మాస శివరాత్రి అనేది పరమశివుడికి అంకితమైన నెలవారి పండుగ. మాస శివరాత్రిని ప్రతినెలా 14వ రోజు కృష్ణపక్షంలో జరుపుకుంటారు .
ఇది అమావాస్యకి ముందు రోజు రాత్రి అవుతుంది.మాఘ మాసం (దక్షిణ భారతదేశం) / ఫాల్గుణ మాసం (ఉత్తర భారతదేశం) లోని శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. చాంద్రమానము ప్రకారం నెలలో రెండు పక్షాలు ఉంటాయి. అమావాస్యతో నెల మొదలవుతుంది.
పక్షం అనగా 15 రోజులకు లేదా 14 రాత్రులకు సమానమైన ఒక కాలమానము లేదా చంద్ర దశను సూచిస్తుంది. అక్షరాల “వైపు” అని అర్థము పక్షం అనేది పౌర్ణమి రోజుకి ఇరువైపులా ఉంటుంది. అమావాస్య నుంచి పున్నమి వరకు రోజు రోజుకూ చంద్రుడితో పాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా , కాంతివంతంగా అవుతాయి. శుక్ల అంటే తెలుపు అని అర్థం .
మొదటిది శుక్లపక్షం.పున్నమి నుంచి అమావాస్య వరకు రోజు రోజుకూ చంద్రుడితో పాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. కృష్ణ అంటే నలుపు అని అర్థము. రెండవది కృష్ణపక్షం.
స్వప్న , జాగ్రృద , సుషుప్తావస్థలను ప్రకాశింపచేసే అత్యున్నత చైతన్యతమే శివ పరమాత్మ / శివుడు. శివ పరమాత్మ ఆశీర్వాదము కోసం శివ భక్తులు ఈ రోజు ఉపవాసమును ఆచరిస్తారు.ప్రతి శివరాత్రి రాత్రికి మానవ వ్యవస్థలో సహజంగా శక్తి పెరుగుదల ఉంటుంది. ఈ శక్తిని నేరుగా నిలువు వెన్నుపాము లేదా వెన్నుముక ఉన్నవారు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. మానవులు మాత్రమే నిలువు వెన్నెముక స్థాయికి అభివృద్ధి చెందారు. అందువల్ల, శివరాత్రిరోజు రాత్రి వెన్నెముకను నిటారుగా మరియు నిలువుగా ఉంచడం వల్ల అపారమైన ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల సుషుమ్న క్రియా యోగులందరూ శివరాత్రి రోజున 49 నిమిషాల అర్ధరాత్రి ధ్యానం చేయాలని సూచన చేయబడింది.