక్షము.  అంటే జనన మరణ చక్రము నుండి తప్పించుకోవడం కొరకు మోక్షమే అంతిమ లక్ష్యం. సుషుమ్న క్రియా యోగం, జనన మరణ చక్రాల నుండి ముక్తిని సుసాధ్యం చేసే ప్రక్రియ.

ప్రతి నెల 14వ రోజున, కృష్ణ పక్షంలో అమావాస్య ముందు రాత్రి  శివరాత్రిగా జరుపుకుంటారు. ప్రతి శివరాత్రి నాడు రాత్రి మానవ వ్యవస్థలో  శక్తులు సహజంగా అధికము అవుతాయి. ఈ శక్తిని నిటారుగా ఉండే వెన్నుపాము లేదా వెన్నుముకను కలిగి ఉన్నవారు మాత్రమే వినియోగించుకోగలరు. మానవులు మాత్రమే నిలువు వెన్నెముక స్థాయికి పరిణామం చెందారు. కాబట్టి, శివరాత్రి రోజున ఆ  రాత్రి వెన్నెముకను నిటారుగా మరియు నిలువుగా ఉంచడం వల్ల అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. అందువల్ల సుషుమ్న క్రియా యోగులందరూ శివరాత్రి రోజున 49 నిమిషాల అర్ధరాత్రి ధ్యానం చేయాలని తెలియజేయడం జరిగింది .

మాఘమాసం (దక్షిణ భారతదేశంలో) మరియు ఫాల్గుణ (ఉత్తర భారతదేశంలో) మాసంలో వచ్చే శివరాత్రిని “మహాశివరాత్రి” గా జరుపుకుంటారు,  కారణం సంవత్సరం లో ఇతర సమయాల కంటే ఈ శివరాత్రి నాడు శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. కాబట్టి, ఈ విశ్వ శక్తిని సద్వినియోగం చేసుకోవడానికి, వివిధ శివరాత్రి సంప్రదాయాలు అన్నీ కూడా మన సాధనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఉపవాసము చెయ్యటం వలన  శరీరము తేలికై ధ్యానానికి అనుగుణంగా ఉంటుంది. రాత్రంతా మేల్కొని  మన వెన్నుముకను నిటారుగా ఉంచి కూర్చోవడం వలన  మనము సాధ్యమైనంత ఎక్కువ శక్తిని గ్రహించగలము.

మీరు సరిగ్గా గమనించినట్లయితే, పురాణాలలో చాలా వరకు శివరాత్రికి సంబంధించిన కథల ద్వారా ఈ రోజున ఆచరించే వివిధ పద్ధతులను గురించి తెలియజేయడం జరిగింది.

సముద్ర మంథనం జరిగినప్పుడు  ఉద్భవించే విషాన్ని (హాలాహలం) పరమేశ్వరుడు సేవించారని,  ఆ విషము శివునిపై ప్రభావం చూపకుండా దేవతలు రాత్రంతా మేల్కొని వున్నారని ఒక పురాణము చెబుతోంది. చివరికి ఆ హలాహలము శివునికి ఎటువంటి హాని కలిగించలేదు, కానీ వారి గరళము నీలి రంగులోకి మార్పు చెందింది. అప్పుడే శివునికి “నీలకంఠ” అనే పేరు వచ్చింది. అప్పటి నుండి, ఆ రాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు.

మరొక పురాణం ప్రకారం శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడని మరియు రాత్రి కళ్యాణోత్సవం జరుపుకుంటారని ప్రతీతి . దీని అర్థం శివుడు అనగా ఆదియోగి, మొదటిసారిగా శక్తి (పార్వతి)తో ఏకమైనప్పుడు భౌతిక సృష్టి ప్రారంభమైంది. అందువల్ల ఈ రోజున ఉన్న శక్తులు సుషుమ్న క్రియా యోగులు ఉన్నత స్థాయికి ఎదగడానికి మరియు దైవికమైన , స్వచ్ఛమైన చైతన్యానుభూతిని పొందటానికి పూర్తి అవకాశాన్ని కల్పిస్తాయి.

కావున మన చైతన్య శక్తిని పెంపొందించుకోవడానికి ఈ దివ్యమైన రోజును సద్వినియోగం చేసుకుందాం, దైవత్వంతో ఏకం కావడానికి ఒక పెద్ద అడుగు వేద్దాం.

Share.

Comments are closed.